ప్రవస్వి రెండోసారి గర్భవతి.అమ్మాయి పుట్టాలని భార్యాభర్తల కోరిక.అమ్మాయే పుడుతుందని జ్యోతిష్కులు,వైద్యులు కూడా చెప్పారు.ఎప్పుడెప్పుడు అమ్మాయి భూమి మీదకు వచ్చి తన ఒడిలో సేద తీరుతుందా!అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ తనకెంతో ఇష్టమైన అమ్మవారి పాటలు వింటూ వీలయినప్పుడల్లా లలితా పారాయణం చదువుకుంటుంది.లోపల బిడ్డ కూడా ఆ పాటలకు అనుగుణంగా స్పందిస్తూ,తను కూడా పారాయణం వింటున్నదన్నదానికి చిహ్నంగా పొట్ట లోపల చకచకా కదులుతూ సంతోషంగా కాళ్ళతో తన్నడం ఒకటి రెండుసార్లు గమనించింది.వేరే ఏమైనా సంగీతం పెట్టినప్పటికన్నాభక్తి గీతాలు పెట్టినప్పుడు ఎక్కువ చురుకుగా తిరుగుతూ సుతిమెత్తటి పాదాలతో తన్నుతూ గిలిగింతలు పెడుతుందని మురిపెంగా అమ్మతనంలోని కమ్మదనాన్నిఆస్వాదిస్తూ త్వరలో పుట్టబోయే కూతురికి స్వాగతం పలుకుతుంది.
No comments:
Post a Comment