Thursday, 1 December 2016

హృదయాకారంలో ఆకులు

                                                  హృదయాకారంలో ఉండే ఆకులతో లేత ఊదా,తెలుపు కాడలతో,వంకాయ రంగు కాయలతో ఉండే తీగ బచ్చలి,కుదురు బచ్చలి జిగురుగా ఉంటుందని అందరూ ఇష్టపడరు.కానీ ఇందులో ఉండే ఈ జిగురు కొలెస్టరాల్ తగ్గించడంతో పాటు జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.రక్తహీనతను,మతిమరుపును తగ్గిస్తుంది.గుండె జబ్బులు,కాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.ఇవి కుండీలలో కూడా చక్కగా పెరుగుతాయి.వీటి  పండ్లు చూడచక్కగా ఉండి నొక్కగానే ఊదారంగు నీరు బయటకు వస్తుంది.పిల్లలు వీటిని కోసి రసం పిండి సరదాగా ఆటలాడుకుంటూ ఉంటారు.కనీసం వారానికి ఒకసారయినా పెద్దలు,పిల్లలు కూడా బచ్చలి కూర తినడం మంచిది.కంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

No comments:

Post a Comment