Tuesday, 22 March 2016

ఎంచక్కా......

                                                         పనిమనిషి గిన్నెలు కడిగినంతసేపు,బట్టలు ఉతికినంతసేపు పంపు కట్టేయకుండా నీళ్ళు వదిలేస్తుంటే ప్రాణం పోతునట్లు అనిపిస్తుంటుంది.పంపు కట్టేసి అవసరమైనప్పుడు నీళ్ళు వదులుకోమని చెప్తే ఇదిగో ఇప్పుడే  పంపు వదిలానమ్మా!అంటుంది.అటు వెళ్ళగానే యధా రాజా తధా ప్రజా! అన్నట్లు మామూలే.చెప్పీ చెప్పీ కంఠ శోష తప్ప ఉపయోగం ఉండదు.నీటి ఎద్దడి.ప్రజల అవసరాలు,ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అసలు నీళ్ళతో పని లేకుండా బట్టలు ఉతుక్కోవటానికి వాషింగ్ మెషీన్,ఒక గ్లాసు నీళ్ళతో నెల రోజులు గిన్నెలు కడుక్కోవటానికి డిష్ వాషర్  సరికొత్త పరిజ్ఞానంతో తయారు చేస్తున్నారని త్వరలో మార్కెట్లోకి రాబోతున్నాయని తెలిసి చాలా సంతోషంగా అనిపించింది.ఎందుకంటే ఎంచక్కా పనివాళ్ళతో కంఠ శోష లేకుండా వాళ్ళు,మనం వృధా చేసే నీరు మరి కొంతమంది తాగునీటికి,ఇతర అవసరాలకు ఉపయోగపడతాయి కదా! 

No comments:

Post a Comment