పునాది రాయి వేస్తేనే కదా!ఇల్లు కట్టగలిగేది.అలాగే ఏ పని చేయడానికైనా స్వంత ప్రయత్నం చేస్తేనే దేన్నైనా సాధించగలరు.అసలు ప్రయత్నమే చేయనప్పుడు ఎంత గొప్పవాడైనా,ఎన్ని తెలివితేటలు,ఎంత గొప్ప ఆలోచనలున్నా ఏమీ సాధించలేరు.ప్రయత్నానికి ఉన్న శక్తి చాలా గొప్పది.అమ్మో!ఈ పని మన వల్ల అవుతుందో లేదో? మనం చేయగలమో లేదో? అని ప్రతికూల ధృక్పదంతో ఆలోచిస్తూ కూర్చుంటే ఏ పనీ చేయలేరు.ఏదీ అనుకున్నది సాధించలేరు.కనుక ధర్మబద్దమైన ఆలోచనలతో,సానుకూల దృక్పధంతో,పట్టుదలతో ప్రయత్నించి ఏ చిన్న పని తలపెట్టినా స్వల్ప ప్రయత్నంతో అది విజయవంతమై తాము కన్న కలల్ని సాకారం చేసుకుని అనుకున్నది సాధించగలరు.
Monday, 9 July 2018
చిన్న సగ్గుబియ్యం పకోడి/బొండా
సగ్గుబియ్యం అనగానే సహజంగా సగ్గుబియ్యం పాయసం చటుక్కున గుర్తొస్తుంది.కానీ సగ్గుబియ్యంతో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు.ప్రస్తుతం పకోడీ లేదా బొండా ఎలా తయారు చేసుకోవచ్చో,అందుకు ఏ పదార్ధాలు కావాలో చూద్దాము.
చిన్న సగ్గుబియ్యం - 1/2 కప్పు
చిక్కటి పెరుగు - 1/2 కప్పు
బొంబాయి రవ్వ - 1/2 కప్పు
బియ్యప్పిండి - 1/2 కప్పు పైన
ఉల్లిపాయలు - 2 పెద్దవి
అల్లం తురుము - 2 చెంచాలు
పచ్చిమిర్చి తురుము - 4 చెంచాలు
ఉప్పు - సరిపడా
నూనె - వేయించడానికి సరిపడా
ముందుగా పెరుగు గిలకొట్టి దానిలో సగ్గుబియ్యాన్ని ఆరు గంటల పాటు నానబెట్టాలి.బాగా నానిన తర్వాత బియ్యప్పిండి,బొంబాయిరవ్వ,ఉల్లిపాయ
చిన్న సగ్గుబియ్యం - 1/2 కప్పు
చిక్కటి పెరుగు - 1/2 కప్పు
బొంబాయి రవ్వ - 1/2 కప్పు
బియ్యప్పిండి - 1/2 కప్పు పైన
ఉల్లిపాయలు - 2 పెద్దవి
అల్లం తురుము - 2 చెంచాలు
పచ్చిమిర్చి తురుము - 4 చెంచాలు
ఉప్పు - సరిపడా
నూనె - వేయించడానికి సరిపడా
ముందుగా పెరుగు గిలకొట్టి దానిలో సగ్గుబియ్యాన్ని ఆరు గంటల పాటు నానబెట్టాలి.బాగా నానిన తర్వాత బియ్యప్పిండి,బొంబాయిరవ్వ,ఉల్లిపాయ
పకోడీకయితే పొడవుగా,బొండాలకయితే సన్నగా చిన్న ముక్కలు తరిగి అల్లం,పచ్చిమిర్చి తురుము,ఉప్పు వేసి పకోడీ పిండి మాదిరిగా కలుపుకోవాలి.అవసరమయితే కొంచెం పెరుగు కలుపుకోవచ్చు.పొయ్యిమీద బాణలిలో తగినంత నూనె పోసి బాగా కాగిన తరాత దానిలో పిండిని పకోడీకయితే సన్నగా పొడవుగా బొండాలకయితే కొంచెం ఎక్కువ పిండితో గుండ్రంగా వేసుకోవాలి.బంగారు రంగు వచ్చేవరకు వేయించి వేడి వేడిగా కొబ్బరి చట్నీతో కానీ,టమోటా చట్నీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటాయి.
Thursday, 5 July 2018
మెదడు చురుగ్గా
అల్పహరంతో పాటు చిన్న కప్పు హిమ క్రీము అదేనండీ ఐస్ క్రీమ్ తింటే మెదడు చురుగ్గా పని చేస్తుందట.హిమ క్రీము ఇష్టమైన వాళ్ళు పిల్లలు,పెద్దలుకూడా ఇప్పటి నుండి నిరభ్యంతరంగా తినవచ్చు.
Tuesday, 3 July 2018
నమిలే జిగురు(చూయింగ్ గమ్)
ఇంతకుముందు రోజుల్లో అయితే పిల్లలు,పెద్దలు కూడా కాలక్షేపం కోసం మధ్యాహ్నం,సాయంత్రం బఠాణీలు,వేయించిన శనగలు,మరమరాలు నములుతూ ఉండేవాళ్ళు.ఇప్పుడయితే పిల్లలు,పెద్దలు కూడా నమిలే జిగురు(చూయింగ్ గమ్)నములుతూ కనిపిస్తున్నారు.విదేశాలలో అయితే దాదాపు అందరూ చూయింగ్ గమ్ ఎప్పుడూ నములుతూనే కనిపిస్తుంటారు.వాళ్ళు కాలక్షేపం కోసం నమిలినప్పటికీ దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని పరిశోధకులు కూడా చెప్తున్నారు.నమిలేదేదో చక్కర లేని చూయింగ్ గమ్ నమలడం ఆరోగ్యానికి మంచిది.దీన్ని నమలడం వల్ల దంతాలపై ఉండే పాచి పోవడమే కాక ఒత్తిడి తగ్గి మెదడు నరాలకు రక్త ప్రసరణ మెరుగు పడుతుంది.నడక వేగం పెంచితే గుండె వేగం పెరుగుతుంది.కనుక వృద్దులు మరీ వేగంగా నడవక పోవడమే మంచిది.ఏదైనా నమిలే జిగురు నములుతూ నడవడంతో నడక వేగం కూడా పెరిగి తెలియకుండానే ఎక్కువ దూరం నడవగలుగుతారు.దీనితో అదనపు బరువు అదుపులో ఉండి మానసికంగా,శారీరకంగా ఆరోగ్యం బాగుంటుంది.మధ్య వయస్కులు చక్కెర లేని నమిలే జిగురు నమలడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
సంపూర్ణ ఆరోగ్యం మన చేతుల్లోనే
మన రోజువారీ ఆహారంలో భాగంగా తాజా కూరగాయలు,ఆకుకూరలు,పండ్లు క్రమం తప్పకుండా తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మన స్వంతం అవుతుంది.కాలానుగుణంగా లభించే వాటిని తాజాగా వీలయితే ఇంట్లోనే పండించుకుని తినగలిగితే మనకు సరిపడా పోషక పదార్ధాలు సమకూరి రోగాలు దరిచేరకుండా సంపూర్ణ ఆరోగ్యం మన చేతుల్లో వుంటుంది.దీనికోసం మనం పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం కూడా ఉండదు.మనకు ఉన్నంత స్థలంలోనే నేలమెడ కానీ కుండీలలో కానీ,సంచుల్లో కానీ ఎప్పటికప్పుడు ఆకుకూరల విత్తనాలు చల్లుకోవచ్చు.చిన్న కుండీలో కూరగాయల విత్తనాలు చల్లి కొద్దిగా పెద్ద అయిన తర్వాత పెద్ద కుండీలలో పెట్టుకోవచ్చు.పండ్ల మొక్కలు తక్కువ ఎత్తులో విరివిగా కాసేవి తెచ్చి పెంచుకోవచ్చు.సొర,బీర,పొట్ల,కాకర వంటి తీగ జాతి మొక్కలను తొట్టిలో విత్తనాలు పెట్టి కాస్త తీగ వచ్చిన తర్వాత తాడుకట్టి పైకి పాకించవచ్చు.తెగుళ్ళు రాకుండా ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే వాటితో తయారు చేసుకున్న వేప కాషాయం, వెల్లుల్లి కాషాయం,లవంగాల కషాయం వంటివి చల్లుకుంటే పురుగుల బెడద లేకుండా ఉంటుంది.రసాయనాలు చల్లకుండా రసాయన రహిత తాజా ఇంటి పంట మన స్వంతం అవుతుంది.రుచికరమైన ఆకుకూరలు,కాయగూరలు,పండ్లు వాడుకోవచ్చు.దీనితోపాటు రోజు ఉదయం,సాయంత్రం ఒక అరగంట మొక్కలలో తిరిగితే ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది.స్వంతంగా మన చేతి మీదుగా మొక్కలను పెంచి,పోషించి అవి మనకు అందించిన ఆకులు,కాయలు,పండ్లు కోస్తుంటే మాటల్లో చెప్పలేనంత సంతోషం.ఆ రుచి,ఆ సంతృప్తి ఎంతో విలువైనది.వీటితోపాటు పువ్వుల మొక్కలు వేసుకుంటే తోట అందంగా ఉంటుంది.సంవత్సరం పొడుగునా వాడుకోవటానికి వీలుగా విత్తనాలు ఎప్పటికప్పుడు వేసుకుంటే బాగుంటుంది.
దానిమ్మ తొక్కల ఉపయోగం
మనం సహజంగా దానిమ్మకాయ వలిచినప్పుడు గింజలు తినేసి తొక్కలు పారేస్తుంటాము.ఇక ముందు అలా చెత్తలో పడేయకండి.దానిమ్మ తొక్కలను ఒక పళ్ళెంలో పలుచగా పేర్చి ఎండలో పెట్టి బాగా ఎండనివ్వాలి.బాగా ఎండిన తర్వాత మిక్సీలో వేసి మెత్తటి పొడి చేసుకుని మూత గట్టిగా ఉన్నసీసాలో పోసి పెట్టుకోవాలి.ఒక చెంచా పొడి లో కొద్దిగా నిమ్మ రసం పిండి ముఖానికి రాసుకుని 20 ని.ల తర్వాత ముఖం కడుక్కుంటే ముఖం మీదున్న మొటిమలు,మచ్చలు మాయమైపోతాయి.మరికొంత మందికి చిన్న వయసులోనే ముఖంపై ముడుతలు వచ్చి ఉన్న వయసు కన్నా ఎక్కువగా కనిపిస్తుంటారు.అలాంటప్పుడు ఒక చెంచా పొడిలో కొద్దిగా పాలు కలిపి ముఖానికి పట్టించి 20 ని.ల తర్వాత ముఖం కడగాలి.ఇలా తరచుగా చేస్తుంటే ముడతలు మాయమై దానితోపాటు ముఖ వర్చస్సు కూడా పెరుగుతుంది.దానిమ్మ పొడి వాడడం వలన ఎండ వేడి,కాలుష్యం వలన చర్మంపై వచ్చే ఇతర సమస్యల నుండి కూడా తప్పించుకోవచ్చు.
Friday, 1 June 2018
పుర్రెకు తెగులు
ఈమధ్య కొంత మంది అవసరం ఉన్నా లేకున్నా తమను తాము పొగుడుకుంటూ ఎదుటివారి కన్న మేమే గొప్ప అని చెప్పటం మొదలుపెట్టారు.ఇంకొంత మంది ఎదుటి వారిని కించ పరుస్తూ తమను తాము పొగుడుకుంటున్నారు.ఈ తరహా పోకడ ఇంతకు ముుందు అతి కొంత మందిలో మాత్రమే కనిపించేది.ఇప్పుడు ఎక్కువమంది ఇదే బాటలో నడుస్తున్నారు.ఈ పోకడ మంచిది కాదని వాళ్ళకు తెలియదు. ఎదుటి వారు చెప్పినా అర్ధం చేసుకోలేని పరిస్థితి.మొక్కకు తెగులు వస్తే అంతవరకు తీసేసి ఇతర మొక్కలకు దూరంగా పెడతాము.పురెకు తెగులు వచ్చినట్లు ఏ మాట పడితే ఆ మాట ఎదుటి వారిని మాట్లాడితే ఎదుటి వారు మౌనంగా ఉండేది వాళ్ళకు మాటలు రాక కాదు. లేక మాట్లాడే వాళ్ళ గొప్ప చూచి కాదు. అటువంటి వాళ్ళతో మాట్లాడటం వృధా ప్రయాస అనుకున్నారని అర్ధం చేసుకుంటే మంచిది.మనుషులు కనుక మానవ సంబంధాల దృష్ట్యా ఇటువంటి కొంత మందిని భరించక తప్పని పరిస్థితి.
Subscribe to:
Posts (Atom)