ఒక చిన్న ప్రాణి ఉడుత వలన సంవత్సరానికి కొన్ని లక్షల చెట్లు పెరుగుతాయన్న విషయం మనం కలలోనైనా ఊహించగలమా ? నిజానికి నేను కూడా మొదట ఈ విషయం వినగానే చాలా ఆశ్చర్యపోయాను.ఉడుత మనకు చేసే మేలు దాని మతిమరుపు వలన చెట్లు పెరుగుతాయన్న విషయం చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పడం వలన తెలుసు.కానీ కొన్ని లక్షల చెట్లు పెరగడానికి ఉడుత దోహదపడుతుందన్న విషయం ఒక టి.వి లో వచ్చే కార్యక్రమం ద్వారా తెలిసింది.ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ఉడుత ఆహారం సేకరించే సమయంలో తర్వాత తినొచ్చు అన్న ఉద్దేశ్యంతో కొన్ని గింజలను భూమిలో చిన్న చిన్న గుంటలు తవ్వి దాచిపెడుతుంటుంది.తర్వాత వాటిని ఎక్కడ పెట్టిందో మర్చిపోతుంది.వర్షం వచ్చినప్పుడు ఆ గింజలు మొలకెత్తుతాయి. ఈ క్రమంలో ఉడుతలన్నీ 365 రోజులు రోజూ అదే పని చేయడంతో సంవత్సరం తిరిగేటప్పటికి కొన్ని లక్షల చెట్లు పెరుగుతాయట.ఎంత ఆశ్చర్యం.నిజంగా పర్యావరణానికి ఇంత మేలు చేస్తున్న ఉడుతలకు,వాటి ద్వారా మొలకెత్తి ఎవరూ పెంచి పెద్ద చేయక పోయినా భగవంతుని దయ వలన వట వృక్షాలై మనకు ఎంతో మేలు చేసే చెట్లకు,మనకు ప్రత్యక్షంగా కనిపించకుండా వీటన్నింటినీ పరోక్షంగా చేస్తూ మనల్ని కాపాడుతున్న భగవంతునికి మనందరం ఎంతో రుణపడి ఉన్నాము.ఎవరైనా మనకు ఏ చిన్న సహాయం చేసినా ,మేలు చేసినా ధన్యవాదాలు తెలియచెయడం మన పెద్దలు నేర్పిన సంస్కారం.అలాగే మనందరికీ ఇంత మేలు చేస్తున్న ఉడుతలకు,వృక్షాలకు,మనందరినీ చల్లగా కాపాడే భగవంతునికి మీ మా తరఫున ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.
అడగందే అమ్మైనా పెట్టదు. మ్రొక్కందే దేవుడైనా వరాలివ్వడు. అలాంటింది వృక్షం ఏమీ పట్టించుకోకపోయినా ఎన్నోవిధాలుగా ఆదుకొంటుంది. చెట్ల వ్యాప్తికి సంబంధించిన ఆశక్తికరమైన అంశం తెలియజేయటం చాలా బాగుంది. చెట్లకు సంబంధించి మరింత నా అభిప్రాయాన్ని నా బ్లాగులో https://telugujigi.blogspot.com/p/0043.html తెలిపాను. వీలుంటే పరికించగలరు.
ReplyDeleteధన్యవాదములు.
Delete