తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్లు తొందరపడి నోరు జారితే అది ఎదుటివారి మనసులో శాశ్వతంగా నిలిచిపోతుంది.కొంతమంది అంతగా పట్టించుకోకపోయినా కానీ సున్నిత మనస్కులు దాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుని అన్నవాళ్లు కనిపించినప్పుడల్లా బాధపడుతుంటారు.ఒకసారి అన్నమాటను తిరిగి వెనక్కు తీసుకోలేము కనుక తొందరపడి ఎవరినీ మాట్లాడకూడదు.ఎదుటివారిని ఎప్పుడూ కూడా అనవసరంగా బాధ పెట్టకూడదు.అలా చేసినట్లయితే ఖచ్చితంగా మనం ఇంకొకరితో అనవసరంగా అనిపించుకుని ఎప్పుడో ఒకసారి బాధపడవలసి వస్తుంది.ఆ ఏముందిలే ఏదో చెబుతుంటారు అనుకోవచ్చేమో కానీ ఇది నిజం.
No comments:
Post a Comment