భోగ భాగ్యాలను ఇచ్చే భోగి ,సరదాను ఇచ్చే సంక్రాంతి, కమ్మని కనుమ మన అందరికీ క్రొత్త సంవత్సరంలో కొంగ్రొత్త వెలుగులు నింపాలని,సంపూర్ణ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను సదా భగవంతుడు ప్రసాదించాలని,పాడి పంటలతో,ధన ధాన్యాలతో రైతులు అందరూ చల్లగా ఉండాలని,భోగిమంటలు,గంగిరెద్దులు,హరిదాసుల ఆటపాటలతో,ముంగిట రకరకాల రంగవల్లులతో గొబ్బెమ్మలతో,గుమ్మానికి మామిడి తోరణాలతో,గడపకు పసుపు కుంకుమలతో ,చెరుకు గడలు,తేగలు,కమ్మని పిండి వంటల ఘుమఘుమలతో,సరదాగా,సంతోషంగా మన సంస్కృతి సంప్రదాయాలను పిల్లలకు తెలియచేస్తూ పెద్దలు,పిన్నలు ఆనందోత్సాహాలతో వారి వారి సంప్రదాయాన్ననుసరించి పండుగ జరుపుకోవాలని,మనస్పూర్తిగా కోరుకుంటూ నా బ్లాగ్ వీక్షకులకు,చదువరులకు సంక్రాంతి,కనుమ,ముక్కనుమ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.