శైలజ కూతురు ఫ్రెయ ఆస్ట్రేలియాలో ఇల్లు కొనుక్కున్నామని తల్లిదండ్రులను రమ్మని ఆహ్వానిస్తే వెళ్లారు.ఇల్లు నగరానికి దూరంగా ఒక పల్లెటూరిలో కొనుక్కోవడంతో ప్రశాంతంగా ఉంది.శైలజ ఉదయాన్నే నిద్ర లేచేటప్పటికి ఇంటి చుట్టూ కంగారూలు కూర్చుని ఉన్నాయి.శైలజకు అంత దగ్గరగా వాటిని చూడడంతో భలే ముచ్ఛేటేసింది.ఎంతో సంతోషంగా తలుపు తీసుకుని దగ్గరగా చూద్దామని వెళ్ళేసరికి పరుగెత్తి ఒక పది అడుగుల దూరంలో కూర్చున్నాయి.మళ్ళీ రెండు అడుగులు వేసి చూద్దామని శైలజ ముందుకెళ్ళేసరికి మళ్ళీ అదే విధంగా కొద్దీ దూరం వెళ్ళి చూస్తూకూర్చున్నాయి.అమ్మా!కంగారూల పొట్ట దగ్గర ఉన్న సంచిలో పిల్లలు ఉంటే మాత్రం దగ్గరకు వెళ్ళకు.వాటి పిల్లలకు హాని తలపెడతారేమో అని తల్లి కంగారూలు కంగారుపడి ఎదురు తిరిగే అవకాశం ఉంది కనుక జాగ్రత్త్తగా ఉండాలి అని చెప్పింది ఫ్రెయ.శైలజకు ఆస్ట్రేలియాలో ఉన్నన్ని రోజులు కంగారులతో కాలక్షేపం సరిపోయింది.
No comments:
Post a Comment