తామర గింజలు మనకు ప్రకృతి ప్రసాదించిన పరమౌషధం అని ఈమధ్యనే తెలిసింది.ఎప్పుడన్నా ఒకసారి వాడడమే కానీ వీటి ప్రయోజనాలు అంతగా తెలియక పోవడంతో వీటిని ఎక్కువగా వాడుకోము.కానీ వీటిలో ఎన్నో పోషకాలతోపాటు వయసు మీద పడనీయని ఎంజైమ్ పుష్కలంగా ఉండడంతో చర్మం మృదువుగా ఉంటుందట.నిద్రలేమిని తగ్గించి మనసు ప్రశాంతంగా ఉంచుతుందని,రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేసి రక్తపోటును నియత్రణలో ఉంచుతుందని తెలిసింది.దీనిలో కాలరీలు తక్కువ వుండి పీచు ఎక్కువ ఉండడంతో ఆకలి తగ్గి బరువు తగ్గడంతోపాటు చక్కర వ్యాధిని నియంత్రణలో ఉంచడానికి దోహదపడుతుంది.వీటిని నేతిలో వేయించి కొద్దిగా ఉప్పు,కారం చల్లి తింటే చాలా రుచిగా ఉంటాయి.ఫూల్ మఖానా అని పిలువబడే వీటిని ఎన్నో రకాల వంటలలో ఉపయోగించుకోవచ్చు.
The lotus comes from the murkiest water but grows into the purest thing.
ReplyDeleteOnline Breaking News Telugu
Telangana Districts News
ఎక్కడ నుండి వచ్చింది,ఎంత బాగా ఉంది అన్నదానికన్నా మనకు ఎంత ఉపయోగపడుతుంది అన్నది ముఖ్యం.పువ్వులు పూజకు మంచిది.అలంకరణకు బాగుంటాయి.గింజలు తినడానికి మంచిది.
Delete