మనకన్నా పై మెట్టు మీద ఉన్న వాళ్ళను చూచి ఈర్ష్య పడడం మన కన్నా క్రింది మెట్టుపై ఉన్నవాళ్ళను చూచి మేమే గొప్పగా పైన ఉన్నామని గర్వపడడం కొంతమంది మానవుల సహజ లక్షణం.రెండు లక్షణాలు కూడా ప్రమాదకరమే.ఈ రోజుల్లో కొంత మంది పై విధంగానే ప్రవర్తిస్తున్నారు.అందులో ఒకడు జీవన్. జీవితం క్షణభంగురం అని జీవన్ లాంటి వాళ్ళకు అర్ధం కాదు.జీవన్ అతనితోపాటు అతని భజనగాళ్ళు దీన్ని మర్చిపోయి ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు అహంకారంతో విర్రవీగుతూ దురుసుగా ప్రవర్తిస్తూ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ,ప్రక్కవాళ్ళకు తగువులు పెట్టి వాటిని వాళ్ళే తీర్చడం చేస్తూ ఉంటారు.ఇవి చాలవన్నట్లు దీనికి తోడు ఈమధ్య కొంగ్రొత్త ధోరణి మొదలెట్టాడు.ఆడపిల్లలకు పసుపు కుంకుమల క్రింద తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్థి రేటు పెరిగేసరికి జీవన్ కి దుర్బుద్ధి పుట్టి తన భజనగాళ్ళను వేసుకుని ఆ ఆస్తులు కాజేయాలని ఈ ఊరి వాళ్లందరూ ఆడపిల్లలకు ఆస్తులు దోచిపెడతారని,మగపిల్లలకు అన్యాయం చేస్తారని తల్లిదండ్రుల్ని,ఆస్తులు దోచుకుని వెళ్తారని ఆడపడుచుల్ని పిచ్చితిట్లు తిట్టడం మొదలెట్టాడు.డబ్బు పిచ్చి నషాళానికి అంటినట్లు పెళ్లిళ్లకు పేరంటాళ్ళకు వెళ్ళినా బంధువులు అందర్నీ సమావేశపరిచి ఒకటే పిచ్చిగోల.ఇతన్ని చూచి జీవన్ బాటలో మరి కొంతమంది ఆశపరులు తయారయ్యారు.ఇదే నేటి సరి కొత్త ధోరణి అనుకుంటున్నారు.అత్యాశతో తను చేస్తున్న పని,మాట్లాడే మాటలు చాలా తప్పని తెలుసుకునేటప్పటికి జీవితంలో ఏమీ మిగలదు.తన వాళ్ళందరి మనస్సుల్లోస్థానం కోల్పోవటం తప్ప.తర్వాత ఎంత కావాలనుకున్నా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందం అయిపోతుంది.తాత పళ్ళెం తలవైపే ఉంటుందని మనం ఏమి చేస్తే మన పిల్లలు కూడా అంతకన్నా ఎక్కువగా అదే తరహాలో ఉంటారని జీవన్ లాంటి వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది.తల్లిదండ్రుల్ని,ఆడపడుచుల్ని తిట్టకూడదని తిడితే జీవితంలో పైకి ఎదగరని ఆయాచితంగా ఎదుటి వారి సొమ్ము కోసం ఆశించకుండా ఒళ్ళు వంచి ఉన్న కాస్త సమయాన్ని మంచిపనులకు ఉపయోగిస్తూ సత్ప్రవర్తనతో ఉంటే జీవన్,అతని చుట్టూ ఉన్నవాళ్ళకే కాక వినే వాళ్ళకు,ఇంట్లో వాళ్ళకు కూడా ప్రశాంతంగా ఉంటుంది.
చాలా బాగుంది
ReplyDelete