ఓం శ్రీ సాయి రాం సాయి బాబా నీవే కరుణతో తీర్చాలి నావ్యధ అంటూ జయంతమ్మ కన్నీటితో వ్రాసుకున్న సాయి సంకీర్తన
బాబా సాయిబాబా వినవయ్యా నా మొరవింటే కరుణ చూపి తీర్చాలి నా వ్యధ బాబా సాయిబాబా "బా"
వైకుంఠవాసా వాసుదేవ తనయా హే పాండురంగా
హే పద్మనాభా శ్రీ శ్రీనివాసా హే చిద్విలాసా
కాపాడరావా కైలాసవాసా "2"బాబా సాయి బాబా "2"
ధ్యానమ్ము చేసే మార్గమ్మునివ్వు నీజపము చేసే ఆ శక్తినివ్వు
నీ పూజ చేసే పుణ్యమ్మునివ్వు నీ చెంత చేరే భాగ్యమ్ము నివ్వు "బా"
ఆదిశక్తి నీవే అనంతుడవు నీవే మానుష్య రూపు దాల్చీ
మాతోనే తిరిగావే నాలోన నీవున్నావు నీలోన నేనున్నాను
ఎన్ని జన్మలైనగానీ నీతోనే ఉంటాను నీలోనే ఉంటాను" బా"
తపః ఫలములీయా శబరినైనగాను నీపాదములు కడుగగా
గుహుడైనగాను ముక్కంటికి కన్నులొసగే కన్నప్పనుగాను
నీ పాదాలచెంత ధూళినే నేనూ నీపాద సన్నిధిలో ధూళినే నేనూ "బా"
No comments:
Post a Comment