Tuesday, 1 October 2019

ఎదురు చూడకండి

                                                         నిద్ర పోవడానికి నిద్ర వచ్ఛే వరకు ఎదురు చూడకండి.రోజూ  ఒకే సమయానికి నిద్ర పోవడం అలవాటు చేసుకుంటే హాయిగా,ప్రశాంతంగా చక్కటి నిద్ర మన స్వంతమవుతుంది.విశ్రాంతి తీసుకోవడానికి మన శరీరం పూర్తిగా  అలిసిపోయేవరకు ఎదురు చూడకండి.మద్యమద్యలో కాస్త విశ్రాంతి తీసుకుంటూ పని చేసుకుంటే అలుపు సలుపు లేకుండా ఎంతటి పని అయినా హైరానా పడకుండా తేలిగ్గా చేసుకోవచ్చు.దేవుడిని ప్రార్ధించడానికి కష్టాలు వచ్ఛే వరకు ఎదురు చూడకండి.నిత్యం దైవ ప్రార్ధన మానసిక ప్రశాంతతను ఇవ్వడమే కాక ఎటువంటి సమస్యలు ఎదురైనా ఎదుర్కోగల మానసిక స్థయిర్యాన్నికలిగిస్తుంది.స్నేహితులను కలవాలంటే వాళ్ళు మన కోసం ఎదురు చూచి  చూచి విసుగు వచ్ఛేలా చేయకండి.చరవాణి లో మాట్లాడుకున్నా కానీ అప్పుడప్పుడు కలిసి ఒకరి యోగ క్షేమాలు ఒకరు కనుక్కుని మనసు విప్పి మాట్లాడుకుంటే ఆ స్నేహంలో ఉన్న మాధుర్యమే వేరు.చిన్న చిన్న విషయాలే అయినా ఇవన్నీ ప్రశాంత జీవనానికి సోపానాలు.

No comments:

Post a Comment