సుష్మిత వాళ్ళింట్లో రెండు పమేరియన్ కుక్కపిల్లలు ఉండేవి.వాటిని పింకీ,సోనీ అని పిలిచేవాళ్ళు.అవంటే వాళ్ళింట్లో అందరికీ చాలాఇష్టం.ముద్దుగా ఉండేవి.మొదట సుష్మిత తమ్ముడు శ్రీకర్ పింకీని తీసుకొచ్చాడు.కొన్నిరోజులకు పింకీకి సోనీ పుట్టింది.సోనీ పుట్టినప్పుడు సుష్మిత ఉదయం,సాయంత్రం పనివాళ్ళు ఉన్నాసరే తనే స్వయంగా తుడిచి తెల్లటి వస్త్రంపై పడుకోపెట్టేది.అలాకళ్ళుతెరిచేవరకు చేసేది.వాక్సిన్ వేయించటానికి శ్రీకర్ బుల్లి ప్లాస్టిక్ బుట్టలో పెట్టుకుని వెళ్ళేవాడు.పింకీ అయితే ఎగిరి జంట మంచం పైకి ఎక్కి సుష్మిత వాళ్ళ ప్రక్కన నిద్రపోయేది.సోనీ,పింకీ చుట్టుప్రక్కల వాళ్ళను గేటుదాటి లోపలకు రానిచ్చేవికాదు.కనీసం రోడ్డుమీద కూడా ఎవరినీ నడవనిచ్చేవి కాదు.బాగా అరుస్తుంటే అందరూ భయపడేవాళ్ళు.చాలా ప్రేమగా ఉండేవి.సుష్మితకు పాప పుడితే సోనీ ఎవరినీ దగ్గరకు రానీయకుండా బెడ్ దగ్గరే పడుకోనేది.ఒకసారి ప్రక్కింటావిడ పాపను చూడటానికి వచ్చింది.పాపను చూద్దామని ముందుకు వంగింది.అంతే సోనీ ఒక్కసారి ఆవిడ మీదపడింది.ఆవిడ చాలా భయపడింది.అప్పటినుండి పాపను ఎత్తుకోవటానికి కూడా ఎవరూ సాహసించేవారు కాదు.పాప కొంచెం పెద్దగా అయిన తర్వాత తన ప్రక్కన అటు పింకీ ఇటు సోని పడుకునేవి.ఎక్కడకు వెళ్తే అక్కడకు పాప వెంటే వెళ్ళేవి.పాప కూడా పింకీ,సోనీ అంటూ వాటితో చక్కగా ఆడుకొనేది.ఇంతకీ పాప పేరు స్వీటీ అని చెప్పలేదు కదూ!స్వీటీ అని సుష్మిత పిలవగానే స్వీటీతోపాటు ఒకవైపు పింకీ మరోవైపు సోనీ ప్రేమగా,బాధ్యతాయుతంగా పాపకు రక్షణగా వస్తుంటే చూడ ముచ్చటగా ఉండేది.
No comments:
Post a Comment