Monday, 2 December 2013

సంజీవని

           స్మిత ఇంటిముందు ఒకపెద్దవేపచెట్టు ఉండేది.చెట్టుమీద చాలాపక్షులు నివసించేవి.వాటిలోజెముడుకాకి
ఒకటి.జెముడుకాకి కాకికన్నాచాలాపెద్దది.చూడటానికి అందంగా ఉంటుంది.బ్రౌన్,నెమలిపింఛం రంగుల ఈకలు
కలిసివుంటాయి.దాని అరుపు విచిత్రంగా ఉంటుంది.స్మిత చిన్నప్పుడు పక్షులను గమనిస్తూఉండేది.స్మితకూడా
దానిలాగే అరవటం ప్రాక్టీస్ చేసింది.అదిఎలాగంటే నోరుతెరవకుండా గొంతుతో మాత్రమే ఆసౌండ్ చేసేది.స్మిత
ఆసౌండ్ చేస్తుంటే జెముడుకాకి కూడాఅరిచేది.పిల్లలుఎంతమంది ట్రై చేసినాఎవరికీరాలేదు.రొజూపిల్లలుఅందరూ
ఆడుకోవటానికి వచ్చినప్పుడు స్మిత అరుస్తుంటే జెముడుకాకి కూడా అరుస్తూ ఉండేది.
           జెముడుకాకి గూడు పెట్టినప్పుడు రకరకాల పుల్లలతో పాటు" సంజీవని"పుల్ల కూడా ఉంటుందట.
సంజీవని అంటే చనిపోయినవాళ్ళను బ్రతికించేది అని అర్ధం.ఈసంజీవనిని సాధించాలంటే జెముడుకాకి
గూడు తీసికెళ్ళి ప్రవాహంలో వేస్తే అన్నికోట్టుకుపోగా సంజీవని మాత్రం పాములాగా పడగవిప్పి గూడు
వేసినవాళ్ళమీదకు వస్తుందట.అప్పుడు డేర్ గా పట్టుకోగలిగితే సంజీవని దక్కుతుందని,లేకపోతేపాముకాటు
వేస్తే ప్రాణాలు పోతాయని పెద్దవాళ్ళు చెప్పేవారు.

No comments:

Post a Comment