జవ్వ గోధుమ రవ్వ - 1 కప్పు
అటుకులు - 1/2 కప్పు
పాలు - 1 1/2 కప్పు
నీళ్ళు - 3 కప్పులు
బెల్లం - 1 కప్పు
పంచదార - 1/2 కప్పు
నెయ్యి - 3 చెంచాలు
జీడిపప్పు - చిన్న ముక్కలు 2 చెంచాలు
ఎండు ద్రాక్ష - 8
యాలకుల పొడి - 1/4 చెంచా
ముందుగా పొయ్యి వెలిగించి బాణాలి పెట్టి వేడెక్కాక 1 1/2 చెంచా నెయ్యి వేసి జవ్వ గోధుమ రవ్వ వేసి మంచి వాసన వచ్చేవరకు దోరగా వేయించుకోవాలి.దాన్ని ఒక గిన్నెలో పోసి అదే బాణలిలో అటుకులు వేయించాలి.వీటిని కూడా ఒక చిన్న గిన్నెలో పోసి అదే బాణాలిలో బెల్లం,పంచదార వేసి కొంచెం నీళ్ళు పోసి కరిగాక వడపోసి ప్రక్కన పెట్టుకోవాలి.అదే బాణలిలో పాలు,మిగిలిన నీళ్ళు పోసి మరిగాక రవ్వ వేసి బాగా ఉడికించాలి.కొంచెం రవ్వ మెత్తగా ఉడికాక వేయించిన అటుకులు వేసి ఉడికాక నేతిలో వేయించుకున్న జీడిపప్పు,ఎండు ద్రాక్ష యాలకుల పొడి వేసి బాగా కలిపి పొయ్యి కట్టేసి దింపేయాలి.అంతే ఎంతో మధురమైన జవ్వ గోధుమ రవ్వ అటుకుల పాయసం తయారయినట్లే.
సూచన : ఈ పాయసం మరీ దగ్గరగా అయ్యేవరకు ఉంచితే గట్టిపడుతుంది కనుక కొంచెం దగ్గర పడుతున్నప్పుడే తీసేస్తే తినడానికి చాలా రుచిగా బాగుంటుంది.రవ్వ గట్టిగా అయిపోతుంది కనుకే మనం అటుకులు వేస్తే బిగుసుకోకుండా ఉంటుంది.నెయ్యి కానీ తీపి కానీ ఎక్కవ తినేవాళ్ళు మీకు అవసరమైనంత వేసుకోవచ్చు.
No comments:
Post a Comment