Monday, 25 July 2016

జర భద్రం

                                                 వర్షాకాలం వచ్చిందంటే చాలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే రకరకాల వ్యాధులు వెన్నంటి వస్తాయి.వర్షాలు పడక ముందే ఇంటి చుట్టుపక్కల,ఇంట్లో బూజు,దుమ్ము,ధూళి లేకుండా శుభ్రం చేయాలి. శ్వాసకోశ సమస్యలు రాకుండా ఉంటాయి.వర్షం పడినప్పుడు ఇంటి బయట నీరు నిల్వ లేకుండా చూడాలి.దోమలు వృద్ధి చెందకుండా ఉంటాయి.వర్షం పడుతుంది కదా అని వేడివేడిగా కాఫీ,టీ ఎక్కువగా తీసుకోకుండా గోరువెచ్చటి నీరు తాగటం మంచిది.నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు ఎక్కువ కనుక పరిశుభ్రమైన నీటిని వీలైతే కాచి చల్లార్చిన నీటిని రోజుకు కనీసం 8 గ్లాసులు తాగాలి.వర్షంలో తడవటం సరదాగా ఉంటుంది కానీ తర్వాత వెన్నంటే  వచ్చే జలుబును భరించడం కష్టం.ఒకరికి వచ్చిపోదు కదా!తగిన జాగ్రత్త తీసుకోకుంటే ఇంటిల్లిపాదీ చుట్టబెడుతుంది.అందుకే చిన్న గొడుగు వెంట తీసుకెళ్ళడం శ్రేయస్కరం.పొరపాటున వర్షంలో తడిస్తే ఇంటికి రాగానే జుట్టు ఆరబెట్టుకున్నాం కదా!అనుకోకుండా తల స్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.ఇకపోతే వర్షాకాలంలో వేడివేడిగా మిరియాలపొడి వేసిన సూపులు,వేడిగా ఉన్నప్పుడే ఆహరం తీసుకోవాలి.సాద్యమైనంత వరకు బయట చిరుతిళ్ళు తినకపోవడమే మంచిది.ఎందుకంటే ఉల్లి.కీరా,కారట్,కాబేజీ వంటి పచ్చి కూరగాయ ముక్కలు,తురిమి నిల్వ ఉంచితే బాక్టీరియా చేరి త్వరగా డయేరియా వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదముంది.జర భద్రంగా ఉంటే ఖాళీ సమయంలో వేడివేడి మొక్కజొన్నపొత్తులు,మిరపకాయ బజ్జీలు,ఈ సమయంలో దొరికే నేరేడు,సీమ రేగు పండ్లు తింటూ,బత్తాయి రసం తాగుతూ,మరీ ముఖ్యంగా సహజంగా దొరికే పుట్టగొడుగులతో రకరకాల వంటలు తింటూ వర్షా కాలాన్ని చక్కగా సంతోషంగా ఆస్వాదించవచ్చు.   

No comments:

Post a Comment