మన పనులను భక్తితో భగవంతుడ్ని, సద్గురువుని స్మరిస్తూ చేయడం వలన మనకు దైవానుగ్రహము, సద్గురుబలం తోడుగా ఉంటుంది.దేని గురించి అయినా ఎక్కువగా ఆలోచించి దిగులు పడటం మంచిది కాదు. మనము అనుకున్నవన్నీ జరగాలనే నియమం ఏమీ లేదు.కానీ దైవసంకల్పంతో మనకు జరిగేవన్నీ మన మంచికే జరుగుతాయాని అర్థం చేసుకోవాలి.మంచి అయినా, చెడు అయినా అన్నింటిని సానుకూల దృక్పధంతో చూడగలిగినప్పుడే అంతా మన మంచికే అనే భావంతో ముందడుగు వేసి విజయాన్ని సాధించగలుగుతాము.
No comments:
Post a Comment