హుందాతనం అనేది పుట్టుకతోనే రావాలి కానీ మధ్యలో నేర్చుకునేది కాదు.ఎందుకంటే అది మధ్యలోఎక్కడో ఒక్కళ్ళకి తప్ప అలవడేది కాదు.శాలిని ఇంటి ప్రక్కన ఒక పెద్దాయన ఉన్నాడు.చిన్నా చితకా వయసు కాదు.పైగా ఆయనకు డెభై ఏళ్ళు.ఆయన సరదాగా మాట్లాడుతాను అనుకుంటాడో ఏమో? కానీ శాలినికి అయితే వెకిలిగా మాట్లాడుతున్నాడని అనిపించి చికాకు వస్తుంది.ఒకరోజు శాలిని తన భర్తతో మాట్లాడుతుంటే ఎవరితో మాట్లాడుతుందో?అన్నట్లు దొంగ చూపులు చూస్తున్నాడు.వయసుకు తగినట్లుగా చక్కగా హుందాతనంతో ప్రవర్తిస్తే ఎంత బాగుంటుందో?అని శాలిని అనుకుంది.పెద్దాయన ఒకరోజు పిలిచి మరీ ఏమండీ మామీద అలిగారా ఏమిటి?మాట్లాడటంలేదు అన్నాడు.మీ మీద అలగాల్సిన అవసరం మాకేమిటండీ?అని శాలిని దీర్ఘం తీసింది.శాలిని వాళ్ళ అమ్మ అయితే బాబాయిగారు మాకు మీమీద అలగాల్సిన అంత అవసరం ఏముంటుంది?అనిఅనకపోయావా!అన్నారు.అవునమ్మా!మొదటే బాబాయి గారు,పిన్ని గారు అని పిలవాల్సింది తప్పు చేశాను అని శాలిని చెప్పింది.
No comments:
Post a Comment