Sunday, 26 June 2016

సౌందర్య ఆరోగ్య రహస్యం

                                                               పై పై మెరుగులు ఎన్ని చేసినా ఉన్న అందాన్ని కొద్దిగా పెంచగలం కానీ పూర్తి స్థాయిలో అందంగా ఉండలేము.కొంతమందికి ఎంత డబ్బు,సకల సౌకర్యాలు ఉన్నా తృప్తి లేనట్లుగా,ఇంకా ఇంకా డబ్బు సంపాదించాలనే తాపత్రయంతో ఎప్పుడూ చిటపటలాడుతూ తెచ్చి పెట్టుకున్న గాంభీర్యంతో ముఖం ముడుచుకుని నలుగురితో కలవకుండా ఒంటరిగా గిరి గీసుకుని ఉంటారు.కొంతమంది డబ్బుతో నిమిత్తం లేకుండా ఉన్నంతలో ఎదుటివారికి సహాయపడుతూ తృప్తిగా,ముఖంపై చిరునవ్వు చెదరనీయoకుండా,ఆనందంగా ఉంటారు. సహజంగా,చక్కటి చిరునవ్వు ముఖంతో,మనసు నిండా సంతృప్తితో హాయిగా నవ్వగలిగినప్పుడు సహజ సౌందర్యం సంపూర్ణ ఆరోగ్యం వాటంతట అవే వస్తాయి.వీటిని మించిన  సౌందర్య సాధనాలు మరెక్కడా దొరకవు.ఇదే సహజ సౌందర్య ఆరోగ్య రహస్యం.

No comments:

Post a Comment