జీవితం అంటే అందరికీ వడ్డించిన విస్తరి కాదు.ప్రతి ఒక్కరికి చిన్నదో పెద్దదో ఏదో ఒక
బాధ ఉంటూనే ఉంటుంది.ఆలా అని పదే పదే ఒకే విషయం గురించి ఆలోచిస్తూ దాన్నే తలచుకుని
బాధపడుతూ అక్కడే ఆగిపోకూడదు. సాధ్యమైనంతవరకు గతాన్ని మరిచిపోయి వర్తమానంలో జీవిస్తూ
భవిష్యత్తు గురించి ఆలోచించాలి.అంతే తప్ప గడిచిపోయిన గతాన్ని పట్టుకుని వేళ్ళాడుతూ
వర్తమానాన్ని ప్రశాంతత లేకుండా చేసుకుని భవిష్యత్తు గురించి ఆలోచించకుండా స్థబ్దతతో
ఉండకూడదు. ఎన్ని బాధలున్నా చిరునవ్వు ముఖంపై నుండి చెరగనీయకుండా
ఆత్మస్థైర్యంతో,మనోనిబ్బరంతో గతాన్ని ఒక పాఠంగా తీసుకుని వర్తమానంలో ఆనందంగా
జీవిస్తూ భవిష్యత్తుకు బంగారుబాట వేసుకోవాలి.అప్పుడే జీవితం అమృతతుల్యంగా ఉంటుంది.
No comments:
Post a Comment