ఒకే చెట్టుకు విరబూసిన పుష్పాల్లా ఒకే కడుపున పుట్టిన సోదరి,సోదరుల ఆత్మీయానురాగాలకు గుర్తుగా నిలిచే పండుగే ఈ శ్రావణ పౌర్ణమి నాడు చేసుకునే రాఖీ పండుగ.ప్రతి సోదరి తన సోదరుడి కుడిచేతికి కట్టే రక్ష అతడికి సకల శుభాల్ని, సర్వ సౌఖ్యాల్ని కలిగిస్తుందని మన నమ్మకం.సహోదరుల ప్రేమాస్పద భావనల మిళితమే రక్షాబంధనం.మనకు రాఖీ పండుగ మాత్రమే తెలుసు కానీ సంతోషీ మాత జన్మదినం,హయగ్రీవ జయంతి,సంస్కృత భాష దినోత్సవం కూడా శ్రావణ పౌర్ణమి రోజే.పలు విశేషాల సమాహారం శ్రావణ పొర్ణమి.నా బ్లాగ్ వీక్షకులు,తోటి బ్లాగర్లు వారి సోదర సోదరీమణులతో ప్రపంచంలో ఎక్కడ ఉన్నాఈ పండుగను సరదా సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు.
Wednesday, 17 August 2016
Tuesday, 16 August 2016
కోపమొస్తుంది
సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క వద్ద దీపం పెట్టడం,నీళ్ళు పొయ్యడం,సూర్యాస్తమయ సమయంలో నిద్రపోవడం,తల దువ్వడం,ఇల్లు ఊడవడం వంటి పనులు చేస్తే లక్ష్మీదేవికి కోపమొస్తుంది.ఈ పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది.అందుకే మనం సాధ్యమైనంతవరకు ఈపనులు చేయకుండా భక్తితో లక్ష్మీ దేవిని పూజిస్తే ఇంటిలో లక్ష్మీదేవి ఉండి ఇల్లు కళకళలాడుతుంది.
Friday, 12 August 2016
కృష్ణవేణి పుష్కర సందడి
పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాల సందడే సందడి.ఎక్కడెక్కడి నుండో సుదూర ప్రాంతాల నుండి పుష్కర స్నానానికి వచ్చే బంధువులతో కళకళలాడే లోగిళ్ళు,ప్రతి ఒక్క ఇంట్లో ఎవరి వీలునుబట్టి వాళ్ళు తరతరాల పెద్దలకు పిండ ప్రధానం చేసి ఆ సందర్భంగా ఏదేశంలో ఉన్నా ఆడపడుచులను ఆహ్వానించి దగ్గర బంధువులకు కూడా విందు ఏర్పాటు చేస్తున్నారు.మగపిల్లలు ఆడపడుచులకు బట్టలు పెట్టే సంప్రదాయం ఉండటంతో తన ఆడపడుచు,తండ్రి ఆడపడుచు,బ్రతికి ఉంటే తాత ఆడపడుచులను కూడా పిలిచి బట్టలు పెట్టటంతో షాపులు దగ్గర సందడి.దీనితో రోడ్లు రద్దీతో రోడ్లన్నీ కళకళ.కృష్ణవేణీ నదిలో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయని,స్వయంగా గంగా మాత హంస రూపంలో వచ్చి స్నానమాచరిస్తుంది అని అంటారు కనుకపరమం,పవిత్రం,పావనం అని వీలైనంత వరకు వచ్చిన వాళ్ళందరు పుష్కర స్నానానికి వెళ్ళడంతో నదీతీరంలో ఉన్న గ్రామాల్లో ఒకటే సందడి.స్నానానంతరం దైవదర్శనం ఉత్తమం కనుక గ్రామాల్లో ఉన్న ఆలయాల శోభ ఇంతని వర్ణింపలేనిది.ఇకపోతే కృష్ణాగోదావరి సంగమం వద్ద ఇచ్చే హారతి అత్యద్భుతం,సుమనోహరం.చూడటానికి రెండు కళ్ళు,వర్ణించడానికి ఒక నోరు సరిపోదన్నమాట అతిశయోక్తి కాదు.మొత్తం మీద ఈ పన్నెండు రోజులు సందడే సందడి.అంతర్జాలం పుణ్యమా అని ప్రపంచంలో ఎక్కడున్నా వీక్షించే సదుపాయం ఉండటంతో మన తెలుగు వారందరూ కృష్ణాగోదావరి పుష్కర హారతి పరమాద్భుతమని చూచి తరిస్తున్నారు.
Wednesday, 10 August 2016
అంచు ఉన్న వస్త్రం
శుభకార్యాలలో ఎవరికైనా కొత్త వస్త్రాలు పెట్టేటప్పుడు అంచు ఉన్న వస్త్రాలు మాత్రమే పెట్టాలి.ఈ విధంగా చేస్తే పెట్టేవాళ్ళు,పెట్టించుకునేవాళ్ళు కూడా పది కాలాలపాటు చల్లగా ఉంటారు.మాములుగా అయినా అంచు ఉన్న వస్త్రాలు మాత్రమే కట్టాలి.అంచు లేని చీరలు కానీ,పంచలు కానీ కట్టుకోవడం మంచిది కాదు.విడిచిన వస్త్రం అయినా కాలితో తన్నడం కానీ,తియ్యడం కానీ చేయకూడదు.ఎందుకంటే వస్త్రంలో దేవతలు ఉంటారని కనుక కాళ్ళతో తన్నకూడదు అని జేజమ్మ చెప్పటం వల్ల ఈ రోజే తెలిసింది.అందుకే మీకు తెలియచెప్పడం జరిగింది.
Tuesday, 9 August 2016
చూపు కోల్పోయే ప్రమాదం
విద్యుత్తు బిల్లు తక్కువ వస్తుందని మనందరం ఈమధ్య ఎల్ ఇ డి బల్బులు ఎక్కువగా వాడుతున్నాము కదా!తెల్లగా ఉండే ఈ కాంతిని ఎక్కువగా చూడడం వల్ల కంటిలో ఉన్న రెటీనా దెబ్బతిని చూపు కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉందని కంటి వైద్యులు హెచ్చరిస్తున్నారు.శరీరంలో నయనం ప్రధానం అన్నారు పెద్దలు.ఈ బల్బులు ఎక్కువగా వాడి కంటి చూపు కోల్పోయే కన్నా విద్యుత్తు పొదుపుగా వాడుకుని బిల్లు కొంచెం తక్కువ వచ్చేలా ప్రయత్నం చేయడం మేలు.
Saturday, 6 August 2016
స్నేహమంటే ఇదేనోయ్
అమ్మ తర్వాత కమ్మనైన పదం స్నేహం.భగవంతుడు అందరికీ తల్లిదండ్రుల్ని,తోడబుట్టిన వాళ్ళను ఇస్తాడు.కానీ స్నేహితులను ఎంపిక చేసుకునేది మాత్రం మనమే.ఎంత మంది స్నేహితులున్నా అందరి అలవాట్లు,అభిరుచులు ఒకేలా ఉండవు.ఎలా ఉన్నా యధాతధంగా స్వీకరించేదే స్నేహం.స్నేహమంటే మధురమైనది.అసలైన స్నేహంలో ఉన్న కమ్మదనం వర్ణింలేనిది. తల్లిదండ్రులతో,స్వంతవారితో కూడా చెప్పుకోలేని విషయాలను తనతో పంచుకోగలిగినప్పుడు కలిగే నిశ్చింత,ప్రశాంతత నిజమైన స్నేహానికి చిహ్నం.అవి మూడో వ్యక్తికి చేరవేయని వారే నిజమైన స్నేహితులు.అటువంటి స్వచ్చమైన మనసుతోపాటు ఒకరు అంటే ఒకరికి నమ్మకం ఉండాలి. అవసరానికి,సరదాగా వచ్చే వంద మంది స్నేహితులు కంటే కష్టం వచ్చినప్పుడు నీకు నేనున్నాను అనే ధైర్యాన్నిచ్చే వాళ్ళు అసలైన స్నేహితులు.ఈరోజుల్లో అంత మంచి ప్రాణ స్నేహితులు దొరకడం కష్టమే అయినా అటువంటి స్నేహితులు ఒక్కరు,ఇద్దరు ఉన్నా వాళ్ళు ధన్యులు.స్నేహానికి విలువ ఇస్తేనే అది కలకాలం నిలుస్తుంది.స్నేహమంటే ఇదేనోయ్ అంటూ స్నేహితుల దినోత్సవం సందర్భంగా స్నేహం విలువ తెలిసిన అందరికీ నిండు మనసుతో శుభాకాంక్షలు.
Tuesday, 2 August 2016
గుండెకు వ్యాయామం
రోజు 10 నుండి 20 సార్లు మెట్లెక్కి దిగితే గుండెకు మంచి వ్యాయామం అని మనందరికీ తెలుసు.మనందరికీ తెలియని ఇంకొక ఆద్భుతమైన వ్యాయామం చేయటం వల్ల గుండెకు ప్రయోజనంతో పాటు తొడలు,పిరుదులలో ఉండే కొవ్వు కూడా తగ్గిపోతుంది.అదెలాగంటే మనం పరుగెత్తటానికి ముందు ఒక కాలుని ముందుకు పెట్టి ఇంకొక కాలుని వెనక్కు పెట్టినట్లుగా ఎంత సమయం ఉండగలిగితే అంత సమయం ఉండాలి.ఇలా చేయగలిగినన్నిసార్లు కాలు మార్చి కాలు చేస్తుంటే అదనపు కొవ్వు కరిగి ఆరోగ్యంగా ఉంటాము.
Subscribe to:
Posts (Atom)
