ముఖేేష్ చిన్నప్పటి నుండి వాగుడు కాయ.పెద్దవాడు అయినప్పటికీ ఆ అలవాటు పోలేదు.నలుగురూ కూర్చుని మాట్లాడుకుంటుండగా నాకే అన్ని తెలుసు అన్న విధంగా మధ్యలో కల్పించుకుని తగుదునమ్మా అంటూ ఉచిత సలహాలు ఇవ్వడం మొదలుపెట్టాడు.అది మంచి పద్ధతి కాదని చెప్పినా ఆ అలవాటు మానుకోేలేకపోతున్నాడు.చివరకు అందరూ నువ్వు పిల్ల పిత్తరి గాడివి నోరుమూసుకో! అనడం మొదలుపెట్టారు.ఆ దెబ్బతో దాదాపుగా ఆ అలవాటు మానుకున్నాడు.
Tuesday, 29 May 2018
Monday, 28 May 2018
దోసె పెనం కి అంటుకోకుండా ఉండాలంటే
దోసె పెనం కి అంటుకోకుండా ఉండాలంటే ముందు రోజు రాత్రి పెనం కి నూనె రాసి ఉదయం దోసె వేసుకుంటే ఏ విథంగా కావాలంటే ఆ విధంగా వస్తుంది.
Thursday, 24 May 2018
ధూమ శకటం
నరేశ్ చిన్నప్పుడు పాఠశాలలో చదువుకునే రోజుల్లో తెలుగు ఉపాధ్యాయుడు ఒకరు పిల్లలను అచ్చ తెలుగులో మాట్లాడని వాళ్ళని గోడ కుర్చీ వేయమని చెప్పేవారు.వాళ్ళ ఊ రికి ఆ రోజుల్లో ఒక పొగ బండి మాత్రమే వచ్చేది.పొగ బండి(రైలు బండి) అంటే ధూమ శకటం అనాలని, స్టేషన్ అంటే ధూమ శకట విరామ స్థలం అనాల్సిందేనని గట్టిగా చెప్పేవారు.కొంత మందికి నోరు తిరిగేది కాదు.అయినప్పటికీ పిల్లలందరికీ వచ్చేవరకు గట్టి పట్టు పట్టి చెప్పించేవారు.ఇంతకీ ధూమ శకటం అంటే రైలు బండి.
Subscribe to:
Posts (Atom)