యుగంధర్ విదేశీమోజుతో అమెరికాలో ఉన్న అమ్మాయిని పెళ్ళి చేసుకుని భారతదేశం నుండి అమెరికా వెళ్ళాడు.అతను ఇంట్లో ఖాళీగా ఉండటమే కనుక ఏమి చేయాలో తోచక దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళాడు.అక్కడ దైవదర్శనం అయిన తర్వాత ప్రసాదం పెట్టారు.ఆప్రసాదం అతనికి చాలా నచ్చి రోజూ గుడికి వెళ్ళడం మొదలుపెట్టాడు.అక్కడ ఒక పెద్దాయన ఒంటరిగా తనలో తనే మధనపడుతూ,ఏదో ఆలోచిస్తూఒక్కడే మౌనంగా కూర్చుని కనిపించాడు.ఒకరోజు దగ్గరకు వెళ్ళి తనను తాను అక్కడికి కొత్తగా వచ్చినట్లు పరిచయం చేసుకున్నాడు.నేను అమెరికా వచ్చిచాలా సంవత్సరాలు అయిందని నేను కూడా భారతీయుడినేనని చెప్పాడు.ఒకరోజు యుగంధర్ మాటల్లో మిమ్మల్ని ఒకమాట అడగవచ్చా?అని అడిగాడు.ఆయన సరేననగానే అడగవచ్చో?లేదో?తెలియదు కానీ మీలో మీరే బాధపడుతున్నట్లున్నారు.మీకు ఏమీ అభ్యంతరం లేదనుకుంటే చెప్పమన్నాడు.అప్పుడు ఆయన నువ్వు ఊహించినది నిజమే అని చెప్పడం మొదలుపెట్టాడు.తాను డాలర్ల మోజులో డబ్బు సంపాదనే లక్ష్యంగా పిల్లలకు అన్నీ సమకూర్చుతున్నానని అనుకున్నాడేకానీ పిల్లాడు ఏమి చేస్తున్నాడని పట్టించుకోకపోవటంతో ఉన్న ఒక్కగానొక్క కొడుకు ప్రయోజకుడు అవకుండా వ్యసనపరుడు అయినట్లు చెప్పాడు.మాదకద్రవ్యాలతో పాటు వాడికి అన్ని చెడ్డఅలవాట్లు ఉన్నాయని చెప్పాడు.అది తట్టుకోలేక మనశ్శాంతి కోసం గుడికి వస్తున్నట్లు చెప్పి వాడిని ఎందుకు కన్నానా?అని ఇప్పుడు బాధపడుతున్నట్లు చెప్పాడు.చేతులు కాలాక ఆకులు పట్టుకొన్నట్లు ప్రయోజనం ఏముందని?వాడిని కాస్తయినా మార్చమని భగవంతుని వేడుకుంటున్నాను అని చెప్పి మనసుని కొంత తేలిక పరుచుకున్నాడు.
No comments:
Post a Comment