Saturday, 19 March 2016

ఎండల్లో హాయిగా........

                                                                          మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి.పెద్ద,చిన్న అనే తేడా లేకుండా వడదెబ్బ తగలకుండా అందరూ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఎండల్లో కూడా హాయిగా ఉండొచ్చు.లేత రంగుల్లో తేలికగా ఉండే నూలు దుస్తులు ధరించాలి.ఇంట్లో ఉన్నా,బయటకు వెళ్ళినా మధ్యమధ్యలో చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి లేదా రుమాలు తడిపి ముఖం తుడుచుకోవాలి.ఎండలో నుండి వచ్చిన తర్వాత చన్నీటితో ముఖం కడిగి రెండు స్పూనుల బొప్పాయి గుజ్జుకి ఒక స్పూను తేనె కలిపి రాసుకుంటే చర్మంపై ఎండ ప్రభావం పడకుండా ఉంటుంది. అల్పాహారం ఎట్టిపరిస్థితుల్లో అశ్రద్ధ చెయ్యకుండా తినాలి. మంచి నీళ్ళు ఎక్కువగా తాగాలి. పుచ్చకాయ,కీరా,ఖర్భూజ,నిమ్మరసం,కొబ్బరి నీళ్ళు,పండ్ల రసాలు,మజ్జిగ,బార్లీ వంటివి ఎక్కువగా తీసుకోవాలి.సబ్జా గింజలు నీళ్ళల్లో నానబెట్టి ఆ నీటిని తాగుతూ ఉండాలి.వేపుళ్ళు తగ్గించాలి.పండ్లు ఎక్కువగా తినాలి.పై జాగ్రత్తలు పాటిస్తే ఎండల్లో కూడా ఎంతో హాయిగా,ఆరోగ్యంగా  ఉండొచ్చు. 

No comments:

Post a Comment