ఏ పౌర్ణమి ప్రత్యేకత ఆ పౌర్ణమికే ఉన్నా అన్నింటిలో కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి ప్రత్యేకతే వేరు.తెల్లవారుఝామునే నిద్ర లేచి నదీస్నానానికి వెళ్లి అభిషేకాలు,పూజలు దానితోపాటు రోజంతా ఉపవాసం ఉండి నేతిబీరకాయ ఎక్కడ దొరుకుతుందా అని వెతుక్కుని ఎలాగైనా సంపాదించి నేతి బీరకాయ పచ్చడి చేసి దానితోపాటు రకరకాల వంటలు చేసుకుని చలిమిడి,వడపప్పు,జామ కాయలతో గుడికి వెళ్లి ఆవునేతితో 366 వత్తులు వెలిగించి మారేడు,ఉసిరి,జమ్మి వృక్షాలను పూజించి ఇంటికి వచ్చి తులసికోట వద్ద దీపాలు పెట్టడం,ప్రత్యేకంగా ఈరోజున చంద్రుడిని వరిపిండితో ముగ్గు రూపంలో వేసి పసుపు,కుంకుమ,గంధం,పూలు అలంకరించి దీపాలు వెలిగించి వెండి గిన్నెలో పాయసం నివేదన పెట్టి పూజచేసే పద్ధతి,ఆ హడావిడి ఆ సంతోషం చెప్పనలవి కానిది.చంద్రుడు మంచి భర్తను మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తాడని చిన్నప్పుడు పెద్దలు చెప్పేవాళ్ళు.అందుకే అందరూ నిండు మనసుతో,నిండు పున్నమిలో నిండుగా దీపాలు పెట్టి నిండు నూరేళ్ళు కార్తీక పున్నమి చంద్రుని దయవల్ల చల్లగా,ప్రశాంతంగా,సంతోషంగా జీవించాలని కోరుకుంటూ అందరికీ కార్తీక పున్నమి శుభాకాంక్షలు.
No comments:
Post a Comment