Sunday, 17 November 2024

మనకు అనవసరం

                                         ఈరోజుల్లో ఎదుటి వారిని విమర్శించేవారే ఎక్కువ కనుక నలుగురు మన గురించి ఏమనుకుంటున్నారో మనకు అనవసరం.ఎదుటివాళ్ళ మాటలు పట్టించుకుని సమయం వృధా చేసుకునేకన్నా మనకు నచ్చిన విధంగా బ్రతకడం,అవసరమైనవారికి మనకు తోచిన సహాయం చేయడం,సంతోషంగా జీవితాన్ని గడపడం అలవాటు చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది.మనమేంటో మనకు తెలుసు కనుక ప్రతిదీ ఒకరికి చెప్పి నిరూపించుకోవలసిన అవసరం లేదు.