మాన్విత,మనస్విని అక్కచెల్లెళ్ళు.ఇద్దరూ మంచి స్నేహితురాళ్ళు.కాస్త సమయం దొరికితే చాలు ఎక్కడ లేని కబుర్లు.ఇద్దరూ చదువు పూర్తి చేసి కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టి కొంతమందికి ఉపాధి కల్పించాలని ఎడతెగని ఆలోచనలు చేస్తుంటారు.ఆ నేపధ్యంలో వివిధ రకాల వ్యాపారాల గురించి చర్చిస్తూ ఎక్కడికో వెళ్ళిపోతుంటారు.ఏదైనా ఒకటి మొదలు పెట్టే ముందు ఎదురయ్యే సమస్యలు,కష్టనష్టాల గురించి చర్చించుకోవటం ఎంతైనా అవసరం.వీళ్ళు దానితోపాటు సంస్థను లాభాల బాటలోకి నడిపించి ఆకాశంలో పందిరి వేస్తారన్నమాట.దీంతో ఎంత సమయం గడిచిందో కూడా తెలియదు.ఈలోపు వాళ్ళ అమ్మ వచ్చి మీకు ఏకాస్త సమయం దొరికినా నిచ్చెన అవసరం లేకుండా ఆకాశంలో పందిళ్ళు వేసేస్తుంటారు అనేసరికి ఆ చర్చా సారాంశం వాళ్ళ అమ్మకు కూడా చెప్పి ముగ్గురూ కాసేపు పగలబడి నవ్వుకుంటారు.అది కూడా ఒక నైపుణ్యమే.
No comments:
Post a Comment