Tuesday, 5 May 2026

డబ్బు కాంక్ష - బంధాలు

                                                            బంధాలకు విలువ ఇచ్ఛేవాళ్ళు బహు కొద్దిమంది ఉంటున్నారు. ఎక్కవమంది డబ్బు కాంక్షతో  బ్రతుకుతున్నారు.ఆ కోవకు చెందినవాడే శ్రీకర.వయసు అరవై ఏళ్ళు.కష్టపడి సంపాదించుకుంటే ఎవరికీ సమస్య ఉండదు. అందరికీ సంతోషం. చిన్నప్పటి నుండి చదువుకోకుండా పెద్దవాళ్ళ కష్టం అర్థం చేసుకోకుండా సైకిలు కొంటె పాఠశాలకు వెళ్తానని, మోటారు సైకీలు కొంటేనే కళాశాలకు వెళ్తానని, కారు కొంటేనే బ్రతుకు అని మొండిగా ప్రవర్తించేవాడు. పెళ్లి చేస్తేనన్నా సరిగ్గా ఉంటాడని అనుకుంటే వఛ్చిన అమ్మాయి బాధ్యత తెలియనిది.పునుగులు, బజ్జీలు రోడ్లమీద కొనుక్కుని తినేది. రోజూ ఇద్దరూ చట్టాపట్టాలు వేసుకుని అమ్మానాన్న కారు కొనిస్తే ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళి సొల్లు కబుర్లు చెప్పి ఎక్కడో ఒకచోట తిని అర్ధరాత్రికి తిరిగి వఛ్చి ఇద్దరు బిడ్డలను కానీ వాళ్ళను కూడా బాధ్యత తెలియకుండా చదువు సరిగా అబ్బకుండా పెంచారు. బంధాలకు విలువలు తెలియదు.భార్య ముంగి లాగా చూస్తూ కూర్చుంటుంది.దొందు దొందే. పక్కవాళ్ళ ఆస్థి మేద్దామనే ఇద్దరి ఆలోచన.భర్త నోరు వేసుకుని గట్టిగట్టిగ అరిచి ఏదో సాధించానని భ్రమలో ఉంటాడు. సంపాదించుకోవడం చేతకాక మేనమామ ఆస్థి కొట్టేశాడు. అది చాలదని అక్కకు పసుపుకుంకుమల క్రింద ఇఛ్చిన ఆస్థిలో కొట్టేసి పొలాల కొలతల్లో మోసం చేసి నాకు పోరంబోకు కలిసిందని అబద్దం ఆడడమేకాక మీ ఆస్థి నాకు అక్కరలేదనిఅది నాదే అని పోట్లాడడం మొదలెట్టాడు. నగరం నడిమధ్యలో పోరంబోకు లేదన్నది జగము ఎరిగిన సత్యం.తాత్కాలికముగా బాగుపడినా అక్రమాస్థులు ఎన్నాళ్ళో నిలవవు ఆన్నది అందరికీ తెలిసినదే. ఆందరికీ పంచాయితీ చెప్పేవాడు తనవరకు వచ్ఛేసరికి బంధాలకన్నా డబ్బు కాంక్ష ఎక్కువై కళ్ళు మూసుకుపోయాయి.మేనమామ అర్హత లేకపోయినా సింహాసనం మీద కూర్చోబెట్టాడు.అక్క, బావ పని చేయకపోయినా దర్జాగా ఉండడానికి ఎంతో చేశారు. బంధాల విలువలు తెలుసు కనుక కుటుంగా గౌరవం రోడ్డుకీడ్చడం ఎందుకు అని మేనమామ, అక్క వదిలేయడంతో బ్రతుకుతున్నాననే విషయాన్నీ విస్మరించి నా నోటి ధాటికి తట్టుకోలేక ఏమీ అనలేదని విర్రవీగుతున్నాడు.ఇంట్లో ఇంట్లోనే మోసం చేసి బ్రతికే బ్రతుకు ఒక బ్రతుకేనా? అనుకుంటే అన్నం కూడా తినలేడు. బంధాల కన్నా డబ్బు కాంక్ష ఎక్కువై పోయింది. ఎవరూ ఈ భూమి మీద శాశ్వతం కాదు మోసగాడిగా ముద్ర వేసుకుని గొప్పగా బ్రతికి కుళ్ళికుళ్ళి చచ్ఛేకన్నా నిజాయితీగా  సామాన్య జీవితం గడిపినా ప్రశాంతంగా చనిపోతారు.ఇదంతా సోది నాకు డబ్బే ముఖ్యం అంటాడు వెధవ.వెధవ అంటే వెయ్యేళ్ళు ధనవంతుడువై వర్ధిల్లు అని తోడబుట్టినది కదా చెడుచేసిన మంచే కోరుకుంటుంది.

No comments:

Post a Comment