భోగి భోగ భాగ్యాలను,పండుగ పాడిపంటలను,ధనధన్యాలను,ఆయురారోగ్యాలను, కనుమ కనకాన్ని సమృద్ధిగా ప్రసాదించాలని నిండు నూరేళ్ళు సుఖంగా అందరూ కలిసిమెలిసి ప్రశాంత జీవనాన్ని గడపాలని మనస్పూర్తిగా కోరుకుంటూ నాబ్లాగ్ వీక్షకులకు,తెలుగువారందరికీ మనస్పూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు.
Sunday, 13 January 2019
ఉపద్రవం
శాంతమ్మ రోజు లేచినట్లే ఉదయాన్నే లేచి తలుపు తీద్దామని వెళ్ళింది.కానీ ఏమైందో ఏమో అక్కడే పడిపోయింది.కొడుకు,పని మనుషులు గబగబా వచ్చి లేపటానికి ప్రయత్నించారు.చేతుల్లోనే వాలిపోయి గురక వచ్చేసరికి భయంతో చనిపోయిందేమో అనుకుని ఒకడు వదిలేశాడు.బరువు అంతా కొడుకుపై పడేసరికి నడుము దగ్గర ఒక్కసారి కలుక్కుమంది.భరించలేనంత భాధతోనే వదిలేసినవాడిని గదిమి ఎలాగైతే మంచం మీదికి చేర్చారు.మొహం తుడిచి అమ్మా!నీకేమీ కాలేదు కళ్ళు తెరువు అని నాలుగు సార్లు చెప్పేసరికి స్పృహలోకి వచ్చింది.తమ్ముడికి పెద్ద ఆసుపత్రి ఉండడంతో అన్ని పరీక్షలు నిమిషాల మీద జరిగిపొయినాయి.కుడి భుజం విరిగింది.మోకాలు చిట్లిందని వైద్యులు తేల్చారు.మోకాలుకు కట్టు,భుజానికి శస్త్ర చికిత్స చేయడంతో ఆరు వారాలు మంచానికి పరిమితం అని తేల్చారు.ఆయాలు నర్సులు సేవలు చేస్తున్నా అమ్మ ఒక గదిలో మంచంపై,కొడుకు పక్షం రోజులు పూర్తి విశ్రాంతి నిమిత్తం ఒక గదిలో మంచంపై పండుగ పూట పడుకోవాల్సి వచ్చింది.ఎక్కడికో వెళ్తే ప్రమాదం జరిగితే అదో రకం ఇంట్లోనే ఈవిధంగా జరగడం బాధాకరం.ఉపద్రవం అనేది ఎప్పుడు ఎలా పొంచి వుంటుందో తెలియని పరిస్థితి.ఎప్పుడూ చలాకీగా తిరిగేవాళ్ళు అలా పడుకునేసరికి చూపరులకు కూడా చాలా బాధ అనిపించి వాళ్ళను విశ్రాంతి తీసుకోనీయకుండా చూడటానికి వరుసగా లైన్లు కట్టారు.
Subscribe to:
Posts (Atom)