ఈ రోజుల్లో పెద్ద,చిన్న అనే తేడా లేకుండా తల వెంట్రుకలు ఎక్కువగా రోజూ రాలిపోతున్నాయి.దీనికి సహజ సిద్ధమైన ఓ బుల్లి పరిష్కారమే ఉల్లినూనె.ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా కోసి రసం తీసి ఒక కప్పు కొబ్బరి నూనె,గుప్పెడు కరివేపాకు,కొద్దిగా మెంతులు వేసి కరివేపాకు నల్లబడే వరకు వేడిచేసి చల్లార్చి వడకట్టి ఒక సీసాలో పోసుకోవాలి.దీన్ని వారానికి రెండుసార్లు తలకు నూనె ఇంకేలా మర్దన చేయాలి.ఒక అరగంట తర్వాత రసాయనాలు లేని షాంపూ ఉపయోగించి తల స్నానం చేయాలి.ఈ విధంగా చేయడం వలన తలలో రక్త ప్రసరణ బాగా జరిగి తల వెంట్రుకలు ఊడడం ఆగిపోవడంతోపాటు చుండ్రు ఉంటే కూడా తగ్గిపోతుంది.దీనితో వెంట్రుకలు నల్లగా ఒత్తుగా పెరుగుతాయి.
No comments:
Post a Comment