అందంగా కనిపించాలని అనుకోవడం మానవ సహజ లక్షణం.ఈ శీతాకాలంలో చర్మం పొడిబారకుండా ఉండటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము.ఎన్ని ప్రయత్నాలు చేసినా అప్పుడప్పుడు ఇబ్బంది పడుతూనే ఉంటాము.అందుకే మన ఇంటిలో అందుబాటులో ఉన్న వాటితోనే చర్మం కాంతివంతంగా మెరిసేలా చేయడం ఎలాగంటే?ఒక స్పూను కలబంద గుజ్జు,ఒక స్పూను మెత్తటి అరటిపండు,ఒక స్పూను పెరుగు ఒక అర స్పూను నువ్వులనూనె,ఒక అర స్పూను బాదం నూనె,ఒక అర స్పూను ఆలివ్ నూనె,ఒక అర స్పూను తేనె అన్నీ కలిపి ముఖానికి పట్టించి ఆరిపోయిన తర్వాత కడిగేయాలి.ఈ విధంగా చేస్తుంటే చర్మం అందంగా,కాంతివంతంగా మెరిసిపోతుంది.సమయం ఉంటే వారానికి ఒకరోజు శరీరం మొత్తం పట్టించవచ్చు.పై పూత ఒక్కటే కాకుండా ఈ కాలంలో లభించే అన్ని రకాల పండ్లు,కూరగాయలు తినాలి.చల్లగా ఉంది కదా అని అశ్రద్ద చేయకుండా మంచినీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉంటే చలికాలంలో కూడా అందంగా కనిపించవచ్చు.
No comments:
Post a Comment