గురువారం అమావాస్య రావడంతో ఆషాడ అమావాస్య ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.ఈరోజు వీలయినంతవరకు భగవన్నామస్మరణ చేసుకోవడం మంచిది.పారాయణ చేసుకోవడం కుదరకపోతే చరవాణి లో వింటూ ఎవరి పని వారు చేసుకోవచ్చు.ఈ రోజు దైవ సంబంధమైన శ్లోకాలు విన్నా చదివినా మామూలు రోజుల్లో కన్నా ఎన్నో రెట్లు ఫలితం ఉంటుందని పెద్దలు,పండితుల ఉవాచ.అమ్మవాస్య రోజు పెద్దలను తలుచుకుని ఒక కిలో బియ్యం,అర కిలో చొప్పున రెండు రకాల కూరగాయలు గుడిలో పూజారి గారికి ఇవ్వడం మంచిది.పూజారి గారు అందుబాటులో లేకపోతే ఎవరైనా భోజనానికి ఇబ్బందిగా ఉన్న వాళ్ళకు ఇవ్వగలిగినంత మందికి ఇవ్వవచ్చు.ఈవిధంగా చేసినట్లు అయితే పితృదేవతలు సంతోషపడి మన కుటుంబాన్ని చల్లగా కాపాడుతూ ఉంటారట.అలాగే పెద్దల ఆశీర్వాదంతో ఎన్నో రోజులుగా వాయిదా పడిన పనులతో పాటు పిల్లల పెళ్ళిళ్ళు కూడా త్వరగా పూర్తి అవుతాయట.పెద్దలు అనుభవంతో చెప్పడంతో చాల మందికి తెలిసిన విషయమే అయినా దీన్ని ఆచరించడం వలన మంచి జరుగడమే కాకుండా కొంతమందికి చేతనైనంత సహాయపడిన వాళ్ళము అవుతాము కదా! మనం ఎదుటివారికి ఎంత సహాయపడితే మనకు అంతకన్నా ఎక్కువ మానసిక ప్రశాంతత లభిస్తుంది.నెలలో ఒకరోజు మనకు వచ్చే ఆదాయంలో కొంచెం ఖర్చుపెట్టి ఈ పద్దతిని ఎవరి వీలుని బట్టి వాళ్ళు ఆచరిస్తారని ఆశిస్తున్నాను.ధన్యవాదములు.
Thursday, 28 July 2022
చేతనైనంత సహాయం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment