Friday, 10 March 2017

మనసులో నవ్వు

                                                            దోమలకు ధనిక,పేద అనే తారతమ్యం ఉండదు.మంత్రి అయినా రిక్షావాలా అయినా ఒకటే.దానికి కావలసిందల్లా ఎవరో ఒకరి రక్తం.ఎవరిలోనయినా ప్రవహించేది ఒకే రక్తం కనుక అది అందరినీ కాటు వేస్తుంది.ఇబ్బందుల పాలు చేస్తుంది.మొన్నామధ్య ఒక రాజకీయ నాయకుడు తన కొడుకు పెళ్ళికి మంత్రి గారిని ఆహ్వానించడానికి  భార్యా సమేతంగా వెళ్ళాడు.మంత్రిగారు వచ్చేవరకు కొంత సమయం వేచి ఉండవలసి వచ్చింది.కార్యాలయం ఎంత శుభ్రంగా ఉన్నా కూడా అక్కడక్కడ దోమలు ఎగురుతున్నాయి.మాటిమాటికి అవి చుట్టూ ఎగురుతూ అక్కడ కూర్చున్నవారిని కుట్టడానికి ప్రయత్నిస్తున్నాయి.ఈ దోమలకు సామాన్య మానవుడు అయినా మంత్రి అయినా తారతమ్యం తెలియదు కదా!అని ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వెళ్ళిన ఆమె మనసులో నవ్వుకుంది.  

No comments:

Post a Comment