ఈ రోజుల్లో ఎవరు మంచో ఎవరు చెడో తెలుసుకోలేని పరిస్థితిగా ఉంది.పైకి నవ్వుతూ మాట్లాడినా కానీ అది పైపైనే అన్న చందంగా తయరైపోతున్నారు.మనసులో ఒకటి పైకి ఒకటి మాట్లాడుతూ ఉండడంతో అయోమయంగా ఉంటుంది.పైకి తియ్యని మాటలు మాట్లాడుతూ మనసులో విషం కక్కుతూ ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోతున్నారు.అందరూ ఆ విధంగా ఉండకపోయినా ఎక్కువ మంది అలా ఉండడంతో అందరినీ ఒకే గాటన కట్టాల్సిరావడం నిజంగా బాధాకరమే.అందుకే ఎవరితోనైనా ఆచితూచి మాట్లాడుతూ స్వంత విషయాలు ఎవరితో పడితే వాళ్ళతో పంచుకోకపోవడమే మంచిది.మళ్ళీ వాటిని వేరేవాళ్ళ దగ్గర ప్రస్తావించి ఎగతాళి చెయ్యడమో లేక వాటిని ఆసరా చేసుకుని వేరే విధంగా బెదిరించడం లాంటి మోసాలు జరగడం మామూలైపోయింది.కనుక మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది.
No comments:
Post a Comment