మా చిన్నప్పుడు మేము అలహాబాద్ లో ఉండేవాళ్ళము .అప్పుడు నాకు రెండున్నర సంవత్సరములు.మా ప్రక్కన వున్న ఇంటిలో ఒక పెద్ద కుక్క వుండేది .ఒక రోజు నేను దానికి బ్రెడ్ పెడదామని వెళ్ళాను . కొంచం పెడితే తినేసింది .ఇంకా కొంచెం వేసాను.అది దానికి అందలేదు .దానికి అందేలా వేద్దామని ముందుకు వెళ్ళాను.నేను మరల తిసేసుకోవటానికి వచ్చానని అపోహతో నన్ను కరిచింది. అప్పుడు బాగా రక్తం వచ్చింది .బాగా ఏడుస్తుంటే ఇంట్లో వాళ్ళు వచ్చి చూచి డాక్టర్ దగ్గరకితీసుకునివెళ్ళి ఇంజక్షన్ చేయించారు.ఇంకెప్పుడు అలా చేయొద్దు అని మందలించారు. దాని పన్నుగుర్తు ఇప్పటికీ వుంది.
No comments:
Post a Comment