Friday 12 February 2016

సహజ సిద్ధంగా.....

                                                                        ఈ రోజుల్లో ఇంటా బయటా కూడా స్వచ్చమైన గాలి పీల్చుకోలేని   పరిస్థితి.గాలిలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది.పెద్ద ఇల్లు ఉన్నా చాకిరీ చెయ్యలేని పరిస్థితి.దానికి తోడు భద్రత ఉంటుందని అపోహతో కానీ,స్థలాల విలువ పెరగటం వలన కానీ,మరేదైనా కారణంతో కానీ పల్లెటూర్లతో సహా ఎక్కడ చూసినా ఈ మధ్య అపార్టుమెంట్ల సంస్కృతి పెరిగిపోయింది.దాంతో ధారాళంగా ఇంట్లోకి గాలి,వెలుతురు వచ్చే ఇళ్ళ సంఖ్య దాదాపుగా తగ్గిపోయింది.పెద్ద చెట్లను నరికివేయడంతో గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గి కాలుష్యం ఎక్కువై శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఎక్కువైపోయాయి.పెద్ద పెద్ద చెట్లను ఎలాగూ తీసుకురాలేము కనుక ఇంట్లో ఎక్కడైనా నీడలో కూడా పెరుగుతూ గాలిని శుద్ది చేసే అందమైన మొక్కలను పెంచుకోవడం మేలు.కలబంద,పీస్ లిల్లీ,క్రిస్మస్ కాక్టస్,గెర్బెరా,డైసీ,అరేకా పామ్,బాంబూ పామ్,బోస్టన్ ఫెర్న్ లాంటి మొక్కలు ఇంటిలోని గదుల్లో పెంచుకుంటే సహజ సిద్ధంగా గాలిని శుద్ధి చేస్తాయి.మొక్కలు పచ్చగా కళకళలాడుతూ ఇంటికి అందాన్ని తెస్తాయి.ఈమొక్కలు ఇంటికి అందంతో పాటు  గాలిలోని విషపూరితాలను కూడా తొలగిస్తాయి.   

No comments:

Post a Comment