పద్మిని చదువుకున్నది కానీ ఇంగ్లిషు బాగా మాట్లాడగలిగితే బాగుంటుందని నేర్చుకోవటానికి వెళ్దామని పక్కింటి ఆమెతో అంటే మాఅమ్మాయికి కూడా సెలవలు అందుకని మాఅమ్మాయిని కూడా తీసుకెళ్ళండి.ఇప్పుడు నాదగ్గర డబ్బులు లేవు.ఊరునుండి రాగానే ఇస్తాను అంటే నిజమే అనుకొని తనతో తీసుకెళ్ళి డబ్బులు కట్టింది.తర్వాత రోజు పక్కింటి వాళ్ళ అమ్మాయి నేను రానని భోరుభోరున ఏడవటం మొదలు పెట్టింది.చిన్నపిల్ల కూడా కాదు ఇంటరు చదువుతుంది.పిల్ల రాకపోతే మీరు ఏమి చేస్తారు? వదిలేయండి అని వాళ్ళఅమ్మచెప్పింది.మరి డబ్బులు సంగతి ఏమిటి?అంటే చెప్పే ఆమెకి పిల్ల రానంటుంది అని డబ్బులు తీసుకోండి అని తేలిగ్గా చెప్పింది.డబ్బులు ముందే తీసుకున్నామెకు డబ్బులు తిరిగి ఇవ్వటం ఇష్టం లేక పద్మినికి,వాళ్ళ స్నేహితురాలికి మీకు అది నేర్పిస్తాను ఇది నేర్పిస్తాను అని కథలు చెప్పింది.ఆవిడ నేర్పలేదు.ఈవిడ డబ్బులు ఇవ్వలేదు. వీళ్ళిద్దరూ నష్టపోయారు.తన్ను మాలిన ధర్మం చేయగూడదని డబ్బు దగ్గర మొహమాటం పనికిరాదని స్నేహితురాళ్ళకు అర్ధమయింది.వాళ్ళిద్దరూ నంగనాచి తుంగబుర్రల్లాగా కూర్చున్నారు.
నంగనాచి- తుంగబుర్ర అన్న మాట నంగినాతి-తుంగ భద్రం అన్న మాటనుండి వచ్చింది. నంగినాతి చేసినదంతా చేసి అంటే అతివినయం ప్రదర్శిస్తూ అమాయకంగా తనకేమీ తెలియదన్నట్లు నంగిగా మాట్లాడే స్త్రీ. తుంగ భద్రం అంటే మదపుటేనుగు. నంగినాతి-తుంగ భద్రం అంటే కనుపిస్తున్నట్లుగా అమాయకురాలు కాదనీ, ఆమె మదపుటేనుగులాంటి స్థిరమైన, ధృఢమైన మనస్తత్వం కలదని అర్ధం. నంగినాతి-తుంగ భద్రం అన్న పదం కాలక్రమేణా వాడుకలో నంగనాచి- తుంగబుర్ర గా మారింది.
ReplyDeleteకొత్త విషయం తెలిపినందుకు ధన్యవాదములు.
ReplyDelete