వేసవిలో ఎండలో వెళ్ళటం వల్ల చెమటతోపాటు దుమ్ము,ధూళి కలిసి చర్మంపై మృత కణాలు పేరుకుపోయి ఉన్న వయసుకన్నాఎక్కువగా కనపడుతుంది.దీనికి చక్కటి పరిష్కారం టొమాటో గుజ్జు .బాగా పండిన టొమాటోలు తీసుకుని గోరు వెచ్చటి నీళ్ళల్లో వేస్తే పై పొర చక్కగా వస్తుంది.అప్పుడు గుజ్జు తీసి ఐస్ ట్రేలో పోసి ఫ్రీజర్ లో పెట్టాలి.ఎండలో నుండి రాగానే టొమాటో ఐస్ క్యూబ్ తీసుకుని మృదువుగా మర్దన చేస్తే చర్మంపై మురికి తొలగిపోయి చక్కటి రంగు వస్తుంది.అంతే కాకుండా ఎండ ప్రభావం చర్మంపై పడకుండా ఉంటుంది.ఇదే కాకుండా టొమాటో పంచదార,టొమాటో నిమ్మరసం కలిపి వేసవిలో ఉపయోగించటం వల్ల చర్మానికి తగిన రక్షణ లభిస్తుంది.
No comments:
Post a Comment