Showing posts with label శుభాకాంక్షలు. Show all posts
Showing posts with label శుభాకాంక్షలు. Show all posts
Sunday, 22 July 2018
Tuesday, 4 April 2017
శ్రీరామ నవమి శుభాకాంక్షలు
నా బ్లాగ్ వీక్షకులకు,తోటి బ్లాగర్లకు,మిత్రులకు,శ్రేయోభిలాషులకు,ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నామన దేశవాసులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.శ్రీ సీతారామ లక్ష్మణ అంజనేయ స్వాముల దయామృత కరుణా కటాక్ష వీక్షణాలు మన అందరిపై విరివిగా ప్రసరించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మరోసారి అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
Tuesday, 28 March 2017
Thursday, 23 February 2017
Wednesday, 25 January 2017
Thursday, 12 January 2017
సంక్రాంతి శుభాకాంక్షలు
నా బ్లాగ్ వీక్షకులకు,తోటి బ్లాగర్లకు,ఏదేశంలో ఉన్నా మన తెలుగు వారందరికీ భోగి,మకర సంక్రాంతి,కనుమ శుభాకాంక్షలు.అందరూ భోగ భాగ్యాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో,ఆనందోత్సాహాలతో సంక్రాంతి పండుగ జరుపుకోవాలని,అదే పల్లెల్లో అయితే సమృద్ధిగా పాడిపంటలతో కుటుంబ సభ్యులు,పిల్లాపాపలతో సుఖంగా,సంతోషంగా ఇల్లంతా కళకళలాడుతూ, సరదాగా సందడిగా పండుగ చేసుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
Friday, 30 December 2016
నూతన సంవత్సర శుభాకాంక్షలు
నా బ్లాగ్ వీక్షకులకు,తోటి బ్లాగర్లకు,వారి కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.ఈ నూతన సంవత్సరంలో మీ,మా,మనందరి ఆశలు,ఆకాంక్షలు నెరవేరి,అన్నింటా విజయం సాధించాలని,సంపూర్ణ ఆరోగ్యంతో కుటుంబసభ్యులతో సరదాగా,సంతోషంగా జీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ 2017 ను స్వాగతిస్తూ అందరికీ ముందుగా మరోసారి శుభాకాంక్షలు.
Saturday, 29 October 2016
Monday, 10 October 2016
Sunday, 4 September 2016
వినాయక చవితి శుభాకాంక్షలు
నా బ్లాగ్ వీక్షకులకు,పాఠకులకు,నా తోటి బ్లాగర్లకు,ఏదేశంలో ఉన్నా అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు.ఇప్పటినుండయినా అందరం గణేష్ చతుర్ధి సందర్భంగా మట్టి వినాయకుని మాత్రమే పూజించి,తరించి,వినాయక నిమజ్జనం చేసేటప్పుడు నీటి కాలుష్యం తద్వారా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి మన వంతుగా పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం.సర్వ విఘ్నాలను తొలగించి మనందరికీ విజయాన్ని చేకూర్చాలని,విద్యార్ధులందరికీ విద్య,ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని సదా విఘ్నేశ్వరుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.మట్టి వినాయకుణ్ణి సృజనాత్మకంగా,విభిన్నరూపాలలో ఎలా తయారుచేయాలో విద్యార్ధులకు అవగాహన కలిగించి,స్వహస్తాలతో తయారు చేసి పూజించితే ఎంత బాగుంటుందో వారికి తెలియచెప్పాలి.అప్పుడు మార్పు అందరిలో దానంతట అదే వస్తుంది.
Wednesday, 17 August 2016
ఆత్మీయత +అనురాగం =రాఖీ పండుగ
ఒకే చెట్టుకు విరబూసిన పుష్పాల్లా ఒకే కడుపున పుట్టిన సోదరి,సోదరుల ఆత్మీయానురాగాలకు గుర్తుగా నిలిచే పండుగే ఈ శ్రావణ పౌర్ణమి నాడు చేసుకునే రాఖీ పండుగ.ప్రతి సోదరి తన సోదరుడి కుడిచేతికి కట్టే రక్ష అతడికి సకల శుభాల్ని, సర్వ సౌఖ్యాల్ని కలిగిస్తుందని మన నమ్మకం.సహోదరుల ప్రేమాస్పద భావనల మిళితమే రక్షాబంధనం.మనకు రాఖీ పండుగ మాత్రమే తెలుసు కానీ సంతోషీ మాత జన్మదినం,హయగ్రీవ జయంతి,సంస్కృత భాష దినోత్సవం కూడా శ్రావణ పౌర్ణమి రోజే.పలు విశేషాల సమాహారం శ్రావణ పొర్ణమి.నా బ్లాగ్ వీక్షకులు,తోటి బ్లాగర్లు వారి సోదర సోదరీమణులతో ప్రపంచంలో ఎక్కడ ఉన్నాఈ పండుగను సరదా సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు.
Saturday, 6 August 2016
స్నేహమంటే ఇదేనోయ్
అమ్మ తర్వాత కమ్మనైన పదం స్నేహం.భగవంతుడు అందరికీ తల్లిదండ్రుల్ని,తోడబుట్టిన వాళ్ళను ఇస్తాడు.కానీ స్నేహితులను ఎంపిక చేసుకునేది మాత్రం మనమే.ఎంత మంది స్నేహితులున్నా అందరి అలవాట్లు,అభిరుచులు ఒకేలా ఉండవు.ఎలా ఉన్నా యధాతధంగా స్వీకరించేదే స్నేహం.స్నేహమంటే మధురమైనది.అసలైన స్నేహంలో ఉన్న కమ్మదనం వర్ణింలేనిది. తల్లిదండ్రులతో,స్వంతవారితో కూడా చెప్పుకోలేని విషయాలను తనతో పంచుకోగలిగినప్పుడు కలిగే నిశ్చింత,ప్రశాంతత నిజమైన స్నేహానికి చిహ్నం.అవి మూడో వ్యక్తికి చేరవేయని వారే నిజమైన స్నేహితులు.అటువంటి స్వచ్చమైన మనసుతోపాటు ఒకరు అంటే ఒకరికి నమ్మకం ఉండాలి. అవసరానికి,సరదాగా వచ్చే వంద మంది స్నేహితులు కంటే కష్టం వచ్చినప్పుడు నీకు నేనున్నాను అనే ధైర్యాన్నిచ్చే వాళ్ళు అసలైన స్నేహితులు.ఈరోజుల్లో అంత మంచి ప్రాణ స్నేహితులు దొరకడం కష్టమే అయినా అటువంటి స్నేహితులు ఒక్కరు,ఇద్దరు ఉన్నా వాళ్ళు ధన్యులు.స్నేహానికి విలువ ఇస్తేనే అది కలకాలం నిలుస్తుంది.స్నేహమంటే ఇదేనోయ్ అంటూ స్నేహితుల దినోత్సవం సందర్భంగా స్నేహం విలువ తెలిసిన అందరికీ నిండు మనసుతో శుభాకాంక్షలు.
Monday, 18 July 2016
Saturday, 7 May 2016
Thursday, 14 April 2016
Thursday, 7 April 2016
ఉగాది శుభాకాంక్షలు
నా బ్లాగ్ వీక్షకులకు,తోటి బ్లాగర్లకు మిత్రులకు,శ్రేయోభిలాషులకు,తెలుగు వారందరికీ సంవత్సరం పొడవునా ఆయురారోగ్య ఐశ్వర్యాలు,సకల విజయాలు చేకూరాలని మనసారా కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు.షడ్రుచులతో తయారుచేసే ఉగాది పచ్చడి లాగానే మనిషి జీవితం కూడా ఎటువంటి వారికయినా తీపి,చేదు,కష్టం,సుఖం,గెలుపు,ఓటములతో కలగలిసి ఉంటుంది.అన్నింటినీ సమానంగా తీసుకోవాలన్నసందేశాన్ని ఇస్తుంది ఉగాది పచ్చడి.ఉగాది రోజు ఆరోగ్యానికి మంచి చేసే వేపపువ్వు కలిపిన ఉగాది పచ్చడి తినటం తెలుగు వారి ప్రత్యేక సంప్రదాయం.
Tuesday, 22 March 2016
వసంతోత్సవం,లక్ష్మీ జయంతి శుభాకాంక్షలు
నా బ్లాగ్ వీక్షకులకు,తోటి బ్లాగర్లకు,మిత్రులకు,శ్రేయోభిలాషులకు వసంతోత్సవ శుభాకాంక్షలు.హోలీ పండుగ రోజు అందరూ సహజ సిద్ధమైన రంగులతో పండుగ జరుపుకుంటే శరీరానికి,మనసుకు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది.వ్యక్తులతో సామరస్యం పెంపొందించుకోవాలని ఈ రంగులకేళి ఆత్మీయ సందేశం.హోలీ రోజు ఎన్ని రంగులు ఉపయోగిస్తామో అన్ని రంగుల పండ్లు,కూరగాయలు ఆహారంలో భాగం చేసుకుంటూ అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఫాల్గుణ పౌర్ణమి అంటే లక్ష్మీదేవి జయంతి కనుక అందరికీ లక్ష్మీ కటాక్షం వల్ల అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు లభించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
Sunday, 6 March 2016
మహాశివరాత్రి శుభాకాంక్షలు
శివుడు భోళాశంకరుడు.అభిషేక ప్రియుడు.ఉపవాసం,జాగరణ ఈ పండుగ ప్రత్యేకత అయినా అవేమీ చేయకపోయినా భక్తితో మనసారా ఓం నమఃశివాయ అంటూ మారేడు దళాన్ని సమర్పించినా ప్రసన్నుడై సకల జనావళిని తన చల్లని చూపులతో కాపాడుతుంటాడు.అట్టి పార్వతీ పరమేశ్వరుల కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించి అందరికీ మనశ్శాంతిని,ఆయురారోగ్యాలను,అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ నా బ్లాగ్ వీక్షకులకు, నాతోటి బ్లాగర్లకు,మిత్రులకు,శ్రేయోభిలాషులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు.
Monday, 25 January 2016
Subscribe to:
Posts (Atom)

















