Saturday, 21 December 2013

వెయ్యేళ్ళు ధనవంతుడవై వర్ధిల్లు

అనిరుద్ తాతగారికి కాస్త చాదస్తం.పిల్లలు అల్లరి చేస్తుంటే వెధవల్లారా,బడవల్లారా అని అనేవారు.అలా అనటం
పిల్లలకు నచ్చేది కాదు. మీతాతగారు ఎప్పుడు చూసినా అలా అంటారేమిటి ?అని అనిరుద్ ని సతాయించేవారు.
అనిరుద్ వాళ్ళ తాతగారి దగ్గరకు వెళ్లి మాస్నేహితులకు,నాకు మీరు అలా అనటం ఇష్టం లేదు అని చెప్పాడు.
అప్పుడు వాళ్ళ తాతగారు తన అలవాటు కప్పిపుచ్చుకుంటూ నేను మిమ్మల్ని దీవిస్తున్నాను అనిచెప్పారు.
ఎలా అంటే వెధవ అంటే వెయ్యేళ్ళు ధనవంతుడవై వర్ధిల్లు అని అర్ధం.బడవ అంటే బాగా డబ్బున్నవాడివై వర్ధిల్లు
అని అర్ధం అన్నారు.సరేలే తాతగారూ  అలాగే మమ్మల్ని దీవించండి అని అనిరుద్ ఆటలకు వెళ్ళిపోయాడు.
హమ్మయ్య పిల్లల బెడద వదిలింది అని తాతగారు సంతోషించారు.

No comments:

Post a Comment