శ్రీనిష్ పదవ తరగతి చదువుతున్నప్పుడు తండ్రి చనిపోవడంతో తండ్రి ప్రభుత్వోద్యోగం శ్రీనిష్ కి వచ్చింది.చిన్న వయసులోనే చేతి నిండా డబ్బు అందుబాటులో ఉండడంతో మద్యం అలవాటయింది.ఇంట్లో వాళ్ళు మానేయమని గొడవ చేసినప్పుడు మొదట్లో నాలుగు రోజులు మానేయడం మళ్ళీ మొదలు పెట్టడం చేస్తుండేవాడు.తర్వాత తర్వాత నాకు పదేపదే చెప్పొద్దు.నేను మానలేనుఇవ్వాళ చస్తే రేపటికి రెండు అంతే అనేవాడు.దానితో కాలేయం,అన్ని అవయవాలు చెడిపోయి అర్ధంతరంగా నలభై ఎనిమిదేళ్లకే చనిపోయాడు.చిన్న వయసులోనే పెళ్ళి చేయడంతో పిల్లలు పెద్దవాళ్ళయి సాంకేతిక విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.ఇల్లు కొనుక్కున్నారు.పిల్లలు పెళ్లి చేద్దామనుకునేలోపు ఇలా జరిగింది.మిగతా అన్ని విషయాల్లో పద్దతిగా వున్నా మద్యం విషయంలో చెవిలో జోరీగల్లా తల్లి,భార్య చెప్పినా వినకుండా చెడ్డ అలవాటుకు బానిసై చేతులారా జీవితం నాశనం చేసుకోవడమే కాకుండా ఇంట్లో అందరికీ దుఃఖాన్ని మిగిల్చాడు.జీవితంలో ఇబ్బందులన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండాల్సిన సమయంలో అకస్మాత్తుగా రెండు రోజుల్లో అన్నీ ముగిసిపోవడంతో బతికున్నన్నాళ్లు ఇవాళ చస్తే రేపటికి రెండు అనేవాడు.అదే విధంగా జరిగింది అంటూ ఇంట్లో అందరూ తల్లడిల్లిపోతున్నారు.
No comments:
Post a Comment