అందరికి నమస్తే.చాలా రోజుల తర్వాత తెలుగు వారి బ్లాగుకు స్వాగతం.ఈ కరోనా హంగామాతో అందరు ఇంటికే పరిమితమైనా కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండి ఉంటారని ఆశిస్తున్నాను.అందరూ ఎవరికి తోచినది వారు చేసే ఉండి ఉంటారు.కాకపోతే నేను ఉడతా భక్తిగా ఏమి చేశానంటే? ఇన్ని రోజులు నేను నాకు సాధ్యమైనంతలో ఇతరులకు సహాయం అందిస్తూ మేము,మీరు,మన అందరితోపాటు సర్వేజనా సుఖినోభవంతు,సమస్తా లోకా సుఖినోభవంతు అంటూ అందరూ బాగుండాలని సూర్యోదయానికి,సూర్యాస్తమయానికి ముందుగా దీపాలు వెలిగించి పూజలు,పారాయణాలు చేస్తూ భగవంతుని ప్రార్ధించడం దినచర్యలో భాగం అయిపోయింది.దీనితో ఎటువంటి ఒత్తిడి లేకుండా మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఉండేది.కళ్ళు మూసి తెరిచినట్లుగా నాలుగు నెలలు ఇట్టే గడిచిపోయాయి.అకస్మాత్తుగా రోజువారీ అన్ని కార్యక్రమాలు ఆగిపోయాయి.ఏ పని చేయాలని అనిపించేది కాదు.ఆ తర్వాత మనసుకు ఒక్కసారిగా స్తబ్దత ఆవరించినట్లు రోజంతా నిద్ర.అలసటతో శరీరమంతా బద్ధకం.ఒక పది రోజులు గడిచిపోయినాయి.ఎందుకు ఇలా ?దీని నుండి ఎలాగైనా బయటపడాలని బాబాకి నమస్కారం చేసుకుని చరవాణి చేతిలోకి తీసుకుని సానుకూల దృక్పధం అని నొక్కగానే సాయి సర్వస్వంలో బాబా సానుకూల దృక్పధం చైతన్య క్రియ చూచి ఆచరించడంతో ఆశ్చర్యంగా మనసుకు ఆవరించిన స్తబ్దత ఒక్కసారిగా దుమ్ము దులిపినట్లు తొలగిపోయింది.ఇది నిజంగా మరిచిపోలేని అద్భుతమైన అనుభవం.మనకు సహాయం చేసినవారికి ధన్యవాదములు తెలియచేయడం మన సంస్కారం.బాబాకు,సాయి సర్వస్వం వారికి ధన్యవాదములు.రోజూ మీ అందరితో ఎన్నెన్నో ఊసులు,కొత్తకొత్త కబుర్లు చెప్పాలని ప్రయత్నించడం బద్దకంతో అక్కడ నుండి వెళ్ళిపోవడం నిజంగా నాకే విచిత్రంగా ఉండేది.ఇక ముందు వీలయినప్పుడల్లా తప్పకుండా కబుర్లు చెప్పడానికి ప్రయత్నిస్తాను.మరి ఎప్పటిలా నా కబుర్లు ఆసక్తిగా చదువుతారు కదూ.
No comments:
Post a Comment