Showing posts with label చిట్కాలు. Show all posts
Showing posts with label చిట్కాలు. Show all posts

Thursday, 2 August 2018

చర్మానికి తేమ

                                                              కాలం మారిందంటే చాలు వాతావరణంలో మార్పుల వల్ల చర్మంలో తేమ శాతం తగ్గి చర్మం పొడిబారుతుంది.ముందస్తు ప్రభావం ముఖం,మెడ చర్మంపై పడుతుంది.దీన్ని అధిగమించాలంటే ఒక చెంచా నారింజ తొక్కల పొడి,ఒక 1/2 చెంచా తేనె,ఒక అర చెంచా ఓట్స్ పొడి వేసి ఒకసారి కలిపి మళ్ళీ దానికి సరిపడా నీళ్ళు పోసి పూత వేయడానికి వీలుగా అంటే పలుచన,మరీ ముద్దలా కాకుండా కలుపుకోవాలి.దీన్నిముఖానికి,మెడకు పూత వేసి ఒక 15 ని.ల తర్వాత కడగాలి.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తుంటే చర్మానికి తేమ అంది చర్మం నిగనిగలాడుతుంది.

Monday, 29 May 2017

ఎల్లప్పుడు మీవెంటే

                                                                          ప్రయాణాలు చేస్తున్నప్పుడు వాతావరణం ఒక ప్రదేశానికి ఇంకొక ప్రదేశానికి మారుతూ ఉంటుంది కదా!దీనితో చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది.పెదవులు ఎండిపోయి పొట్టులేచినట్లుగా,కళావిహీనంగా తయారవుతాయి.అందుకే ఎల్లప్పుడూ మాయిశ్చరైజర్,లిప్ బామ్ తప్పనిసరిగా మీవెంట తీసుకెళ్ళాలి.వీలయితే ఒక క్రీమ్ కూడా వెంటే అట్టిపెట్టుకోవడం మంచిది.మధ్యమధ్యలో ముఖం కడిగి తుడుచుకుని ముఖానికి,చేతులకు,పెదవులకు రాసుకుంటే ఎలాంటి వాతావరణంలో అయినా చర్మం,పెదవులు తేమను కోల్పోకుండా,చర్మం,పెదవులు పగలకుండా అందంగా ఉంటాయి.వీటితోపాటు మంచినీళ్ళ సీసా తీసుకెళ్లడం మాత్రం మరిచిపోకండి.

Sunday, 28 May 2017

పాలిష్ అయిపోయిందా?

                                                         బూట్లకు వాడే పాలిష్ అయిపోయిందా?కంగారు పడకండి.చిన్న స్పాంజి ముక్కపై చేతులు శుభ్రపరచే ద్రవం తీసుకుని బూట్లకు పాలిష్ లాగా వాడుకోవచ్చు.చక్కగా మెరుస్తాయి.

Friday, 28 April 2017

పార్శ్వ నొప్పికి....

                                                                                  రోజూ ఉదయం పరగడుపున ఒక గ్లాసు ద్రాక్షరసం తాగటం వల్ల పార్శ్వనొప్పి తగ్గుతుంది.రోజూ కొన్ని ద్రాక్ష పళ్ళు ఏదో ఒక సమయంలో నోట్లో వేసుకోవటం వలన నిద్రలేమి,తలనొప్పి వంటి వాటితోపాటు రక్తనాళాల్లో అడ్డంకులు తొలగిపోతాయి.త్వరగా ఎముకలు గుల్లబారకుండా ఉంటాయి.తినే ముందు ఉప్పునీటిలో వేసి ఒక అరగంట నానబెట్టి శుభ్రంగా కడగటం మాత్రం మరచిపోకండి.శుభ్రంగా కడిగిన ద్రాక్ష పళ్ళు మాత్రమే తినాలి.

Thursday, 27 April 2017

అందరిలో అందంగా

                                                             ముఖంపై చర్మం నిగనిగలాడాలంటే ఏదో ఒక క్రీమ్ రాసుకోవడం కాకుండా కొన్ని పద్దతులు తప్పనిసరిగా పాటించాలి.ఆహారంలో మార్పులతోపాటు సహజ సిద్దమైన పూతలు వేసుకుంటూ నీరెండలో నడక,వ్యాయామం చేయాలి. ప్రతిరోజూ పరగడుపున కారట్,దానిమ్మ రసం తాగాలి.రోజూ తప్పనిసరిగా పది,పన్నెండు గ్లాసుల మంచి నీళ్ళు తాగాలి.ఉదయం,సాయంత్రం లేత ఎండలో కాసేపు ఉండాలి.మధ్యాహ్నం ఎండ చర్మాన్ని కాంతి విహీనం చేస్తుంది.తాజా పండ్లు,కూరగాయలు తినాలి.ఉదయం నిమ్మరసం కానీ గ్రీన్ టీ లేదా అల్లం టీ తీసుకోవాలి.ముఖానికి సహజ సిద్దమైన బొప్పాయి,కారట్,అరటి పండు,కమల,నారింజ వంటి పాక్స్ వేసుకోవాలి. వేసుకునే ముందు ముఖాన్ని చల్లటి నీళ్ళతో కడగాలి లేదా ఐసుగడ్డలతో శుభ్రం చేయాలి.ఇలా చేస్తే ముఖం నిగనిగ లాడుతూ అందరిలో అందంగా కనిపించడం ఖాయం. 

Tuesday, 25 April 2017

చర్మం ఆరోగ్యంగా

                                                                     ఒక స్పూను దోసకాయ రసం,ఒక స్పూను నిమ్మ రసం,ఒక స్పూను గులాబీ నీళ్ళు అన్నీ కలిపి ముఖానికి రాసుకుని ఒక పది ని.ల తర్వాత చల్లటి నీటితో ముఖాన్నిశుభ్రంగా కడగాలి.వేసవిలో ఇలా చేయడం వలన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

Saturday, 4 March 2017

మోచేయి మృదువుగా

                                                                       ఒక అర స్పూను ఆలివ్ నూనెను తీసుకుని గోరువెచ్చగా చేసి అందులో బాదం నూనె,కొబ్బరి నూనె రెండు  చుక్కల చొప్పున తీసుకుని బాగా కలిపి నల్లగా గరుకుగా ఉన్న మోచేయిపై రాత్రి పూట రాయాలి.అప్పుడప్పుడు నిమ్మచెక్కపై పంచదార వేసి మోచేతిని రుద్దితే క్రమంగా  చర్మం పైనున్న  నలుపు రంగు,గరుకుదనం తగ్గి మృదువుగా తయారవుతుంది.

Thursday, 22 September 2016

రోజూ టొమాటో రసం

                                                                      చర్మం రోజంతా తాజాగా ఉండాలంటే రోజూ ఉదయం అల్పహరంతో పాటు ఒక గ్లాసు టొమాటో రసంలో చిటికెడు ఉప్పు,చిటికెడు మిరియాల పొడి,కొద్దిగా నిమ్మరసం కలిపి తాగాలి.ఈ విధంగా చేస్తే చర్మంపై ముడతలు రాకుండా ఉంటాయి.దీనితో పాటు బరువు అదుపులో ఉండడమే కాక తక్కువ సమయంలో ఆరోగ్యంగా,అందంగా ఉన్న వయసు కన్నా చిన్నగా,యవ్వనంగా కనిపిస్తారు. 

Thursday, 15 September 2016

పొట్ట చుట్టూ........

బరువు పెరిగినప్పుడు ముందుగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుంటుంది.ఇది తగ్గాలంటే రోజు రాత్రి నిద్రపోయే ముందు ఈ క్రింది విధంగా జ్యూస్ చేసుకుని తాగాలి.
                                           నిమ్మకాయ -1
                                           తురిమిన అల్లం  - 1 టేబుల్ స్పూను
                                           కలబంద రసం - 1 టేబుల్ స్పూను
                                            దోసకాయ - 1
                                            కొత్తిమీర  - కొంచెం
                                            నీళ్ళు - 1/2 గ్లాసు
                                                  ఇవన్నీ కలిపి మిక్సీలో వేసి వడకట్టి తాగితే పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వుక్రమంగా కరిగిపోతుంది.
                                           

Friday, 2 September 2016

వంటింటి గట్టు శుభ్రంగా.......

                                                              పిండి వంటలు చేసినప్పుడు వంటింటి గట్టు ఎంత శుభ్రంగా కడిగినా ఎంతో కొంత జిడ్డుగానే ఉన్నట్లు అనిపిస్తుంది.అటువంటప్పుడు కొంచెం రాళ్ల ఉప్పు,కొద్దిగా సోడా ఉప్పు,కొంచెం సర్ఫు కలిపి గట్టుపై చల్లి కొద్దిగా నీళ్ళు చల్లుతూ పీచుతో రుద్దాలి.ఎక్కువ శ్రమ పడకుండా తేలికగా జిడ్డు వదిలి వంటింటి గట్టు శుభ్రంగా ఉంటుంది.చీమలు కూడా రాకుండా ఉంటాయి. 

Sunday, 14 February 2016

మోకాళ్ళ నొప్పులకు.....

                                                                   నలభై సంవత్సరాలు దాటిన దగ్గర నుండి ఎక్కువ మందికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి.బరువు పెరగకుండా చూచుకుంటూ ఉండాలి.ఒకవేళ బరువు ఎక్కువ ఉంటే తగ్గటానికి ప్రయత్నించాలి.సాధ్యమైనంతవరకు నొప్పులు పెరగకుండా చూచుకోవాలి.రోజూ లేత మునగాకు నేతిలో వేయించి తినాలి.వామును మెత్తగా నూరి నువ్వుల నూనెలో కలిపి వేడిచేసి నొప్పి ఉన్నచోట మర్దన చేయాలి.మునగాకును వేయించి వాపు ఉన్నచోట కట్టుకడితే వాపు,నొప్పి తగ్గిపోతుంది.ఈ చిట్కాలు పాటిస్తుంటే కొంతలో కొంత ఉపశమనం కలుగుతుంది. 

Wednesday, 3 February 2016

ఖచ్చితంగా బరువు తగ్గాలి అంటే.......

                                                      మనలో చాలామంది బరువు తగ్గాలని అనుకుని కొద్దిరోజులు పూర్తిగా ఆహారం తగ్గించి,అతి వ్యాయామం చేసి విసుగొచ్చి మళ్ళీ యధా రాజా తథా ప్రజా అన్నట్లు చేస్తుంటారు.అంతే కాకుండా కొంతమంది పదార్ధాలు రుచిగా ఉన్నాయని ఇష్టంగా తినేసి అమ్మో!నా పొట్టలో మంచి నీళ్ళు కూడా పట్టవు.పొట్ట నిండుగా ఉంది అని అంటూ ఉంటారు.ఈ రెండు విధానాలు సరయినవి కాదు.నచ్చినవి కదా!అని పొట్టనిండుగా తినకూడదు.అలాగని అసలు తినకుండా ఉండకూడదు.అతిగా వ్యాయామం చేయకూడదు.అసలు వ్యాయామం చేయకుండా కూడా ఉండకూడదు.తెల్లటి అన్నం,పప్పునూనె,పంచదార,నెయ్యి వాడకం తగ్గించి,ఆలివ్ నూనె వాడటం అలవాటు చేసుకుంటే మంచిది.ముడిబియ్యం,ఉడికించిన కూరగాయల ముక్కలు,ఆకులతో రకరకాల  సలాడ్లు,అన్ని రకాల పండ్ల ముక్కలు,ఆకుకూరలు,గుగ్గిళ్ళు,సూపులు,చిరుధాన్యలతో చేసిన పదార్ధాలు తింటూ మధ్యమధ్యలో నీళ్ళు తాగుతూ ఉంటే శరీరంలోని వ్యర్ధాలు కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి.ఖచ్చితంగా బరువు తగ్గాలి అంటే రాత్రిపూట ఆహారం త్వరగా తీసుకుని నిద్ర పోయే లోపు తాగగలిగినన్ని అంటే నాలుగు గ్లాసులకు తగ్గకుండా మంచినీళ్ళు తాగాలి.ఈవిధంగా రోజూ చేస్తుంటే  జీర్ణశక్తి మెరుగుపడటమే కాక పగలంతా పనులతో అలసిన శరీరానికి చక్కటి నిద్ర పట్టి మర్నాటికి ఉత్సాహంగా ఉండటమే కాక బరువు తగ్గుతారు.వ్యాయామం కూడా ఒక అరగంట తప్పనిసరిగా చేయాలి.   

Friday, 29 January 2016

గోడలపై మరకలు పోవాలంటే.......

                                                             వంట గదిలో చెత్త డబ్బాలో టీ వడపోసిన తర్వాత మిగిలిన టీపొడి పడేసేటప్పుడు కానీ,రసం వడపోయగా మిగిలిన పిప్పి వేసేటప్పుడు కానీ  ఎంత జాగ్రత్తగా వేసినా పక్కనే ఉన్న గోడపై ఏదో ఒక మరక పడుతూనే ఉంటుంది.అలా కొద్ది రోజులకు గోడంతా మరకలతో చూడటానికి బాగుండదు.అలా గోడపై పడిన మరకలు పోవాలంటే వంట పాత్రలు శుభ్రం చేసే ద్రావణంలో కొద్దిగా నీళ్ళు పోసి దానిలో మెత్తటి శుభ్రమైన వస్త్రం ముంచి గోడపై అప్పుడప్పుడు తుడుస్తుంటే మరకలు పోతాయి.

Saturday, 23 January 2016

మిఠాయి లడ్డూ తేలికగా,రుచిగా .........

                                            ఇంతకు ముందు మిఠాయి లడ్డూ చెయ్యాలంటే పూస మొత్తం దూసిన తర్వాత పంచదార పాకం పట్టి దానిలో పూస మొత్తం పోసి కలిపి వేడిగా ఉన్నప్పుడు చేతులు ఎర్రగా కందినా ఆరిపోతే లడ్డూ రాకుండా విరిగిపోతుందని ఇబ్బంది పడి చేసేవాళ్ళు.ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా ముందుగా పాకం పట్టి  ఒక ప్రక్కన పెట్టుకుని పూస దూసింది దూసినట్లుగా పాకంలో వేసి ఎప్పటికప్పుడు గరిటెతో తిప్పుతుండాలి.మిఠాయి పూస పూర్తిగావండటం ఐపోయిన తర్వాత మొత్తం ఒకసారి కలిపి కొంచెం కొంచెం తాపీగా ఆరిన తర్వాత లడ్డూ చుట్టుకోవచ్చు.ఇది మొదటి దానికన్నా రుచిగా ఉండటమే కాక తేలికగా అయిపోతుంది.

Tuesday, 19 January 2016

బరువులు ఎత్తేటప్పుడు......

                                                     బరువులు ఎత్తేటప్పుడు ముందుగా మోకాళ్లను వంచి ఎత్తాలి.మోకాళ్ళు వంచకుండా వెన్నును ముందుకు వంచి  బరువులు ఎత్తటం వల్ల వెన్ను,మెడనొప్పులు వచ్చే ఆవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.కనుక తప్పనిసరిగా మోకాళ్ళు వంచి బరువులు ఎత్తాలి.                   

మెడనొప్పి వేధించకుండా.......

                                                                         గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చుని పని చేయటం వలన కానీ,నిద్రపోయేటప్పుడు సరయిన భంగిమలో  పడుకోకపోయినా కానీ, తలగడ సరిగా లేకపోయినా మెడనొప్పి వేధిస్తుంటుంది.అటువంటప్పుడు కుర్చుని కానీ,నిలబడి కానీ చేయగలిగే ఈ చిన్నచిన్న యోగాసనాలు ఎంతగానో పనిచేస్తాయి.అవి ఎలా చేయాలంటే ముందుగా 1)వెన్నును నిటారుగా ఉంచి గాలి బయటకు వదులుతూ తలను కుడివైపు తిప్పాలి.గాలి లోపలి తీసుకుంటూ యధాస్థితికి రావాలి.తిరిగి గాలి వదులుతూ ఎడమవైపు తిప్పాలి.మరల గాలి లోపలకు తీసుకుంటూ యధాస్థితికి రావాలి.2)గాలి బయటకు వదులుతూ తల కిందికి వంచాలి.గాలి పీల్చుతూ పైకెత్తాలి.3)గాలి వదులుతూ తలను కుడివైపు వంచాలి.గాలి లోపలకు పీల్చుతూ తలను మధ్యకు తేవాలి.ఇలాగే ఎడమ వైపు కూడా చెయ్యాలి. 4)తలను కొద్దిగా వంచి కుడి నుండి ఎడమకు,ఎడమ నుండి కుడికి గుండ్రంగా తిప్పాలి.ఈ విధంగా రోజు ఒక్క 10 ని.లు చేస్తుంటే మెడనొప్పి వేధించకుండా ఉంటుంది.

Tuesday, 5 January 2016

మొక్కను పెడితే......

                                                                అపార్టుమెంటులలో ఇంటి ముఖద్వారం పొడవైన కారిడార్ చివర ఉన్నట్లయితే అక్కడ ప్రవహించే శక్తి చాలా ఉధృతంగా ఉంటుంది.ఈ విధంగాఉంటే ఆర్ధిక పెట్టుబడులపై ప్రభావం చూపి ఇబ్బందులు కలుగుతాయి.ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం మధ్యలో ఒక పక్కగా ఒక మొక్కను పెడితే ఆ ప్రభావం తగ్గుతుంది. 

చర్మం పొడిబారి తెల్లగా ఉంటే.........

                                                                 చలి ఎక్కువగా ఉన్నప్పుడు చర్మం పొడిబారి తెల్లగా ఉంటుంది.అలా ఉన్నప్పుడు స్నానం చేసే నీటిలో కొద్దిగా నువ్వుల నూనె కానీ ఆలివ్ నూనె కానీ లేదా 1/4 కప్పు పాలు కానీ కలిపి స్నానం చేస్తే చర్మం మృదువుగా ఉంటుంది.ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మాటిమాటికి మోచేతులు,మోకాళ్ళ వద్ద చర్మం పొడిబారి తెల్లగా కనిపిస్తుంటే కొద్దిగా పంచదార,తేనెలో కలిపి ఆ ప్రదేశంలో  సున్నితంగా రాయాలి.మృదువుగా తయారవుతుంది.పాదాలకు,చేతులకు వీలయినప్పుడు కొద్దిగా కొబ్బరి నూనె రాస్తే గరుకుదనం తగ్గి చర్మం పొడిబార కుండా, పగుళ్ళు రాకుండా ఉంటుంది.

Sunday, 3 January 2016

ఉదయం నిద్రలేవగానే.......

                                                                     ఉదయం నిద్ర లేవగానే ఉత్తర దిశను చూడటం వలన కుబేర స్థానం చూచినట్లవుతుంది.దీనివలన ధనాదాయం పెరుగుతుంది.పడకపై నుండి దిగగానే తూర్పు వైపుకు నడవాలి.ఇలా చేయడం వలన తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తయి మంచి లాభాలు పొందుతారు.            

Saturday, 2 January 2016

సంపద పెరగాలంటే........

                                                                    సంపద పెరగాలంటే ఆహ్లాదకరంగా నీరు పారే శబ్దం వినిపించేలా ఒక చిన్నఫౌంటెన్  ఇంట్లో పెట్టుకోవాలి.నీరు పారే శబ్దం ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించేలా చేస్తుంది.వాటర్ ఫౌంటెన్ లాగా డబ్బును,సంపదను ఆకర్షించే శక్తి మరి దేనికీ లేదు.ఇంట్లో ఎక్కడ అయినా పెట్టుకోవచ్చు.అందంతో పాటు సంపద కూడా పెరుగుతుంది.