తెలిసో తెలియకో ఒక్కొక్కసారి ఎదుటి వారికి మనవలన ఇబ్బంది కలుగవచ్చు.సాధ్యమైనంతవరకు ఏదైనా క్రొత్త పని చేసేటప్పుడు ఎవరికీ ఇబ్బంది కలుగకుండా ఒకటికి పదిసార్లు అలోచించి చెయ్యడం సంస్కారవంతుల లక్షణం.నా పని అయితే చాలులే ప్రక్కవాడు ఎలా పోతే నాకు ఎందుకు? అని అనుకునేవారి గురించి ఇక్కడ అప్రస్తుతం.కనుక పొరపాటున గతంలో ఏదైనా తప్పు జరిగితే ఆ జరిగిపోయిన దాని గురించే ప్రతి క్షణం ఆలోచిస్తూ మనం బాధపడుతూ చుట్టుప్రక్కల ఉన్న మనవారిని బాధ పెట్టి దానివలన మనశ్శాంతిని కోల్పోవడం మంచిది కాదు.దీన్ని ఒక గుణపాఠంగా తీసుకుని మళ్ళీ జీవితంలో అటువంటి తప్పులు జరగకుండా చూచుకోవడం ఉత్తమం.ఎదుటి వారికి మనవలన ఇబ్బంది కలిగితే వెంటనే వారికి క్షమాపణ చెప్పి ఆ తప్పును సాధ్యమైనంత వరకు సరిదిద్దాలి.అప్పుడు అందరికీ మనశ్శాంతి.క్షమాపణ చెప్పడం సంస్కారం.ఇదే మనశ్శాంతికి చక్కటి మార్గం..
No comments:
Post a Comment