జ్యోతిక ఇంటికి వంట చేయడానికి ఒక సహాయకురాలు వచ్చింది.ఒక రోజు జ్యోతిక భోజనం చేసి చేయి కడుగుతున్నప్పుడు వచ్చి అమ్మా!మీరు చేతులు కడిగి కడిగీ భలే తెల్లగా ఉన్నాయని కళ్ళు చక్రాల్లా తిప్పుతూ చెప్పింది.రేపటి నుండి నేను కూడా చేతులు కడిగితే తెల్లగా వస్తాయా అమ్మా!అని అడిగింది.పిచ్చి ముఖమా!అదే పనిగా కడిగితే చేతులు తెల్లగా రావు.పుట్టుకతో వచ్చిన శరీర ఛాయను బట్టి తెల్లగానో నల్లగానో ఉంటాయి.అంతే కానీ అదే పనిగా కడిగితే చేతులు పాడైపోతాయి జాగ్రత్త అని చెప్పింది జ్యోతిక.
Showing posts with label పిచ్చాపాటీ. Show all posts
Showing posts with label పిచ్చాపాటీ. Show all posts
Wednesday, 15 February 2017
Wednesday, 8 February 2017
బబుల్ గమ్ పచ్చడి
అఖిల అమెరికాలో ఉన్నకూతురు ఇంటికి వెళ్తూ రకరకాల పచ్చళ్ళు తీసుకుని వెళ్ళింది.అందులో రొయ్యల పచ్చడి కూడా ఉంది.అఖిల కూతురు ఆద్య ఐదేళ్ళ కొడుకు ఆర్యకు శాండ్ విచ్ లో రొయ్యల పచ్చడి పెట్టి ఇచ్చింది.ఆర్య అది తిని చాలా బాగుందని అమ్మమ్మా!నువ్వు తెచ్చిన బబుల్ గమ్ పచ్చడి నాకు బాగా నచ్చింది అని చెప్పాడు.ఆర్య మాటలకు అఖిల నవ్వి అది బబుల్ గమ్ పచ్చడి కాదు కన్నా!రొయ్యల పచ్చడి అంటే వినడు.అది నమిలితే బబుల్ గమ్ లాగే ఉంది నేను అలాగే అంటాను అమ్మమ్మా అన్నాడు.ఆ మాటలకు అఖిల ఈ రోజుల్లో పిల్లలకు చెప్పలేకుండా ఉన్నాము అంటూ విస్తుపోయింది.
Tuesday, 31 January 2017
ఆమె అదృష్టం
రాకేశ్,రాగిణి వేంకటేశ్వరుని కళ్యాణోత్సవానికి వెళ్లారు.అక్కడ పెద్ద మధ్య,పిన్న వయస్సు దంపతులు చాలా మంది ఉన్నారు.కళ్యాణం మొదలుపెట్టడానికి మూడు గంటల ముందు రమ్మని చెప్పడంతో అందరూ వచ్చి కూర్చున్నారు.ఇంకొక అరగంట,పావుగంట అంటూ నిర్వాహకులు చెప్పడంతో పెద్దవాళ్ళు కూర్చోలేక ఆపసోపాలు పడుతూ ఉన్నారు.ఎదురు చూడగాచూడగా అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని కళ్యాణం కన్నులపండుగగా మొదలైంది.చూడటానికి రెండు కళ్ళు చాలవన్నట్లు చాలా నిశ్శబ్దంగా కూర్చుని దాదాపు 1500 మంది ఎంతో ఆసక్తిగా కల్యాణాన్ని తిలకించారు.కల్యాణోత్సవం ఎంతో అద్భుతంగా జరిగింది.అప్పుడే అసలు ఘట్టం మొదలైంది.ఒక గంట మాత్రమే స్వామివారి అక్షింతలు వేసి పెద్దాయన ఆశీస్సులు అందజేస్తారు ఎక్కడివాళ్ళు అక్కడే కూర్చోండి అని ప్రకటించారు.ఎక్కడ తమకు అవకాశం రాదోనని వెనుక నుండి ఒక్కసారిగా ముందు వాళ్ళను తోసుకుని వచ్చేశారు.తోపులాటలో ఒక పెద్దాయన భార్య కనిపించలేదు.ఆయన ఒక్కసారిగా బిక్కమొహం పెట్టి ఏడుపు ఆపుకుంటూ భార్య కనిపించలేదన్న భాధతో దాదాపు ఐదు గంటలు కూర్చున్నాము ఒక్క అరగంట కుర్చోలేమా?స్వామి దర్శనానికి వచ్చి తోపులాటలు ఏమిటి?మనలో మార్పు ఎప్పటికి వస్తుంది?అంటూ తన భార్య కోసం కంగారు పడుతున్నాడు.పక్కనే ఉన్న రాకేశ్ కంగారు పడకండి అందరూ ఇక్కడే ఉన్నారు ఎవరూ బయటకు వెళ్ళలేదు.ఆమె ఇక్కడే ఉండొచ్చుఅని చెప్పగానే కొద్దిగా ఊపిరి పీల్చుకున్నాడు.ఒక పది ని.లకు ఇదిగో నా భార్య అని సంతోషంగా చాటంత మొహం చేసుకుని చెప్పాడు.భార్య అంటే ప్రేమ అందరికీ ఉంటుంది.కానీ ఆయనకు తన భార్య అంటే ఉన్న ప్రేమ ఆయన కళ్ళల్లో స్పష్టంగా కనిపించింది.అది ఆమె అదృష్టం.
Tuesday, 24 January 2017
పిచ్చి బొంద
యశోదమ్మ గారికి అరవై ఐదేళ్ళు.ఆవిడ దగ్గర రాజీ చిన్నప్పటి నుండి పని చేస్తుంది.రాజీకి పెళ్ళి చేసి రెండు గదులు ఉండటానికి ఇచ్చికొత్త కాపురం పెట్టించారు.చిన్నతనం నుండి ఆవిడ దగ్గరే ఉండటంతో రాజీకి యశోదమ్మ గారి దగ్గర చనువు ఎక్కువ.ఒకరోజు మైసూర్ బోండా వేసి రాజీ పిల్లలకు పెట్టమని ఒక గిన్నెలో అవసరమైనవన్నీ వేసి కలపమని చెప్పారు.రాజీ పిండి కలుపుతూ అమ్మా!మీరు మైదా బదులు గంజి పిండి వేశారు.పిండి జిగురుగా ఉంది చూడండి అంటూ ఆపకుండా 20 ని.లు నవ్వుతూనే ఉంది.అసలే పెద్ద నోరు.రాజీ నోరంతా తెరిచి కళ్ళ వెంట నీళ్ళు కారేలా నవ్వుతుంటే యశోదమ్మగారు పిండిని పట్టుకుని చూస్తే అది జిగురుగానే ఉన్నా గంజి పొడిలా అనిపించలేదు.ఏది అయితే అయిందిలే అని అది పడేసి మరలా వేరే పిండి కలపమని రాజీకి చెప్పారు.కలిపిన పిండి పడేసిన ఒక పది ని.ల తర్వాత అది మొక్కజొన్న పిండి అని గుర్తు వచ్చింది.అయ్యో పిండిలో పెరుగు వేసి కలిపి వృధాగా పడేశాము కదమ్మా!అని తెగ బాధపడింది.పిచ్చి బొంద అదేమిటో సరిగా చూడకుండానే ఎప్పుడూ పిచ్చినవ్వులు,అన్నీ పిచ్చి పనులు చేస్తూ ఉంటావు అని రాజీని మెత్తగా మందలించారు.
Saturday, 21 January 2017
మిర్రు
లక్ష్య ముద్దు పేరు చిక్కీ.పేర్లు మాత్రం ఈ తరానికి తగినట్లు పెట్టుకున్నా గానీ మాటలు,చేష్టలు అన్నీ కూడా వెనుకటి తరంలో కూడా ఉపయోగించని పదాలు ఉపయోగిస్తుంది.వయసు రీత్యా లక్ష్య అమ్మమ్మకు చూపు మందగించింది.అందుకని లక్ష్య అన్నయ్య అమ్మమ్మ బంధువులతోనో,స్నేహితులతోనో ఇంకా ఎవరితోనయినా తేలికగా మాట్లాడటానికి వీలుగా ఉంటుందని అంకెలు పైకి ఉన్న ఒక మామూలు ఫోను కొనుక్కుని ఇంటికి తెచ్చాడు.అంతకు ముందు ఫోను అంకెలు సమానంగా ఉండడంతో తేలికగా అంకెలు గుర్తుపెట్టుకుని అందరి నంబర్లు తనే నొక్కి మాట్లాడేది.అమ్మ ఫోను చేసేది ఎప్పుడయినా ఎందువలన చెయ్యడం లేదు? అని లక్ష్యను అడిగితే ఫోను మిర్రుగా ఉండి నంబర్లు తెలియక చెయ్యడం లేదు అని చెప్పింది.అంటే ఏమిటో ఎదుటివారికి అర్ధం కాక మళ్ళీ అడిగితే మిర్రు అంటే మెరక.దీనికి నంబర్లు పైకి ఉన్నాయి.సమానంగా ఉంటే అమ్మమ్మకు ఫోను చెయ్యటం తేలిక అని లక్ష్య అంది.
Wednesday, 2 November 2016
మొలకలు వస్తే .....
ఉల్లి,వెల్లుల్లి పాయలకు మొలకలు వస్తే వాటిలో సారం ఉండదని పైగా వాటిని తింటే కడుపులో నొప్పి వస్తుందని అపోహతో చెత్తలో పడేస్తూ ఉంటాము.లేత పాయలు,ముదిరిన పాయల కన్నా ఇలా మొలకలు వచ్చిన పాయల్లో గింజల మొలకల్లో ఉండే మెటాబొలైట్లు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.ఇవి అద్భుత యాంటీ ఆక్సిడెంట్లు మాదిరిగా పనిచేసి గుండెకు ఎంతో మేలు చేస్తాయని అంటున్నారు.మాములుగానే వెల్లుల్లి రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు కొలెస్టరాల్,బి.పిని అదుపులో ఉంచుతుంది.తాజాగా ఉల్లి మధుమేహాన్ని అదుపులో ఉంచుతుందని చెబుతున్నారు.
గమనిక:ఉల్లి కాడలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే కాక దేనిలో వేసినా రుచితో పాటు రకరకాల వంటలు చేసుకోవచ్చు.ఇష్టమైతే అవి నా పాత పోస్టుల్లో చూడవచ్చు.
Wednesday, 21 September 2016
మొక్కల మధ్య కాసేపు
రోజూ కాసేపు మొక్కల మధ్య గడిపితే ఒత్తిడి మన దరిదాపులకు కూడా రాదు.మట్టి వాసన పీల్చుతూ,మొక్కల పచ్చదనం చూస్తూ అటూ ఇటూ ఏ ఆలోచనలు లేకుండా తిరుగుతూ ఉంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అప్పటికప్పుడు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది.అందుకే ఇప్పుడు అందరూ ఇంటి పైనే రకరకాల ఆకులు పూలు,పండ్లు,కూరగాయలు,ఆకుకూరలు అన్ని రకాలతో మిద్దె తోటను పెంచుతున్నారు.రోజూ ఒక అరగంట సాధ్యమైనంతవరకు వీలు కల్పించుకుని తోట పని చేయగలిగితే ఆరోగ్యపరంగా ఎంతో మేలు కలుగుతుంది.బహుళ అంతస్తుల్లో కూడా వరండాలో,ఇంట్లో రకరకాల మొక్కలు పెంచుతున్నారు.కొన్ని రకాల మొక్కలు ఇంట్లో ఉన్న గాలిని సహజ సిద్దంగా శుద్ధి చేస్తాయి.కొన్ని మొక్కలు దోమలు రాకుండా చేస్తాయి.అటువంటి వాటిని ఎంచుకుని తెచ్చి పెంచితే పచ్చదనంతోపాటు ప్రయోజనం కూడా ఉంటుంది.
Monday, 19 September 2016
ముసలి పిల్లలా?
రుక్మిణమ్మ ఇంటికి ఒకరోజు ఒక ముప్పై సంవత్సరాల యువతి మురికిగా చాలీ చాలని సగం చీర ముక్క ఒంటికి చుట్టుకుని పైన జాకెట్టు వేసుకోకుండా జుట్టు విరబోసుకుని ఒక పిల్లను చంకన వేసుకుని అమ్మా!కట్టుకోవటానికి బట్టలు,తినడానికి తిండి,తాగటానికి బిడ్డకు పాలు లేవు ఇప్పించండి అంటూ పెద్ద గొంతుతో అరవడం మొదలు పెట్టింది.ఇంట్లో పని చేసుకుంటున్న రుక్మిణమ్మ కేకలు విని బయటకు వచ్చింది.ఆ వచ్చిన అమ్మాయి అవతారం చూడగానే రుక్మిణమ్మకు కోపం నషాళానికి అంటింది.అంతకు ముందు ఒకసారి ఒకామె ఇలాగే వస్తే నిజమే కాబోలు అనుకుని పాత చీరలు ఇచ్చి భోజనం పెట్టి డబ్బులు ఇచ్చి పంపించింది.తర్వాత రోజు మళ్ళీ అదే అవతారంలో కనిపించింది.అందుకే అంత కోపం.ఆ కోపంలో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది.ఏమైనా ముసలి పిల్లలా?(ముసలి వాళ్ళా?పిల్లలా?)ఆ అవతారం ఏమిటి?కష్టపడి పని చేసుకో!పని చేసుకుంటే అన్నీ అవే వస్తాయి.ముందు ఇక్కడి నుండి వెళ్ళు.కష్టపడకుండా ఒంటికి చిన్న గుడ్డపీలిక చుట్టుకుని అడుక్కోవడం నేర్చారు.నీలాంటి వాళ్ళకు నేను ఏమీ ఇవ్వను అంటూ విసుక్కుంది.జాలి పడుతుందని అనుకున్న పెద్దావిడ అంత గట్టి గట్టిగా చివాట్లు పెట్టేసరికి బిక్కచచ్చిపోయి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయింది.ఒక్క రుక్మిణమ్మ అన్నంత మాత్రాన వాళ్ళు మారరు.ఇక్కడ కాకపోతే ఇంకొకచోట ఈరోజు గడిచి పోయింది లెక్క.కొంతమంది నోరు తెరుచుకుని జాలితోనో,వంకరగానో చూస్తూ డబ్బులు ఇస్తున్నంత కాలము అలాగే జీవనం సాగిపోతుంది.
Friday, 2 September 2016
వంటింటి గట్టు శుభ్రంగా.......
పిండి వంటలు చేసినప్పుడు వంటింటి గట్టు ఎంత శుభ్రంగా కడిగినా ఎంతో కొంత జిడ్డుగానే ఉన్నట్లు అనిపిస్తుంది.అటువంటప్పుడు కొంచెం రాళ్ల ఉప్పు,కొద్దిగా సోడా ఉప్పు,కొంచెం సర్ఫు కలిపి గట్టుపై చల్లి కొద్దిగా నీళ్ళు చల్లుతూ పీచుతో రుద్దాలి.ఎక్కువ శ్రమ పడకుండా తేలికగా జిడ్డు వదిలి వంటింటి గట్టు శుభ్రంగా ఉంటుంది.చీమలు కూడా రాకుండా ఉంటాయి.
Monday, 25 July 2016
జర భద్రం
వర్షాకాలం వచ్చిందంటే చాలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే రకరకాల వ్యాధులు వెన్నంటి వస్తాయి.వర్షాలు పడక ముందే ఇంటి చుట్టుపక్కల,ఇంట్లో బూజు,దుమ్ము,ధూళి లేకుండా శుభ్రం చేయాలి. శ్వాసకోశ సమస్యలు రాకుండా ఉంటాయి.వర్షం పడినప్పుడు ఇంటి బయట నీరు నిల్వ లేకుండా చూడాలి.దోమలు వృద్ధి చెందకుండా ఉంటాయి.వర్షం పడుతుంది కదా అని వేడివేడిగా కాఫీ,టీ ఎక్కువగా తీసుకోకుండా గోరువెచ్చటి నీరు తాగటం మంచిది.నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు ఎక్కువ కనుక పరిశుభ్రమైన నీటిని వీలైతే కాచి చల్లార్చిన నీటిని రోజుకు కనీసం 8 గ్లాసులు తాగాలి.వర్షంలో తడవటం సరదాగా ఉంటుంది కానీ తర్వాత వెన్నంటే వచ్చే జలుబును భరించడం కష్టం.ఒకరికి వచ్చిపోదు కదా!తగిన జాగ్రత్త తీసుకోకుంటే ఇంటిల్లిపాదీ చుట్టబెడుతుంది.అందుకే చిన్న గొడుగు వెంట తీసుకెళ్ళడం శ్రేయస్కరం.పొరపాటున వర్షంలో తడిస్తే ఇంటికి రాగానే జుట్టు ఆరబెట్టుకున్నాం కదా!అనుకోకుండా తల స్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.ఇకపోతే వర్షాకాలంలో వేడివేడిగా మిరియాలపొడి వేసిన సూపులు,వేడిగా ఉన్నప్పుడే ఆహరం తీసుకోవాలి.సాద్యమైనంత వరకు బయట చిరుతిళ్ళు తినకపోవడమే మంచిది.ఎందుకంటే ఉల్లి.కీరా,కారట్,కాబేజీ వంటి పచ్చి కూరగాయ ముక్కలు,తురిమి నిల్వ ఉంచితే బాక్టీరియా చేరి త్వరగా డయేరియా వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదముంది.జర భద్రంగా ఉంటే ఖాళీ సమయంలో వేడివేడి మొక్కజొన్నపొత్తులు,మిరపకాయ బజ్జీలు,ఈ సమయంలో దొరికే నేరేడు,సీమ రేగు పండ్లు తింటూ,బత్తాయి రసం తాగుతూ,మరీ ముఖ్యంగా సహజంగా దొరికే పుట్టగొడుగులతో రకరకాల వంటలు తింటూ వర్షా కాలాన్ని చక్కగా సంతోషంగా ఆస్వాదించవచ్చు.
Monday, 18 July 2016
నవనవలాడే మునగాకు
కుసుమ ఇంటి పెరట్లో పనిమనిషి ఎక్కడినుండో తెచ్చి ఒక మునగ మొక్క పెట్టింది.అది వర్షాలు పడేసరికి నవనవలాడుతూ రెండు అడుగుల ఎత్తు పెరిగింది.లేతగా పచ్చిఆకు చూడటానికి ఎంతో బాగుండేసరికి కుసుమ భర్త నాలుగు రెమ్మలు తెచ్చి పప్పులో వేయమనేసరికి అది ఎలా చేయాలో తెలియక బిత్తరపోయింది.తర్వాత తేరుకుని పక్కింట్లో ఉన్నఆడపడుచును పిలిచి మీ ఆన్నయ్య మునగాకు తెచ్చి పప్పులో వెయ్యమన్నారు.నాకేమో ఎలా చెయ్యాలో తెలియదు.నీకు ఏమైనా తెలుసా?అని అడిగింది.నాకూ తెలియదు కానీ మా పిన్ని కూతురు రకరకాల వంటలు చేస్తుంది.ఆమెను అడగమని ఒక నంబరు ఇచ్చింది.ఆమెను అడగగానే చేసే విధానం చెప్పింది.చెప్పడమే కాక మునగాకుతో ఎన్ని రకాలు చేయవచ్చో అన్నీ పేపరు మీద రాసి ఒకతనికి ఇచ్చి పంపింది.ఆమె అలా అడగగానే బాధ్యతగా పంపినందుకు కుసుమకు చాలా సంతోషంగా అనిపించి తర్వాత రోజు ఫోనుచేసి మరీ కృతజ్ఞతలు తెలిపి పప్పు చాలా బాగుంది.పప్పు తినని మా అబ్బాయి కూడా ఇష్టంగా తిన్నాడు అని చెప్పింది.ఆషాడం వచ్చిందంటే నవనవలాడుతూ లేత మునగాకు నోరూరిస్తూ ఉంటుంది.ఎప్పుడూ తినని వాళ్ళకు కూడా తినాలనిపించేలా చేసింది.
Friday, 28 August 2015
రావమ్మా మహాలక్ష్మి
లక్ష్మిదేవి అలంకార ప్రియురాలు.వరలక్ష్మీ వ్రతం రోజు ఇంటిని మామిడితోరణాలతో, రకరకాల రంగుల పువ్వులతో,పూదండలతో ఎంత అందంగా అలంకరిస్తే అంత శుభం జరుగుతుందని నమ్మకం. ప్రత్యేకించి చామంతి పువ్వులతో అమ్మవారికి పూజ చేయడం ఆచారం.ఐదు రకాల పువ్వులు,ఐదురకాల పండ్లు ఐదు రకాల పిండి వంటలు తప్పనిసరి.ఆపై ఎన్ని రకాలైనా పెట్టుకోవచ్చు.వాయనానికి తొమ్మిది పోగుల తోరము,తొమ్మిది పూర్ణాలు తప్పనిసరి.నిష్కల్మషంగా,నిర్మలమైన మనస్సుతో మా ఇంటికి రావమ్మా మహాలక్ష్మీ అంటూ మనస్పూర్తిగా ఆహ్వానించి లక్ష్మిదేవిని పూజిస్తే అంతా శుభమే.మహాలక్ష్మి కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి.స్త్రీలు సౌభాగ్యంగా ఉండాలని,తన కుటుంబం ఆయురారోగ్యాలతో,అష్టైశ్వర్యాలతో తులతూగాలని భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు.ఈ వ్రతంలో లక్ష్మీపార్వతుల సమన్వయం కనిపిస్తుంది.స్త్రీలు ఒకరికొకరు సఖ్యతతో ఎలా ఉండాలో తెలియచెప్పే వ్రతం.తోటి వారంటే గౌరవం,ప్రేమ ఉండి అందరితో సత్సంబంధాలు కలిగి సంతోషంగా ఉండేవారి దగ్గర, డబ్బును గౌరవించి,పూజించి,విలువ తెలిసిన వాళ్లదగ్గర మాత్రమే లక్ష్మీదేవి కలకాలం నిలుస్తుంది.డబ్బంటే నిర్లక్ష్యం అసలు ఉండకూడదు.అందరి దగ్గర లక్ష్మీదేవి కలకాలం ఉండాలని,అమ్మ అనుగ్రహం అందరికీ లభించాలని ప్రార్ధిద్దాము.
Saturday, 8 August 2015
ఎప్పుడంటే అప్పుడు.......
ఖాళీ సమయంలో కారట్ తురిమి గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఒక వారం రోజులు తాజాగా ఉంటుంది.ఒక్కొక్కటి తురుముకోవలసిన అవసరం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు.వేపుళ్ళలో వేసినప్పుడు కారట్ వేగీ వేగకుండా తీసేయాలి.దేనిలో వేసినా బాగుంటుంది.దీనికి తోడు పచ్చి బఠాణీ,ఉల్లి కాడలు ఫ్రిజ్ లో అట్టిపెట్టుకుంటే పిల్లలకు రకరకాల వంటలు అప్పటికప్పుడు చేసిపెట్టవచ్చు.రంగు రంగులతో ఉంటే పిల్లలకు చూడటానికి కంటికి ఇంపుగా ఉండటమేకాక అన్నీ వెయ్యటంవల్ల నోటికి రుచిగా ఉండి తినటానికి ఇష్టపడతారు.పెద్దవాళ్ళు కూడా అన్ని రకాల కూరగాయలు తినడం ఎంతో మంచిది.
Saturday, 20 June 2015
ఆషాడ మాసాన........
ఆషాడ మాసాన.. చినుకు పడే సమయాన.. మునగాకు తింటే శరీరానికి ఎంతో మంచిదని చెప్తుంటారు పెద్దలు.చూడటానికి చిన్నగా ఉన్నా ఈ ఆకులు పోషకాల గని.శారీరక ధృడత్వానికి,ఎముకల పటుత్వానికి దోహదం చేసే ప్రోటీన్లు ఇనుము,కాల్షియం,పుష్కలంగా ఉంటాయి.రోజూ రెండు స్పూనులు మునగాకు నూరి తింటే పోషకాహార లోపంతో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.మునగాకు ఏదో ఒక రూపంలో రోజూ తింటే మధుమేహం ఉంటే అదుపులో ఉంటుంది.ముందు జాగ్రత్తగా తింటే రాకుండా ఉంటుంది.దీనితో రకరకాల వంటలు చేసుకోవచ్చు.అవి ఎలా చేయాలో తెలుసుకోవాలంటే పాత పోస్టుల్లో చూడొచ్చు.ఆరోగ్యంతోపాటు చాల రుచిగా కూడా ఉంటాయి.
Thursday, 28 May 2015
మంచి పనివాడు
కావ్యశ్రీ అక్క ఇంటికి అత్తగారు,బంధువులు వచ్చారు.వారందరినీ కావ్యశ్రీ విందుకు ఆహ్వానించింది.కావ్యశ్రీ కాయగూరలతోపాటు మాంసాహారం కూడా చాల రకాలు తయారుచేసింది.భోజనాలయ్యాక అందరూ కబుర్లలో పడ్డారు.మాటల మధ్యలో వంటలు చాలా బాగున్నాయి ఒక్కదానివే శ్రమపడి చాలారకాలు చేశావు అన్నారు అక్క అత్తగారు.కావ్యశ్రీ కి మంచిపనివాడు ఉన్నాడు లెండి ఇబ్బందేమీ లేదు అన్నాడు ఆమె భర్త. ఇవ్వాళ ఏమిటి ?నాకు పాతిక సంవత్సరాల క్రితమే దొరికాడు అని మురిపెంగా అంది కావ్యశ్రీ.ఇంతకీ ఆ మంచి పనివాడు ఆమె భర్తే.భార్య ఒక్కటే కష్టపడటం ఎందుకని ప్రతి పనిలో ఆమెకు సహాయపడి ప్రేమను వ్యక్తపరచడం అతనికి సరదా.
Monday, 19 January 2015
లక్షా తొంభై అనుమానాలు
ఇంతకు ముందు రోజుల్లో అందరూ పొలాల్లోవైనా,పెరటిలోవైనా కూరగాయలు కానీ,పండ్లు కానీ,ఆకుకూరలైనా,పండుగ వచ్చిందంటే పిండివంటలైనా ఎంతో ఆప్యాయంగా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేవారు.కొన్ని కుటుంబాలలో తప్ప ఆ ఆప్యాయతానురాగాలే కరువైపోయాయి.వాళ్లకు,వీళ్ళకు పంపే బదులు అమ్ముకుంటే పోలా!అనుకునేవాళ్ళే ఎక్కువైపోయారు.ఒకవేళ ఎవరైనా పంపినా అమ్మో! వీళ్ళకు మనతో ఏమి అవసరముందో?మన నుండి ఏమి ఆశిస్తున్నారో?లేకపోతే వీళ్ళకు ఏమి దోషముందో?అది పోవటానికి ఇలా ఇస్తున్నారేమో?ఎవరో ఒకళ్ళకి దానం ఇవ్వమని ఎవరైనా చెప్పారేమో?ఇలా లక్షా తొంభై అనుమానాలు మనసులో మెదులుతున్నాయి.ఇక పిండి వంటలు కూడా నువ్వులు వేస్తారు కనుక అమ్మో!అవితీసుకుంటే మనకు ఏదైనా పట్టుకుంటుందేమో?అనే ఆలోచనలు,అనుమానాలుఎక్కువైపోయాయి.
Subscribe to:
Posts (Atom)