Sunday, 5 April 2026

ఓటమి - విజయం

                                                           మనము జీవితంలో అనుకున్న పని సాధించలేనప్పుడు ఓడిపోయాము అని బాధపడుతూ ఉంటాము. కానీ జీవితము అనే ప్రయాణములో ఓటమి ముగింపు ఎప్పటికీ కాదు.ఇంకా ముందుముందు మరెన్నో నేర్చుకోవడానికి ఒక అవకాశం మాత్రమే. ఓటమి ఒక పాఠం అనుకుని ఇంకా పట్టుదలతో ముందుకు సాగాలి. ఇంకా ఎన్నో విజయాలను సాధించి అనుకున్న లక్ష్యం చేరుకోవాలి.అప్పుడు అంతులేని ఆనందం మన స్వంతం అవుతుంది.

పెన్సిలు - రబ్బరు

                                                     మనము ఒకరు సంతోషంగా ఉంటే వారి ఆనందాలను గురించి  వ్రాయడానికి పెన్సిలు కాకపోవచ్చు కానీ మనము ఒకరు బాధ పడుతుంటే వారి దుఃఖాన్ని తొలగించడానికి రబ్బరు (ఎరేజరు ) లాగా ఉపయోగపడవచ్చు.మీరూ ఒకసారి ఆలోచించండి. ధన్యవాదములు.