Saturday, 28 December 2013

100%=50%

                                                               మాధవీలత డిజైనరు డ్రెస్సులుకుట్టటం నేర్చుకుందామని ఒక ప్రకటన చూచివెళ్ళింది.మాదగ్గరనేర్చుకుంటే 100%  గారంటీగా మీకు వస్తుంది.అందరిదీవేరు మాదివేరు అని డబ్బులు ముందే కట్టాలి అంటే అప్పతెచ్చిమరీ నేర్చుకుందామనే ఆశతో డబ్బు కట్టింది.కొన్నిరోజులు వచ్చిరావటానికి వీలుకాకపోతే ఆరునెలల తర్వాత వచ్చినా మీకు వచ్చేవరకూ నేర్పుతాము అని చెప్పింది.నిజమేనని నమ్మింది.అత్యవసర పరిస్థితుల్లో మానేయాల్సివచ్చి కొన్ని రోజులు మానేసింది.మూడు నెలల తర్వాత వెళ్ళింది.వెళ్ళిన తర్వాతనుండి మీరు ఇక వెళ్లిపోవాలి సంవత్సరాల తరబడి చెప్పాలా?అని మాట్లాడటం మొదలెట్టింది.అందరిలాగా ఇన్ని రోజులకు ఇంతఫీజు మీరు నేర్చుకున్నంత  అంటే మొదటే ఏ సమస్యా ఉండదు.ఇష్టమయిన వాళ్ళే చేరతారు.100 % గారంటీ అని చెప్పుకోవటం ఎందుకు? వయస్సుతో నిమిత్తం లేదు ఏ వయస్సు వారికయినా నేర్పుతాము అని ప్రకటనలు ఇస్తుంటారు.చిన్న వయస్సు వాళ్లకు ఒకరకంగా,పెద్ద వయస్సు వాళ్ళకయితే భాద్యతలు ఉంటాయి కనుక ఒక రకంగా శిక్షణ ఇవ్వాలి.కొంచెం తెలివి ఉన్నవాళ్ళకు 70% మాత్రమే,మధ్యరకం వాళ్ళయితే 50% అదీ లేనివాల్లకయితే 30% మాత్రమే నేర్చుకోగలరు.దీన్ని బట్టి ఏమి అర్థమవుతుందంటే 100%=50%.ఎంతటి మొద్దులకు అయినా నేర్పగలిగిన వాళ్ళే సరయిన గురువులు.తెలివిగల వాళ్ళకు నేర్పటంలో వింత ఏమున్నది?పెద్ద వాళ్ళని చూడకుండా వాళ్ళకు రాదు వాళ్ళది  మట్టి బుర్ర అనటం మొదలెట్టింది.దయచేసి అప్పులు చేసి మరీ మోసపోకండి.ఏదో నేర్చుకుందామని ఆమె చెప్పిన తియ్యటి మాటలు నమ్మి నిజమేననుకొని నలుగురిని తీసుకెళ్ళి మరీచేర్చింది.ఈమె నష్టపోయిందికాక నలుగురు నానా మాటలు మాట్లాడుతుంటే ఆమె వలన మాధవీ లత  తల దించుకోవాల్సి  వచ్చింది.పక్కవాళ్ళను కూడా ఉద్దరిద్దామనే ఆలోచనలో ఒక్కొక్కసారి మనం మాట  పడవలసి వస్తుంది.అందుకే ఎవరి పని వారు చేసుకోవడం ఉత్తమం.     

No comments:

Post a Comment