Friday, 28 February 2014

ఏనాటి ఋణానుబంధమో

         శ్రీజ అమ్మవాళ్ళఇంట్లో ఆవులు,ఎద్దులు,గిత్తలు మేలిరకానికి చెందినవి ఉంటాయి.గోమాతలో ముక్కోటి
దేవతలు ఉంటారు కనుక దొడ్లోపెంచితే ఏదోషాలున్నాతొలగిపోతాయని చెప్పటంవలన పెంచటం మొదలుపెట్టారు.
శ్రీజ తమ్ముడికి కూడా మేలిరకం ఆవుల్ని,గిత్తల్ని పెంచటం సరదా.విదేశీయులు వచ్చిచూచి వాటితో ఫోటోలు
తీసుకుంటూఉంటారు.వాటికి ప్రత్యేకంగా షెడ్లువేసి పంకాలు పెట్టి,సేవకులనుపెట్టి జాగ్రత్తగా చూచుకొంటారు.
ఆవులప్రదర్శనలో అందాలపోటీల్లో బహుమతులు వస్తుంటాయి.వీళ్ళింటికి రెండిళ్ళఅవతల జగదీష్అనినాలుగు
సంవత్సరాలఅబ్బాయి ఉంటాడు.వాడికి నడకవచ్చిన దగ్గరనుండి ఆవులషెడ్డు దగ్గరకువచ్చిఆవుల్నిచూచి   వెళ్తుంటాడు.ఎప్పుడైనా పాలేళ్ళురావటం లేటయితే ఆత్రుతపడి ఇంతపొద్దెక్కినా ఏంచేస్తున్నారో?తొందరగా
రావాలనితెలియదా?వాటికి దాణాపెట్టటం,నీళ్ళుపెట్టటం లేటయింది అయ్యో!ఆవులకు ఇంతవరకుఏమీపెట్టలేదు
ఆలస్యమయిందని హడావిడి పడిపోతుంటాడు.పదిసార్లు ఏమిచెయ్యాలోతోచక ఇంటికి,షెడ్డుకితిరుగుతుంటాడు.
ఎవరోఒకళ్ళువచ్చి వాటిపనిచూస్తేగాని వీడు స్థిమితపడడు.నిద్రలోఆఆవుకు మేతవెయ్యాలి,ఈఎద్దుకినీళ్ళు
పెట్టాలి అంటూ ఉంటాడని వాళ్ళఅమ్మ చెప్తూఉంటుంది.మధ్యమధ్యలోవచ్చి పనివాళ్ళు సరిగ్గాచేస్తున్నారోలేదో
తనిఖీచేసి వీళ్ళింటికివచ్చి చెప్పివెళ్తుంటాడు.ఏనాటి ఋణానుబంధమో అన్నిసార్లువెళ్లొద్దనిచెప్పినావినకుండా
మీఇంటికి షెడ్డుకి తిరుగుతుంటాడని అందరూ అంటూఉంటారు.  

కుక్క బిస్కట్లు

       చారుమతి తృణధాన్యాలతో తయారుచేసిన వివిధరకాల ఉత్పత్తులను ప్రజలకు తెలియపరచటం కోసం
ఒకప్రదర్శనలో పెట్టింది.తన ముఖ్యోద్దేశం ఏమిటంటే రాగులు,జొన్నలు,సజ్జలు,కొర్రలు,అవిసెగింజలు మున్నగు
వాటితో తయారుచేసిన ఆహారం తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది కనుక దైనందినజీవితంలో వాటినిఎలా
రకరకాల రుచికరమైన ఆహారపదార్దాలుగా తయారుచేసి తినవచ్చో తెలియచెప్పటం.ఈరోజుల్లో ఎక్కువమంది
జిహ్వచాపల్యం వల్లఫాస్ట్ ఫుడ్ ఇష్టపడుతున్నారు కనుక ఐదునక్షత్రాల హోటళ్లకు పరుగులు తీస్తున్నారు.
పెద్దవాళ్ళే పిల్లలకు అలవాటుచేస్తుంటే ఇక పిల్లలగురించి చెప్పేదేముంది.పెద్దలేఆరోగ్యానికి ప్రాముఖ్యతఇవ్వటం
లేదు.పిల్లలకేంతెలుస్తుంది?అన్నిఉత్పత్తులతోపాటు చారుమతి మిల్లెట్ బిస్కట్లు కూడా పెట్టింది.ఇద్దరు పిల్లలు
రోజుకొకసారి వచ్చి ఈబిస్కట్లు ఎంత అనిఅడిగి వెళ్తున్నారు.ఒకరోజు ఇంకోఇద్దరిని తీసుకొచ్చి బిస్కట్లు చూపించి
ఇదిగో ఇవి కుక్క బిస్కట్లు అని చెప్తున్నారు.వాళ్ళు వాటిరుచి కూడాచూడలేదు.అయినా మాట్లాడుతున్నారు.
మామూలుబిస్కట్లు ఐదురూపాయలకే దొరుకుతున్నాయి.ఇవిఖరీదు ఎక్కువకనుక కొనలేకతినాలన్పించిఅలా
చెప్పాడో అర్థంకాలేదు.అయినా ఆరోగ్యానికి ఉపయోగపడేవి క్రీంబిస్కట్లంత రుచిగా లేకపోయినా కుక్క బిస్కట్లు
అనటం ఏమిటో?పిల్లలు అలా తయారయిపోతున్నారు పితపకాలపు బుద్దుల్లాగా అని చారుమతి అనుకొంది.

Thursday, 27 February 2014

హైటెక్ దోపిడి

        అరుంధతి అక్క మనుమరాలి పెళ్లి కుదిరింది.పెళ్ళికొడుకు లండన్లో ఉంటాడు.తల్లిదండ్రులు భారతదేశంలో
ఉంటారు.పెళ్లిబట్టలు కొనటానికి వెళ్ళినప్పుడు పెళ్లి కూతురి చీర తక్కువలోతీసుకుంది.ఆడపెళ్ళి వాళ్ళతో
పెళ్లికొడుకుతల్లి ఎక్కువరేటులో కొనిపించుకుంది.ఆమె చెల్లి మాఅక్కతక్కువరేటు చీరలు కట్టదు అంది.
అందరికన్నా మంచిచీర పెళ్లికూతురికి పెట్టాలికదా ఆ ఆలోచనలేదు.సరే మంచిసంబంధం కదా పిల్లడు
మంచివాడు చిన్నచిన్నవి పట్టించుకోవటం ఎందుకులే అని వదిలేశారు.లగ్నాలు పెట్టుకున్నతర్వాత
అయిదు లక్షలు ఆడపడుచుకట్నం ఇమ్మని కబురు చేశారు.మేనత్త,మేనమామ పిల్లలయినా పెళ్లికూతురి
తల్లిదండ్రులు కలిసిఉండరు.ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ పిల్లలబాధ్యత పంచుకున్నావీళ్ళు వేరుగా
ఉంటున్నారు.పిల్లపెళ్ళికి ముందే ఇలామగపెళ్లివాళ్ళు మాట్లాడుతున్నారేమిటి? ముందుముందు ఎలా
ఉంటుందో?అని అందరూ కంగారుపడ్డారు.మీరు కంగారుపడాల్సిన అవసరంలేదు మీ అమ్మాయిని
జాగ్రత్తగా నేను చూసుకుంటాను.ఆడబ్బు వాళ్ళసంతృప్తి కోసం ఇవ్వండి నేను మీకు ఇస్తాను  అని పిల్లడు చెప్పినతర్వాత కుదుటపడి ఆడపడుచు కట్నం సమర్పించుకున్నారు.ఇదొక హైటెక్ దోపిడి అని అందరూ
అనుకొన్నారు.అరుంధతి ఇది జన్మలో మర్చిపోలేని సంఘటన అనుకుంది.

లేటెస్ట్ బెగ్గింగ్

         చరిష్మ షాపింగ్ కి వెళ్తుంటే ట్రాఫిక్ ఆగిపోయింది.కొద్దిసేపటికి ఎక్కడినుండి ఊడిపడ్డారోకానీ నలుగురు

పిల్లలు వచ్చారు.అందరూ డబ్బులివ్వమని మామూలుగా వాహనాలను కొట్టిమరీ అడుగుతున్నారు.అందులో

ఒక  పిల్ల చక్కగా చూడముచ్చటగా ఉంది.ఒకచిన్నగుడ్డతో వాహనాలుతుడిచి డబ్బులుఅడుగుతుంది.ఆఅడిగే

 విధానానికి కొంతమంది నవ్వుకుని డబ్బులు ఇస్తున్నారు.ఇదంతా చూస్తున్న చరిష్మకు కూడా ఆపిల్లను

చూస్తే ఊరికే డబ్బులు ఇవ్వమని అడక్కుండా కాస్త పనిచేసి డబ్బులు ఇవ్వమంటున్నందుకు ముచ్చటేసింది.

ఓహో ఇదొక లేటెస్ట్ బెగ్గింగ్ అన్నమాట అనుకుంది.

బట్టబుర్రమీద జుట్టుమొలక

                 యామిని కూతురు శ్రేష్ట కు అమెరికాలో ఉన్న పెళ్లికొడుకుల్ని వెతుకుతున్నారు.అన్నీనచ్చినా
పెళ్లికొడుక్కి బట్టబుర్ర ఉందని వద్దనుకొన్నారు.అయితే వాడు తర్వాత అమ్మానాన్నలతో భారతదేశానికివచ్చి కొంతమందిఅమ్మాయిలను చూచినచ్చిన వాళ్ళు బట్టబుర్రని వద్దంటే తిరిగి వెళ్ళిపోయాడు.వెళ్ళేటప్పుడు
భారతదేశం లో''హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్'' అంటే బట్టతలమీద వెంట్రుకలు మొలిపించటం అన్నమాట.
అలా మొలిపించుకుని వేరేబంధువులద్వారా యామిని వాళ్ళకు ఫోటో పంపించారు.మొదట వేరేఅతను అనుకొన్నారు.ప్రతిసంవత్సరం అమ్మా,నాన్న,పిల్లడు ఆడపిల్లలను చూచితిరిగి వెళ్ళిపోవటానికి అలవాటుపడ్డారు.
యామిని వాళ్ళింటికి మీపాప నచ్చింది మేము వస్తున్నాము అనికబురు చేశారు.అందరూ వస్తున్నారు
అనుకుని సరేనన్నారు.అమ్మ,నాన్న చేతులు ఊపుకుంటూ వచ్చారు.మాఅబ్బాయి రావటం లేటయింది రెండురోజులకు వస్తాడు అని చెప్పారు.బందువులతరఫున వచ్చినసంబంధం అని ఊరుకున్నారు.తర్వాత
బట్టబుర్ర పెళ్ళికొడుకు వచ్చాడు.ఆసోది,ఈసోది కాసేపు చెప్పాడు.మానాన్న చాలాస్ట్రిక్ట్ అందుకని బయటకువెళ్లి
నాఇష్టం వచ్చినపనులు చేస్తాను అని చెప్పాడు.బట్టబుర్రమీద జుట్టుమొలిపించుకున్నట్లుసరిగ్గా చూస్తే అర్ధమయ్యింది.ఇంతోటి భాగ్యానికి రెండుసార్లు ఆడపిల్ల ఇంటిచుట్టు తిరుగుతారా? మాకు ఈసంబంధం ఇష్టం
లేదుఅని మధ్యలో వాళ్ళకు యామిని భర్త కబురు పెట్టారు.   

జాతర

      యశోధర ఖమ్మం దగ్గర పల్లెటూరిలో ఉంటుంది.వాళ్ళఊరి దగ్గర శివరాత్రికి పెద్దజాతర జరుగుతుంటుంది.
ఆచుట్టుప్రక్కల వాళ్ళు జాతరకు వచ్చేవాళ్లకోసం ఎవరికి తోచిందివాళ్ళు పంపిస్తుంటారు.ఈసారి యశోధరవాళ్ళు
పొలంలో పండినధాన్యము,కూరగాయలు ముందుగా స్వామికి ఇద్దామని అనుకొన్నారు.అందుకని 3క్వింటాళ్ళ
బియ్యం,పప్పులు,కూరగాయలతో వంటలు చేయించి గుడిదగ్గరకు పంపించారు.అక్కడివాళ్లు నివేదనపెట్టి జాతరకు వచ్చినవాళ్ళకు భోజనాలు పెడతారు.ఈజాతర కన్నులపండుగగా జరుగుతుంది.ఇది చూచి తరించటానికి   చుట్టుప్రక్కలవాళ్ళే కాక ,దూరప్రాంతాలనుండి కూడా చాలామంది వస్తుంటారు.క్రిందటి సంవత్సరం యశోధర వాళ్ళు ఇలాగే వంటలు చేయించి కోటిపల్లికి పంపించారు.
                                                                   

తిరణాల

                                                         విజయవాడకు 10-12కి .మీ దూరంలో కృష్ణానదీతీరాన యనమలకుదురు అనే గ్రామం ఉంది.అక్కడ మహాశివరాత్రి సందర్భంగా పెద్దతిరణాల జరుగుతుంది.నెలరోజుల ముందునుండే హడావిడి మొదలవుతుంది.ఇందులో ప్రత్యేకఆకర్షణ ప్రభలు.ముందుగా గ్రామప్రభ బయలుదేరుతుంది.తర్వాత పెద్దపెద్ద ప్రభలు ఊరేగింపుగాచుట్టుప్రక్కల ఊళ్ళనుండి,సిటీనుండి వస్తాయి.తెల్లవారుజాము నుండే ఎద్దులను స్థానికులు,ప్రక్క ఊర్లవాళ్ళు గులాముచల్లి,అందముగా అలంకరించి కొండచుట్టూ గిరి ప్రదక్షిణ చేయిస్తారు.పెద్ద కొండమీద గుడి ఉంటుంది.మొదట్లో కొండపైకి వెళ్ళటానికి దారికూడా సరిగ్గా ఉండేదికాదు.అయినా చాలాదూరం నుండికూడా ప్రజలు తండోపతండాలుగా తిరణాలకు వచ్చేవారు.ఇప్పుడు ఘాట్ రోడ్డువేసి కొండపైన బాగా అభివృద్ధిచేసారు.పూర్వం శివాలయం ఒక్కటే వుండేది.ఇప్పుడు ఉపాలయాలు వేరుగా కట్టారు.శివాలయంలో ప్రతిరోజు 11రకములతో అంటే పంచామృతాలతో,పండ్లరసాలతో.వీభూదితో రుద్రాభిషేకాలు చేస్తారు.శివరాత్రినాడు రాత్రి ఒంటి గంటనుండే అభిషేకాలు చేయడం మొదలెడతారు.సుదూర ప్రాంతాల  నుండి ప్రజలు  దైవ దర్శనం   చేసుకోవటానికి వస్తూ వుంటారు. కనుక ఆరోజు దైవ దర్శనానికి  చాలా సమయం వేచి ఉండవలసి వస్తుంది.అయినా అందరూ ఎంతో ఓపికగా స్వామి దర్శనం కోసం బారులు తీరతారు.ఆరోజు ఆర్.టి.సి బస్సులు ప్రత్యేకంగా వేస్తారు.ఎక్కడెక్కడినుండో జనం ఎన్నోవ్యయప్రయాసలకోర్చి ఈతిరణాలకు,స్వామిదర్శనానికి వస్తారు.ఇసుకవేస్తే రాలనట్లుగా ఉంటుంది.మూడు రోజులపాటు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.శివపార్వతుల కళ్యాణం చూడటానికి ఎంతో మంది వస్తారు.చిన్నవ్యాపారులందరూ  కొండచుట్టు రకరకాల వస్తువులు,బొమ్మలు అమ్ముతుంటారు.ఆఊరి వారందరూ వారివారి బంధువులను,స్నేహితులను ఆహ్వానిస్తారు.ఆ ఊరివాళ్ళు దూరప్రాంతాల నుండి కూడా శివరాత్రికి తప్పకుండా వస్తారు.ఇది చూడటానికి రెండుకళ్ళు చాలావనిపిస్తుంది.ఈరోజు చాలామంది ఉపవాసం ఉండి జాగరణ చేస్తారు.చేయలేనివాళ్లు దైవదర్శనం చేసుకుంటారు.

                                    నా బ్లాగ్ వీక్షించవచ్చిన వారందరికి శివరాత్రి శుభాకాంక్షలు.

Wednesday, 26 February 2014

మంధర

    మంధర స్నేహితురాలి కొడుకు అమెరికాలో ఉంటాడు.భారతదేశంలో ఉన్న ఇంకొక స్నేహితురాలి కూతురుతో

పెళ్లి కుదిరింది.ఈఇద్దరు బంధుత్వం కలుపుకోవటము మంధరకు ఇష్టంలేదు.అందుకని వీళ్ళిద్దరి స్నేహం,పిల్లల

పెళ్లి చెడగొట్టటానికి కూడా వెనుకాడలేదు.రామాయణంలో మంధరపాత్ర పోషించి పెళ్ళికొడుకు తల్లికి ఏదోఒకటి  

చెప్పి ఇద్దరికీ మధ్యలో గొడవ పెడదామని ప్రయత్నించేది.వెండివి పంచిపెట్టమని అడుగుఅని,ఆడపడుచు

కట్నం ఇవ్వకపోతే ఏమి బాగుంటుందిఅని ఒకసారి తనకుఆమాటలు నచ్చకపోయినా ఒక్కొక్కసారి పెళ్లికూతురి

  తల్లితోమాట్లాడేది.ఇదేమిటి స్నేహితురాలని పిల్లనిద్దామని అనుకొంటే ఇలామాట్లాడుతుంది అనుకుని అసలు

ఏమిజరిగింది చెప్పమంటే అప్పుడు మంధర ఇలామాట్లాడుతుందని చెప్పింది.ఏదయినా నాతోమాట్లాడు

మధ్యలో వాళ్ళ మాటలు మనకు అనవసరం అనిచెప్పింది.పెళ్లికొడుకుతల్లి నిజమే ఇంకెప్పుడూ అలావినను

 నాదేతప్పు అనుకుంది.ఈరోజుల్లో మంధరలాంటివాళ్ళే ఎక్కువమంది ఉన్నారు.వాళ్ళ చెప్పుడుమాటలు వింటే

జీవితాలే నాశనమవుతాయని చెప్పుడు మాటలు వినే వాళ్ళు అర్థం చేసుకుంటే బావుంటుంది.
     

Tuesday, 25 February 2014

గాదె క్రింద పందికొక్కులు

       సూర్జిత్ కష్టపడి చదువుకుని విదేశాలకు వెళ్ళిఅక్కడ సంపాదించిన డబ్బుతో మాతృదేశంలో ఒకసంస్థను ఏర్పాటు చేశాడు.అందరికీ ఉపయోగపడాలన్న ఉద్దేశ్యంతో విదేశాలనుండి మిషన్లు పంపించి మరీ సంస్థను
నడుపుతున్నాడు.నమ్మకమయినవాడనుకుని ఒకతన్నిపెట్టాడు.అతను తనకు నమ్మకమయిన వాళ్ళను
తీసుకొచ్చి అందరూ కలిసి గాదె క్రింద పందికొక్కుల్లా అక్రమంగా తినేయటం మొదలుపెట్టారు.సూర్జిత్
 సంవత్సరానికి ఒకసారో రెండుసార్లో వచ్చినప్పుడు పైపై మెరుగులుచేసి సంస్దకు అందంగా రంగులువేసి బాగా నడుస్తున్నట్లు చూపించేవాడు.ఉద్యోగుల్ని సమస్యలు చెప్పనీయకుండా ,నేరుగా మాట్లాడనీయకుండా
మీటింగులు ఏర్పాటు చేసేవాడు.సూర్జిత్ తిరిగి విదేశాలకు వెళ్ళిన తర్వాత యధా రాజా తధా ప్రజా
అన్నట్లు వుండేది.పాపం సూర్జిత్ కి ఇవన్నీ తెలియవు.నిజంగానే సంస్థ బాగా నడుస్తుంది అనుకునేవాడు.

మనిషి ముందు మనిషి మాట

       రుక్మిణి బంధువులలో నాగిణి మనిషి ముందు మనిషి మాట చెప్తుండేది.మనముందు మనమే మంచి
వాళ్ళమని వేరేవాళ్ళు చెడ్డవాళ్ళని వేరే బంధువుల ఇంటికి వెళ్లి మీరు చాలామంచివాళ్ళు వాళ్ళకన్నా అని
చెప్పేది.ఆరకంగా చెప్పి వారంరోజులు తిష్ట వేసి ఎక్కడికక్కడ తింటూ పబ్బం గడుపుకోనేది.ఇక్కడ తినేసి
ఆమెకు చేతులు పనిచెయ్యవు,ఈమెకు నడుము పనిచెయ్యదు, పనులు చెయ్యలేరు అని ఇంకొకచోట చెప్పేది.తిన్నన్నిరోజులు తిని ఇకలాభం లేదు అనుకొన్నప్పుడు వేరేఊరు మకాం మార్చేది.ఒకసారి
బంధువుల ఇంట్లో పెళ్ళిలో అందరూమాట్లాడుకునేటప్పుడు నాగిణి అందరి ఇళ్ళల్లో పదేసిరోజులు ఉండి ఇలా చెప్తుంది అనితెలిసిఅందరూ కలిసి నోట్లో గడ్డి పెట్టారు.ఇంకెప్పుడూ అలాచెప్పను అని చెంపలు వేసుకుని  అప్పటినుండి అలా ప్రవర్తించటం మానేసింది.
  

టెన్షన్ ఫ్రీ

         లోలిత కాలనీలోఆడవాళ్ళందరూ మధ్యాహ్నమయ్యేసరికి ఒకచోట చేరి పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ ఉంటారు.అలాగే ఒకసారి టెన్షన్ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు.అందరూ వాళ్ళు ప్రతి చిన్నదానికి ఎలా
కంగారుపడేది చెప్తున్నారు.అంతలో ఒకామె లోలిత దేనికీ కంగారుపడదు.తనకు ఏసమస్యలు లేవు.తను టెన్షన్ ఫ్రీ అనేసింది.అప్పుడు లోలిత అమ్మా!సమస్యలు అందరికీ ఉంటాయి.ఎంతచెట్టుకు అంతగాలి అన్నట్లు ఎవరి సమస్యలు వాళ్ళకుంటాయి.కొంతమంది కంగారుపడతారు,కొంతమంది కంగారుపడరు.ప్రతిచిన్నదానికికంగారు
పడితే ఆరోగ్యసమస్యలు రావటంతప్ప ఉపయోగం ఏమీ ఉండదు.ఏదయినా సమస్య వచ్చినప్పుడు నిదానంగా కొంచెంసేపు ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.అదికూడా చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని
మీద భారంవేసి ప్రశాంతంగా కూర్చోవాలి.మనం కంగారుపడి ఇతరులను కంగారు పెట్టి సమస్యను పెద్దది
చేయటం కన్నాఅదే మంచిపని అప్పుడు అందరూ టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు అనిచెప్పింది.
  

Monday, 24 February 2014

అడవి తేనెటీగలు

        ప్రద్యుమ్నకువరుసకు అన్నయ్య అమెరికాలో ఉంటాడు.అతని ఇల్లు పదమూడు ఎకరాలలో ఉంటుంది.
అతను డాక్టరు అయినా వ్యవసాయం అంటే ఇష్టం.అందుకని ఖాళీ సమయంలో ఇంటిచుట్టు ఉన్న స్థలంలో ట్రాక్టరుతో దున్నిఇంట్లోకి కావలసిన కూరగాయలు,పళ్ళు పండించుకుంటారు.రకరకాల పూలమొక్కలు,
ఆకుకూరలు,కురగాయలమొక్కలు,పళ్ళ చెట్లతోఅందంగా,నందనవనంలా ఉంటుంది.భార్య కూడా డాక్టరు.
ఇద్దరూ వాళ్ళ ఖాళీసమయంలో తోటపని స్వయంగా పర్యవేక్షిస్తారు.అక్కడ అడవి తేనెటీగలు భూమిలో
పుట్టల్లో ఉంటాయట.ఎప్పటికప్పుడు పురుగుమందులు చల్లుతుంటారట.ఒకసారి ఇంట్లో మందులు
అయిపోవటంవలన అశ్రద్ధ చేశారు.ప్రద్యుమ్న అన్నయ్య చూడకుండా ఆపుట్టమీద కాలేశాడు.అవి
ఒక్కసారిగాపైకి లేచి అతన్ని ఎక్కడపడితే అక్కడ కుట్టేసినాయి.అనుకోకుండా ఆరోజు పొట్టినిక్కరు
వేసుకోవటంవలన ఇంకా బాగా కుట్టినాయి.వాటిముల్లు కుట్టినచోట దిగటంవలన విషం ఉంటుందికనుక
ఆముల్లు తీయించుకుని ఇన్ఫెక్షనురాకుండా ఇంజెక్షన్లు చేయించుకోవాల్సి వచ్చింది.వారంరోజులయినా
ఆదద్దుర్లు,భాద తగ్గలేదు.ఆసమయంలోనే వాళ్లనాన్నగారు చనిపోవటంవలన ఆబాధకుతోడు ఈబాధకూడా
తోడై భారతదేశానికి రావాల్సి వచ్చింది.
 

తిండిపోతు

     ఒక పాతిక,ముప్పై సంవత్సరాల క్రితం పల్లెల్లో పెళ్ళిళ్ళు,ఏశుభకార్యం జరిగినా ఊరిలో కుర్రాళ్ళే వడ్డన

 చేసేవాళ్ళు.అప్పటికి కాటరింగ్ సర్వీసులు లేవు కనుక స్వామికార్యం స్వకార్యం అనుకొన్నట్లు అందరూ

అన్నీ దగ్గరఉండి చూసుకునేవాళ్ళు.అందులో ఒకతను వడ్డిస్తున్నంతసేపు స్వీట్లు,తినుబండారాలన్నీతింటూ

ఉండేవాడు.అలాతింటూ ఉండటంవలన చాలా లావుగా ఉండేవాడు.అందరూ చదువుకున్న కుర్రాళ్ళే.అయినా

అందరూ వాళ్ళస్వంతపనిగానే భావించి ఉచిత సేవ చేసేవాళ్ళు.ఎప్పుడూ ఏదోఒకటి నెమరవేస్తూ ఉండే అతన్ని

అందరూ తిండిపోతు అనుకుంటారుఅని ఆట పట్టించేవారు.అతనిపేరు రమేష్ .అందరూచాటున తిండిపోతు

రమేష్,బండ  రమేష్ అనేవాళ్ళు.అనతికాలంలో స్వీట్లు ఎక్కువ తినటంవలన పాపం మధుమేహంబారిన

పడ్డాడు. బాగా చదువుకొన్న వాడే తినగూడదు అనితేలిసీ తినకుండా ఉండలేకపోయేవాడు.

మళ్ళీ వస్తాను

       రితిక ఇంటికి బంధువులు వచ్చారు.వారిలో కొంతమంది అమెరికానుండి,కొంతమంది ప్రక్కసిటీ నుండి వచ్చారు.ప్రక్కసిటీ నుండి వచ్చినాయనకు గర్వం నేనేగొప్ప అనుకుంటాడు.అలాంటిది ఈసారి వెళ్ళేటప్పుడు
సంతోషంగా వెళ్లొస్తాను మళ్ళీ అమెరికావాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళతో వస్తాను అనిచెప్పి వెళ్ళాడు.
రితిక అలాగే అంది.ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్దఆరోగ్య సమస్య వచ్చింది.మళ్ళీ వస్తానని చెప్పినవాడు
రాలేదు.ఎప్పుడయినా వస్తాడో,రాడో కూడా తెలియని పరిస్థితి.తక్షణమే ఆపరేషను చేయాల్సివచ్చింది.చేస్తే
ఎలావుంటాడో తెలియదు.ఇదేమిటి నిన్నకాక మొన్నచక్కగా,చలాకీగా ఉన్నాడు.మళ్ళీ వస్తానని సంతోషంగా
చెప్పివెళ్ళాడు మళ్ళీ చూడగలనో లేదో అని రితిక చాలా బాధపడింది.

Sunday, 23 February 2014

దినదిన గండం నూరేళ్ళ ఆయుష్షు

       రితిష బంధువులలో ఒకాయన కుటుంబంతో అమెరికానుండి మాతృదేశమైన భారతదేశానికి వచ్చాడు.
వచ్చేటప్పుడు అమెరికాలోమంచు బాగాఉండటంవలన విమానం బయలుదేరుతుందో లేదో తెలియని పరిస్థితి.
ప్రయాణం మానుకోవలసి వస్తుందేమోనని ఆదుర్దా పడవలసి వచ్చింది.ఎలాగయితే మంచులో ఇబ్బందిపడి
విమానాశ్రయానికి వచ్చి విమానయానం చేసి అలసిపోయి మాతృదేశానికి వచ్చారు.రితిష ఇంటిలో ఒకరోజు
విశ్రాంతి తీసుకుని స్వగ్రామానికి వెళ్దామని బయలుదేరారు.దారిలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంవలన ఆలస్యంగా
విమానాశ్రయానికి చేరుకున్నారు.తనిఖీ చేయవలసిన సామాన్లు ఎక్కువగా ఉండటంవలన విమానం వెళ్ళటానికి
అరగంట మాత్రమే ఉన్నందున లోపలకు అనుమతించలేదు.విమానం బయల్దేరి వెళ్ళిపోయింది.తర్వాత విమానానికి మళ్ళీటిక్కెట్లు కొనుక్కుని నాలుగుగంటలు ఎదురుచూసి బయల్దేరారు.వాళ్ళసిటీలోవర్షంపడిన
కారణంగా విమానం క్రిందికి దిగటానికి వెంటనే అనుమతి ఇవ్వలేదు.గంటసేపు పైనే చక్కర్లు కొట్టాడు.విమానంలో ఇంధనం 25%మాత్రమే మిగిలిఉంది.ఇంధనం అయ్యేలోపు అనుమతి ఇస్తేసరే వెనక్కు వెళ్ళటమో లేదా అత్యవసరంగా వాగుల్లోనయినా,ఎక్కడంటే అక్కడ దిన్చేస్తాముఅని ప్రకటించాడట.అందరూ భయపడ్డారట.
ఇలా జరుగుతుందేమిటి?ప్రయాణమంతా ఇబ్బందికరంగా,ఎప్పుడు ఏమిజరుగుతుందో తెలియని పరిస్థితిలాగా,దినదిన గండం నూరేళ్ళ ఆయుష్షు లాగా ఉంది అనుకొన్నారట.     

Friday, 21 February 2014

ఇంటర్వ్యూకి సిద్దం

        రోడ్రిక్ చదువు పూర్తిచేసుకుని ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు.ఒకపెద్దకంపెనీలో మంచిజీతంతో ఇంటర్వ్యూకి

పిలుపు వచ్చింది.రోడ్రిక్ వెళ్ళటానికి తయారవుతున్నాడు.ఇంతలో తల్లిదండ్రులిద్దరూ చెరొకప్రక్క వచ్చి నువ్వు

సరిగా తయారవలేదు.మేము తయారుచేస్తాము ఉండు అని కొడుకు వద్దన్నా వినిపించుకోకుండా తండ్రి

 తలదువ్వి,తల్లి చొక్కా గుండీలు  సరిచేసి,మొహానికి పౌడరు రాసి,ఖరీదుగల బూట్లు మార్పించి,బూటులేసులు

కట్టి,హంగామా చేసి ఇంటర్వ్యూకి సిద్దం చేసి పంపించారు.  

Thursday, 20 February 2014

తలుపులమ్మ

     లలిత ఊరు తునిదగ్గర రాజంపేట.ఆఊరిలో తలుపులమ్మ కొండపై కొలువై ఉంది.లలిత చిన్నప్పుడు ఇంకా అక్కడ గుడి కట్టలేదు.ఇప్పుడు చక్కటి గుడికట్టి చుట్టుప్రక్కల  అంతాబాగా అభివృద్ధి చేశారు.అప్పట్లో పగలు మాత్రమే గుడికి వెళ్ళేవాళ్ళు.సాయంత్రం అయితే కొండపైకి వెళ్ళేవాళ్ళు కాదు.అమ్మవారు
 రాత్రి కొండపై తిరుగుతుంటారని ప్రతీతి.ఒకసారి ఒకచంటిపిల్లను కొండపై మర్చిపోయి హడావిడిలో
కొండదిగి వచ్చారట.సాయంత్రంఅయింది కనుక మీరుపైకి వెళ్లొద్దు పిల్లను అమ్మవారే చూసుకొంటారు మీరు
కంగారుపడవలసిన పనిలేదు అని చుట్టుప్రక్కలవాళ్ళు చెప్పారట.వాళ్ళు అమ్మవారిమీద భారంవేసి ఆమెనుప్రార్ధిస్తూ క్రిందవుండి పోయారట.ఉదయమే కొండపైకి వెళ్లి చూసేసరికి చంటిపిల్ల అమ్మవారి ఒడిలో
ఆడుకొంటూ పాలు తాగుతుందట.పిల్లతల్లిదండ్రులు అమ్మవారికి కృతజ్ఞతలు తెలిపి వేనోళ్ళప్రార్దించి పిల్లను తెచ్చుకున్నారట.లలితను కూడా చిన్నప్పుడు ఒకసారి కొండపైన మర్చిపోయి క్రిందికిదిగివచ్చారట.కొంతదూరం
వచ్చినతర్వాత పిల్లలేదని గబగబా కొండపైకి వెళ్లి తెచ్చుకున్నారట.తలుపులమ్మ అనేపేరు పెట్టుకున్నారట.
తర్వాత లలితగా పేరు మార్చారట.మాఊరి తలుపులమ్మ తల్లి చాలా మహిమ కలదిఅని లలిత చెప్పింది.

సగం దానమివ్వొచ్చుగా?

       సాహితి,ఇంటిప్రక్కనావిడ పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు.మాటల్లో మీచేతిలోఉన్నసంచి ఏమిటి?
అని అడిగింది.మాబాబు నిన్న సెల్ ఫోను కొనుక్కున్నాడు .అవన్నీ సర్దుతూఉండగా మీరుపిలిచారు అందుకే
ఉందిఅని సాహితి చెప్పింది.ఎంతకి కొన్నారేమిటి?అంది.రేటు చెప్పగానే అదే అమెరికాలో అయితే సగంరేటుకే వచ్చేది.ఎవరినయినా అడిగి తెప్పించుకొని మిగిలిన సగండబ్బులు దానమివ్వొచ్చుగా?అంది.తనుఎంతమందికి
దానమిస్తుంది?దానమివ్వటానికి అర్హతఉండాలి తీసుకోవటానికి అర్హతఉండాలి.ఎవరి కష్టార్జితం వాళ్ళఅవసరాలు,
వాళ్లపిల్లల అవసరాలు చూసుకోకుండా దానమిచ్చేఅంత త్యాగబుద్ది ఎవరికిఉంటుంది?అమ్మా!ఆకలిఅనిఅడిగినా
అన్నంపెట్టరు,ఒక్కరూపాయి కూడా ఇవ్వనిరోజులు ఇవి.సాహితి బంధువులు అమెరికా నుండి వస్తుంటేకూడాఏమీ
తీసుకురమ్మని  అడగదు.ఏమయినా కావాలా?అని అడిగినా వద్దని చెప్పేస్తుంది.ఎందుకంటే ఎవరికివాళ్ళకే ఎన్నో తెచ్చుకోవలసినవి వుంటాయి.అక్కడ ఎక్కడో చవక అక్కడికివెళ్లి తీసుకురా ఇక్కడికి వెళ్లి తీసుకురా
అనటం సంస్కారమా?కనిపించినవాళ్ళను ముక్కూమొహం తెలియకపోయినా అదితీసుకురా ఇదితీసుకురా అనటంఏమిపద్ధతి?కొంతమందికి ఎదుటివాళ్ళను ఎంతబాగా ఉపయోగించుకోవాలి,వాళ్ళనుండి ఎంత రాబట్టాలి,
వాళ్ళతో ఎంతబాగాపనులు చేయించుకుందాం అనేఆలోచన తప్ప అది సంస్కారమా?కాదా?అనివుండదు.మన
పనిఅవటం ముఖ్యం అనుకొంటారు.      

తండ్రి అతిప్రేమ

       రవళి ఇంటి ఎదురుగా క్రొత్తగా ఒక ఫ్యామిలీ వచ్చింది.వాళ్ళ అబ్బాయికి సుమారుగా ఇరవై ఐదు ఏళ్ళు
ఉండొచ్చు.ఉదయం పదిగంటలకు చదువుకోవటానికో,ఉద్యోగానికో బయలుదేరాడు.ఇంతలో వాళ్ళనాన్నప్రధాన
ద్వారం దగ్గర ఆపేసి ఒకదువ్వెన తెచ్చి గబగబా తల దువ్వటం మొదలుపెట్టాడు.కొడుకు వద్దువద్దు అని చేతులు
అడ్డుపెట్టినా వినిపించుకోవటం లేదు.రవళి ఇంట్లో పనిమనిషి అమ్మా ఒకసారి తొందరగా బయటకు రండి అని పిలిచింది.ఏంటోనని బయటకు వెళ్లేసరికి చూడండమ్మా!ఆయన అంతపెద్ద అబ్బాయికి ఎలాతలదువ్వుతున్నారో?
అంది.అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు అయినా ఆయన అదేమీ పట్టించుకోవట్లేదు.తలపూర్తిగా దువ్వినతర్వాత   మాత్రమే వదిలాడు.ఆతండ్రి అతిప్రేమకు రవళికి నవ్వువచ్చింది.ముచ్చటేసింది.ఈరోజుల్లో అంత తీరికగా ఏతండ్రికొడుక్కి తలదువ్వుతున్నాడు?ఏకొడుకు దువ్వించుకుంటున్నాడు?చిన్నవిషయమే అయినావారి  ప్రేమానురాగాలను చెప్పుకోవచ్చు.

Wednesday, 19 February 2014

తాటక్కిమారి

         జస్వంతి బంధువులలో జానకి అనేఆమె ఉండేది.మధ్యాహ్నం ఖాళీగా ఉన్నప్పుడు అందరి ఇళ్ళకు
వెళ్ళేది.వెళ్ళినది కొంచెంసేపుకూర్చుని ఇంటికి వెళ్లకుండా అత్తమీద కోడలికి,కోడలిమీద అత్తకు ఉన్నవి,లేనివి చెప్పేది.
ఇంకొక ఇంటికివెళ్ళి వీళ్ళిద్దరి గురించి చెప్పేది.ఆప్రక్కింటికి వెళ్లి  నీగురించి అదిమాట్లాడారు,ఇదిమాట్లాడారని
అత్తాకోడళ్లమీద లేనిపోని నిందలు మోపేది.ఇటువంటివాళ్ళను తాటక్కిమారి అంటారు.జానకి సంగతితెలిసి
అందరూ ఆమె ఇంటికిరావటానికి,ఆమెతో మాట్లాడటానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు.జానకి ఇంటికి వస్తుందంటే చాలు తాటక్కిమారి వస్తంది  మనం ఇక్కడినుండి లోపలకువెళ్ళిపోదాం ఈమెతో మనకెందుకుఅని
పనివున్నట్లు లోపలికివెళ్లి బయటకు వచ్చేవాళ్ళు కాదు.కొంచెంసేపు బయటే కూర్చుని వెళ్ళిపోయేది.

మిరపకాయల సుబ్బయ్య

          జ్యోతిర్మయి ఊరిలో సుబ్బయ్య అని ఒకతను ఉండేవాడు.అతను ఒకసంవత్సరం పొలంలో మిరపపంట వేశాడు.మిరపకాయలు విరగకాసి బాగాలాభం వచ్చింది.అందుకని అతన్నిమిరపకాయల సుబ్బయ్య అంటారు.
ఎవరయినా క్రొత్తవాళ్ళు ఊరిలోకొచ్చిసుబ్బయ్య ఇల్లెక్కడ?అని అడిగితే ఎవరికీ తెలియదు.మిరపకాయల సుబ్బయ్య ఇల్లెక్కడ?అంటే చెప్పేవాళ్ళు.సుబ్బయ్య 6 1/2అడుగులు ఎత్తు,ఒకకన్ను లొట్టపోయి ఒకకన్నుతో  ఉండేవాడు.పొడవుకుతగినలావుతోబలంగా,మొద్దులా ఎప్పుడూఏదోఒకటి తింటూ,తాగుతూ  
ఉండేవాడు.పాదాలు పెద్దగాఉండేవి.చెప్పులు దొరికేవికాదు.పైగా పిసినారి.డబ్బులుఎక్కువపెట్టి కుట్టిన్చుకోవాల్సి
వస్తుందని చెప్పుల వాళ్ళతో కుట్టించుకునేవాడు కాదు.ఎండలో,వానలో అలాగే చెప్పులులేకుండా  తిరిగేవాడు.ఇతనిలోఉన్నమంచిగుణంఇతరులకు సహాయపడటం.ఇతనిలో ఉన్న దుర్గుణం
ఏమిటంటే ఊరిలో ఎవరికి మంచి సంబంధాలు వచ్చినా దారిలో కాపుకాచి మరీ వాళ్ళకారులోఎక్కి వీళ్ళమీద ఉన్నవి లేనివి అబద్దాలు చెప్పేవాడు.కొంతమంది నమ్మి నిజమేనేమో వాళ్ళఊరివాడే చెప్పాడుకదా!అనుకొనేవాళ్ళు.
 కొంతమంది మీఊరి పొడుగువాడు మాకు మీగురించి ఇలాచెప్పాడు అయినామేము పట్టించుకోలేదుఅని పెళ్లి
ఖాయపర్చుకోనేవాళ్ళు.ఇక ఊరిలో ఏసంబంధంచెడిపోయినా మిరపకాయల సుబ్బయ్యపనే అని తిట్టేవాళ్ళు.
ఒకసారి పొరుగూరివాళ్ళు ఇంటిమీదకొచ్చి పిచ్చికొట్టుడు కొట్టారు.ఊరిలోవాళ్ళు పోనీలే అని వదిలేసేవాళ్ళు.ఇక
అప్పటినుండి సంబంధాలు చెడగొట్టే అలవాటు కాస్త తగ్గించుకొన్నాడు.

Tuesday, 18 February 2014

ఆశ-నిరాశ

      సుశాంత్ మద్రాసులో ఉద్యోగంలో చేరాడు.తమిళం మాట్లాడటంరాదు కనుక నేర్చుకోవటానికి ఒకగురువు
దగ్గరకు వెళ్ళాడు.ఆగురువు కంప్యూటరులోని  కొన్నివాక్యాలు రాసుకొమ్మని వేగంగాచెప్పేసి అర్థమయిందో,లేదో
తెలుసుకోకుండా నాలుగువాక్యాలు అక్కడ రాయించి,నాలుగువాక్యాలు ఇంటికిచ్చి పొమ్మనేవాడు.అలారోజులు
గడుస్తున్నయికానీ తమిళం మాట్లాడలేకపోయాడు.అదేమంటే నువ్వు సాధన చెయ్యటంలేదు అనేవాడు.తరగతిలోనే ఎప్పటికప్పుడు సాధనచేయించి మాట్లాడమంటే వస్తుందికదా!నీకు బుర్రలేదు అనేవాడు.చిన్నపిల్లలే మాట్లాడతారు వాళ్ళప్రక్కన  కుర్చోపెడితే తెలుస్తుంది అని ఏదిపడితేఅది కుంటిమాటలు మాట్లాడేవాడు.ఇంతబ్రతుకు బ్రతికి డబ్బు ఇచ్చి ఎంత గురువయితే మాత్రం వీడితో అనిపించుకోవటం ఏమిటి?అని అందరూ తిట్టుకోనేవాళ్ళు.తను సరిగా సాధన చేయించకుండా నాలుగు కాగితాలు మొహానకొట్టి నేను అరటిపండు వలిచి చేతిలోపెట్టాను మీరే మాట్లాడటం
లేదు అనేవాడు.విద్యార్థుల్లో లోపంఉంటే సరయిన గురువు సరిచేయాలి.నేర్చుకుందామని గురువు దగ్గరకు వస్తే
శిష్యుడు ఎలాంటివాడినయినా సరిదిద్ది మంచివిద్యార్ధిగా బయటకుపంపటం గురువు కర్తవ్యం.పూర్వంరోజుల్లో
అలా చేసేవాళ్ళు.ఇప్పటి రోజుల్లో డబ్బు తీసుకోవటానికి ఉన్నశ్రద్ద నేర్పించటానికి లేదు.తెల్లారేసరికి  మేడలు
కట్టాలనే దురాలోచన,బిలియనీరు ఎలాఅవ్వాలనే తప్ప తనను నమ్మి వచ్చినవాళ్ళను త్వరగా మాట్లాడేలా చేద్దామనిలేదు.
కొంతమందిలో కొంతమందయినా మాట్లాడలేకపోతున్నారు అంటే భోదనాలోపం అని తెలుసుకుని,ఒప్పుకుని భోధనావిధానం మార్చుకుంటే మంచిదని సలహా.ఇంతకీ సుశాంత్ ఆశ నిరాశే అయ్యింది.ఒక్కసుశాంత్ మాత్రమే
కాదు ఆ గురువుదగ్గరకు వెళ్ళినవాళ్ళుఒక్కళ్ళు కూడా తమిళం స్పష్టంగా మాట్లాడలేకపోయారు.ఈరోజు డబ్బు
వచ్చింది అనుకోవటంకాదు ఆశతో వచ్చి నిరాశతో వెళ్ళిన వాళ్ళు ఇచ్చిన డబ్బుతో తిన్నది అరుగుతుందా?
ఇదంతా సుత్తి అనుకోవచ్చు అయినా ముందే సరయిన గురువును ఎంపిక చేసుకోవాలి.గురువుస్థానంలో
ఉందామనుకున్నవాళ్ళు కూడా  తగిన న్యాయం చేయదల్చుకుంటేనే ఉండాలి.         

కార్నివాల్స్

       అది ఒక అందమైన ద్వీపం.అక్కడ ఫిబ్రవరి,మార్చి నెలల్లో కార్నివాల్స్ జరుగుతాయి.ఇవి చూడటానికి
చుట్టుప్రక్కల విదేశీయులు ఎంతో ఉత్సాహంగా వస్తారు.సంవత్సరంలో ఒక్కరోజు 40డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది.
ఈరోజుకోసం వేరేదేశము నుండి మెత్తటి మట్టిని దిగుమతి చేసుకుంటారు.ఆమట్టితో ఒకళ్లనొకళ్ళు కొట్టుకుంటారు.
అది అక్కడి ఆచారము.ఆమట్టితో దెబ్బతగలదట.తెల్లగావున్న విదేశీయులు నల్లగాఅవటంకోసం ప్రత్యేకించి ఇక్కడకు వస్తారు.ఆఎండలో సముద్రంఒడ్డున పడుకొంటారు.కొంతమందికి ఆఎండకు బొబ్బలు వస్తాయి.అయినా
వాళ్ళకు అదొకసరదా.
             కార్నివాల్స్ ప్రత్యేకత ఏమిటంటే బ్యాండ్ ప్రదర్శనలు.ఈకలతో అందంగా అలంకరించుకుని ఎవరు మంచి సంగీతంతో కూడిన నృత్యంచేస్తే వాళ్లకు మిలియన్లడాలర్లు బహుమతిగాఇస్తారు.వీటికోసంఎప్పటినుండో సాధన
చేస్తూఉంటారు.మూడురోజులు ఈప్రదర్శనలు ఉంటాయి.బ్లిస్ బ్యాన్డులో ధనికులు,డాక్టర్లు,మంచి వృత్తుల్లో ఉన్న
వాళ్ళు పాల్గొంటారు.ఇలాపాల్గొనటం వాళ్ళఆచారమట.వయసుతో నిమిత్తంలేకుండా,వృత్తితో సంబంధం లేకుండా  పాల్గొంటారు.ఈప్రదర్శనలోగత 5సంవత్సరాలుగా ఒకేబ్యాండు బహుమతి గెలుచుకొంది.అక్కడి ప్రభుత్వం బహుమతి డబ్బు అందచేస్తుంది.మ్యాప్ ప్రకారము రోడ్లమీద ప్రదర్శనగా వెళ్తుంటారు.
 అందమైన,విచిత్రమైన వేషధారణలు,ప్రదర్శనలు చూడటానికి రెండుకళ్ళు చాలవన్నట్లుగా ఉంటాయి.వీటికోసం
విదేశీయులు ఎంతో ఉత్సాహంగా వస్తుంటారు.
           ఈకార్నివాల్స్ సందర్భంగా ఆసుపత్రులు కిటకిటలాడుతుంటాయి.ఎందుకంటే అందరూ దాదాపుగా ప్రదర్శనలో పాల్గొంటారు కనుక పెద్దవాళ్ళను ఆస్పత్రుల్లో చేర్చేస్తుంటారు.అక్కడ ప్రభుత్వాసుపత్రుల్లో సేవలన్నీ
ఉచితం.ఇంట్లోకన్నా కూడా చాలాబాగా చూస్తారు కనుక ఈసంబరాలన్నీ పూర్తయినతర్వాత ఇళ్ళకు తీసుకెళ్తారు.    

బ్రహ్మచారి పంతులుగారు

     నిఖిల ఊరికి చిన్నప్పుడు ఒకపంతులుగారు వచ్చి చిన్నపిల్లలకు చదువు చెప్తానని చెప్పాడు.సరేనని అరుగులమీద కూర్చున్న అమ్మలక్కలు వాళ్లపిల్లలను అతనిదగ్గరకు ప్రైవేటుకు పంపించారు.రెండురోజుల
తర్వాత మళ్ళీఅరుగుల దగ్గరకువచ్చి అమ్మానాకింకా పెళ్లికాలేదు వంటచేసుకోవటం కష్టంగా ఉంది.అన్నం
ఎలాగోలా వండుకుంటాను కూరలు పంపించండి అనిచెప్పాడు.సరేనని రోజుకొకళ్ళు కూరలు,చారు,పెరుగు,
పంపించటం మొదలెట్టారు.ఒకనెలరోజులు పోయాక ఆలోచించుకుంటే బ్రహ్మచారిపంతులు చదువు మాట
దేముడెరుగు సుష్టుగా తిని పిల్లలకు చదువు నేర్పకుండా నిద్రపోయి ఒళ్ళుచేశాడు.అమ్మలక్కలందరూ
సమావేశమై మనకు పనిఎక్కువైంది వీడికి సోమరితనం ఎక్కువైంది.అతన్నిమనఊరునుండి పంపించేద్దాము
అనినిర్ణయించుకుని అతని దగ్గరకువెళ్లి నాయనా!నువ్వు మాపిల్లలకు చదువు చెప్పక్కరలేదు ఇక్కడనుండి
వెళ్ళిపో అనిచెప్పారు.సరేనని అతను అక్కడనుండి బిచాణా ఎత్తేశాడు.అతనికి అదిఅలవాటేనని తర్వాత తెలిసింది.
ఇంకానయం నెలరోజులకే అర్థంచేసుకోగలిగాము అనిఅందరూ సంతోషించారు.

Wednesday, 12 February 2014

లాభం గూబల్లోకి

          విక్రాంతి,క్రాంతి ఇద్దరూకలిసి ఒకసారి ప్రయత్నించి చూద్దామని వ్యాపారం మొదలుపెట్టారు.రకరకాల ప్రయత్నాలు చేసినా అసలు రాకపోగా రవాణాఖర్చులు తడిసి మోపెడయ్యాయి.కాకపోతే ఎన్నోరకరకాల
మనస్తత్వాలను,ప్రజల మనోభావాలను అర్థం చేసుకున్నారు.మార్కెటింగ్ మెళుకువలు ఆకళింపు
చేసుకున్నారు.లాభం వచ్చినా రాకపోయినా వీళ్ళకు ఇదొక మంచి అనుభవ వేదిక.విక్రాంతి వాహనం పార్కింగ్
స్థలంలోపెట్టి లోపలకువెళ్లి వచ్చేటప్పటికి వేరేవాహనం పడేసి చొట్ట పోగొట్టేశాడు.దాన్నితీయించాలంటే చాలా
ఖర్చుఅవుతుంది.క్రాంతికూడా ఇంట్లోడబ్బు పోగొట్టుకుంది.వ్యాపారంలో కొంతనష్టపోయినప్పటికీ వాళ్ళు భాద
పడలేదుకానీ ఫై సంఘటనలకు చాలా భాదపడ్డారు.వ్యాపారం మాటేమోకానీ లాభం గూబల్లోకి వచ్చినట్లయింది
మన పరిస్థితి అనుకొన్నారు. 

Tuesday, 11 February 2014

చిన్న చిన్న కోరికలు

        పిల్లలకు చిన్నప్పుడు బొమ్మలు,తినటానికి క్రొత్తగాకనిపించినవి కొనుక్కోవాలనే చిన్నచిన్నకోరికలుతప్ప
పెద్ద పెద్ద కోరికలు ఉండవుకదా.చిన్న చిన్నకోరికలకు కూడా కొంతమంది తల్లిదండ్రులు విసుక్కుని,కసిరి మూర్ఖంగా  ప్రవర్తిస్తున్నారు.అమ్మాఆడుకోవటానికి బొమ్మ కొనిపెట్టవా?అనిఅడిగినా నాన్నా నాకుఆడ్రెస్సు నచ్చిందిఅనో,
నాకు తినటానికి,త్రాగటానికి ఫలానారకం కావాలి అని బ్రతిమిలాడినా వద్దు ఏమీ అక్కరలేదు పద వెళ్ళిపోదామని
లాక్కుని మరీ తీసుకెళ్తున్నారు.ఒకప్పుడయితే పిల్లలు అడగకుండానే అన్నీఅమర్చేవారు.కనీసం పిల్లలు కావాలి,
తింటాము అనిఅడిగినా కొనివ్వకుండా సంపాయించినడబ్బు పెద్దలు ఏమిచేస్తారు?చిన్నచిన్నకోరికలుతీర్చకపోతే
ఎలా?చిన్నమనసులు ఎంత భాదపడతాయి?కష్టపడి సంపాదించేది వాళ్ళకోసమేకదా?ఇలాఆలోచిస్తే వద్దు అని
ఖరాఖండిగా చెప్పరు.అడిగినవన్నీ కొనిపెట్టమని చెప్పటంలేదు కానీ కొన్నికొన్ని చూసీచూడనట్లుపోతే వాళ్ళకు,
మనకుసంతోషంగా ఉంటుంది.
    

మోసగత్తెలు

        అఖిల భారత వస్తుప్రదర్శనలో కొబ్బరినీళ్ళు,మామిడిరసం స్టాలులో మామిడిరసం 2సీసాలు ఇవ్వమని ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు.అవి తీసుకుని 1000రూ.ల నోటు ఇచ్చారు.ఆస్టాలుని ఇద్దరు అక్కచెల్లెళ్ళు చూసుకుంటారు.
చెల్లెలు 900రూ.లు చిల్లర తిరిగిఇచ్చింది.అయితే వచ్చినవాళ్లు మాకు ఈసీసాలు వద్దు మాడబ్బులు మాకు
ఇవ్వమన్నారు.చెల్లెలు 1000 ఇచ్చి 900చిల్లర తీసుకోవటం మర్చిపోయింది. ఇదంతా మరొకస్టాలు అతను
గమనించి మీడబ్బులు మీరు తిరిగి తీసుకున్నారా?అని అడిగాడు.అప్పుడు తీసుకోలేదని చెల్లెలుకి అర్థమయి
అడిగితే మేము ఇచ్చామని పెద్దగాఅరచి పోట్లాడటం మొదలుపెట్టారు.ప్రక్క స్టాలువాళ్ళు ఒకామె బొడ్లోపెట్టుకోవటం
గమనించి  ఆడబ్బులు లాక్కుని స్టాలువాళ్ళ డబ్బులు తిరిగిఇస్తేనే ఆ1000 ఇస్తానని గొడవ చేసేసరికి అప్పుడు
స్టాలువాళ్ళ డబ్బుతిరిగి ఇచ్చేసి రకరకాల శాపనార్థాలు పెట్టి వెళ్ళిపోయారు.ఈరోజు 1000రూ.లు నష్టపోవలసి వచ్చేది మీవలన నష్టపోలేదు అని అక్కచెల్లెళ్ళు వారికీ కృతజ్ఞతలు తెలిపారు    

Monday, 10 February 2014

మర్రిచెట్టు ఆంజనేయుడు

      లలిత భీమవరంలో పుట్టి పెరిగింది.లలిత చిన్నప్పుడు అమ్మవారివిగ్రహం నదిలోకొట్టుకొచ్చింది.అమ్మవారు

పూజారి కలలోకన్పించి తనకుగుడికట్టించి విగ్రహం ప్రతిష్టించమని చెప్పారట.అక్కడిప్రజలందరూ అలాగేగుడి

కట్టించి అమ్మవారిని ప్రతిష్టించారు.గుడిప్రాంగణంలో ఒకపెద్ద మర్రిచెట్టుఉంది.ఆమర్రిచెట్టు మొదలునుండి

  ఆంజనేయస్వామి ఆకారం ఏర్పడింది.ఆంజనేయస్వామి భక్తులకు కలలో కనిపించి స్వయంగా మర్రిచెట్టులో

వెలిసినట్లుగా చెప్పారట.అప్పటినుండి ఆంజనేయస్వామికి సింధూరపు రంగువేయించి అక్కడేస్వామిని

పూజించటం మొదలు పెట్టారట.లలిత మర్రిచెట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోవటానికి ఎక్కడెకక్కడి ప్రజలు

వస్తారని మహిమగల స్వామిఅని,మా అందరికీ చాలా నమ్మకమని,ఆంజనేయస్వామిని ఎంతో చక్కగా వర్ణించి

చెప్పింది.



































   

Thursday, 6 February 2014

రావిచెట్టు వినాయకుడు

         శ్యామ్ స్వంతఊరు విశాఖపట్టణం దగ్గర నాతవరం.ఆఊరిలో ఒకపెద్ద రావిచెట్టు ఉంది.ఆ పెద్ద రావిచెట్టు

 మొదలులో వినాయకుడు చక్కటి ఆకృతితో ఏర్పడ్డాడు.రావిచేట్టులో వినాయకుడు పెద్దపెద్ద కళ్ళతో,పెద్దపెద్ద

చెవులుతో ,పెద్ద తొండముతో వినాయకుడే స్వయంగా వచ్చిఅక్కడ కూర్చున్నట్లుగా అనిపిస్తుంది.అసలు

రావిచెట్టులోనే మొదలులో బ్రహ్మ,మధ్యలో విష్ణువు,చివర మహేశ్వరుడు ఉంటాడు అని ప్రతీతి.అందుకని

 త్రిమూర్తులు ఉంటారు కనుక శనివారం రావిచెట్టు చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తే సమస్త గ్రహ  దోషాలు కూడా

నివారించబడతాయని,మిగతా రోజుల్లో కూడా కనీసం 3 ప్రదక్షిణాలన్నా చేయటం మంచిదని పండితులు,

పెద్దలు చెపుతుంటారు.ఇక రావిచెట్టులో వినాయకుడు ఉన్నాడంటే ఆచెట్టు మహిమ గురించి చెప్పేదేముంది?

ఆఊరిప్రజలేకాక చుట్టుప్రక్కలనుండి కూడా ప్రజలు తండోపతండాలుగా విచ్చేసి దర్శనం చేసుకుంటూ ఉంటారు.

శ్యామ్ ఎంతో గర్వంగా తనఊరి గొప్పతనం చెప్పాడు.
  


Wednesday, 5 February 2014

ఇదేమి న్యాయం?

       మయూరి ఇంటిదగ్గర 60సంవత్సరాల భార్యాభర్తలు ఉంటారు.భార్య ఎవరితో ఎక్కువ మాట్లాడటం ఇష్టం
ఉండదు.ఆమెను మాట్లాడనీయకుండా అతనే ప్రక్కింటి ఆడవాళ్ళతో కూడా కల్పించుకుని మరీమాట్లాడతాడు.
ఇంట్లోఉన్నంతసేపు భార్యను దేనికోఒకదానికి పిలుస్తూ తనదగ్గరే ఉండాలంటాడు.ఎవరితో మాట్లాడనీయడు
ఎవరింటికీ వెళ్ళనివ్వడు.ఆమెకు పాటలు వ్రాయటం,పాడటం చాలాఇష్టం.ఆయనకు అది నచ్చేదికాదు.ఆమె
ఎవరికీ ఇబ్బంది కలుగకుండా అందరూ నిద్రపోయినతర్వాత వ్రాసుకునేది.ఎవరూ ఇంట్లోలేని సమయంలో
పాటలు పాడుకోనేది.గొంతు వినసొంపుగా ఉండేది.ఆయనభార్య ఎవరితో మాట్లాడకూడదు కానీ ఆయన
ప్రక్కింటివాళ్ళ భార్యలతో మాట్లాడొచ్చా?వాళ్ళిద్దరూ బానే చిలకగోరింకల్లాగా ఉంటారు.కానీ ఇదేమి న్యాయం?
ఇద్దరికీ ఒకటే న్యాయం ఉండాలికదా!తనుకూడా ఎవరితో మాట్లాడకూడదు.  

ఇంట్లో బడి

     మందాకిని ఇంట్లో బడి పెట్టినవాళ్ళ దగ్గరకు పిల్లలను కూడా ప్రైవేటుకు పంపించేదికాదు.ఎందుకంటే మగవాళ్లయితే వేరేపనులు చేసుకుంటూ శ్రద్దగా చెప్పకపోవటం,ఆడవాళ్ళయితే ఇంట్లో వంటచేసుకుంటూ
పిల్లలపనులు చూచుకోవటం,పిల్లలతో పనులు చేయించుకోవటం,ఏకాగ్రత లేకుండా చదువు చెప్తుంటారు.
అనుకోకుండా మందాకిని తెలిసికూడా ఇంట్లో బడికి వెళ్ళింది.వెళ్ళటంవలన చాలా నష్టపోయింది.
       టీచరమ్మ బాగాచేప్తానంటే నిజమని నమ్మింది.వెళ్ళినదగ్గరనుండి అడ్డమయినపనులు చేయించుకునేది.
పిల్లను రోజు బడినుండి తీసుకురమ్మనటం,నేను పిల్లబడికి వెళ్ళాలి,బ్యాంకుకు వెళ్ళాలి కొంచెందించండి అనేది.
వేగంగాచెప్పేసి 4వాక్యాలుఇచ్చిఅవి రాయమని,ఇంట్లోకివెళ్ళి ఏదోకటి తిని,తాగి కాసేపటికి వచ్చి కంప్యూటరు ముందు కూర్చుని ఫేసుబుక్ చూచుకొంటూ ఎవరువేగంగా చదవగలరోవాళ్ళను వాక్యాలు చదవమని ఒకేవాక్యాన్నిఒకసారి ఒకరకంగా,ఒకసారి ఒకరకంగా చెప్పేది.ఏది,ఎక్కడ,ఎందుకు ఉపయోగించాలని వివరంగా
చెప్పేదికాదు.ఏదిఒప్పో ఏదితప్పోతెలియక తికమకపడేవాళ్ళు.మళ్ళీఅడిగితే నేనుతప్పుచెపుతున్నానా?ఏమిటి?అనేది.ముందేడబ్బులు కట్టించుకోనేది.చెప్పినదానికన్నావీలయినంతఎక్కువరాబట్టేది.4వాక్యాలుఇంటికిఇచ్చి,
అమెచీర బాగుంది,ఈమెచీర బాగోలేదుఅంటూ 4అప్పలమ్మల కబుర్లుచెప్పి పంపించేది.వంటచేయబుద్దిఅయితే
4 అట్లువేసి అందరికీ వద్దన్న కొద్దీ బలవంతంగా పెట్టేది.ఇష్టంలేక పోయినా తప్పక తినాల్సివచ్చేది.దీనికోసంఇంత
దూరం కష్టపడి రావటం  ఎందుకని చాలామంది మానేసేవాళ్ళు.పీడావదిలారని సంతోషపడేది.ఎవరయినావచ్చినా ఏదోఒక కుంటిమాటలు మాట్లాడేది.పిల్లవచ్చిమీదపడి అల్లరిచేస్తుంటే విసుక్కోవటంతోనే సరిపోయేది.మందాకినితో అడ్డమయిన చాకిరిచేయించుకుని,డబ్బు,అన్నీఎక్కువేతీసుకున్నా,తనతల్లిని పచ్చళ్ళు పడతుందేమో అడగమన్నా వేరేవాళ్ళతో అమ్మిపెట్టించమన్నా,ఇవన్నీ తనకునచ్చకపోయినా ఎవరితోనూ చెప్పలేదు,ఆమెగురించి తప్పుగా
ఒక్కమాట మాట్లాడలేదు.అయినా శ్రుతిమించి కక్షతో తనగురించి మందాకిని ఎక్కడ చెప్తుందోననిభుజాలు తడుముకుని మందాకిని గురించి ఉన్నవి,లేనివి,తన అభిప్రాయాలూ కూడా కలిపి ఫోనుల్లో  అందరికీ ప్రచారం చేస్తుంది.అయినా ఇలాచెప్పినందువలన మందాకినికి ఏమీ నష్టంలేదు.మందాకిని కూడా ఆమెలాగే చెప్తే ఆమెకే నష్టం.గురువు స్థానంలో ఉండి మందాకినికి నష్టం,ఇబ్బంది కలిగించిందికానీ,తనడబ్బుముందే తీసుకుందికదా
ఇంకా కంటశోష ఎందుకు?ఇలాలేనిపోని అబద్దపు ప్రచారాలు చేయటం  ఎంతవరకు సబబు?ఇలా మీగురించి టీచరు ఫోనులో అందరికీ చెప్తుందిఅని మందాకినికి చెప్తున్నారు.మందాకిని పోనీలెండి,ఎవరుఏమిటి?అనేది దేముడికి తెలుసు ఆవిడ చెప్పిందని నేను ఆవిడగురించి ఏమీ చెప్పను.ఎవరు ఎవరిగురించి ఏదయినా చెప్పినా వినివదిలేయటమేకానీ విమర్శించను.ఎప్పుడయినా తెలియక ఏదయినాపాపంచేస్తే ఆపాపాన్నిఈవిధంగా
ఆవిడ నాగురించి చెప్పి నాపాపం కడిగేస్తున్నారులే నాకే పుణ్యం వస్తుందిలే అనిచెప్పింది.ఎవరి గురించయినా
అదేపనిగా వేరేవాళ్ళకు చెప్తుంటే ఎవరిగురించి మాట్లాడతారో వాళ్ళ పాపాలన్నీ పోగొట్టినట్లట.తనకు నమ్మకం ఉండకపోవచ్చు టీచరమ్మ కనుక కానీ ఇది నిజం.
 

Tuesday, 4 February 2014

ఇచ్చికాల బుచ్చిమ్మలు

         రాగిణి బంధువులలో కమలమ్మ అని ఒకామె ఉండేది.ఆమె వీళ్ళమీద వాళ్లకు వాళ్ళమీద వీళ్ళకు ఉన్నవి లేనివి కల్పించిచెపుతూ ఉండేది.ఎదురుగా కూర్చుని ఉండగానే గుసగుస చెప్పేది.ఇద్దరికీ ఒకళ్లమీద ఒకళ్ళకు ఏమీ అనకుండానే అన్నట్లుగా ఆమెఅభిప్రాయం వీళ్ళమీద రుద్దిచెప్పేది.అమె మాటలు విన్నవాళ్ళుమాట్లాడుకోవటం
మానేసేవాళ్ళు లేదా తగువు పెట్టుకొనేవాళ్ళు.కొంత మంది పిచ్చిది తెలిసి తెలియక ఇష్టం వచ్చినట్లు
ఏదోవాగుతుంది వదిలేద్దాంఅనుకొనేవాళ్ళు.తెలివిగలవాళ్ళయితే చెప్పుడుమాటలువినరు.ఆమెసంగతితెలుసు
కనుక ఎవరూ ఆమెచెప్పినది నమ్మేవాళ్ళుకాదు.రోజులు మారినాయికదా ఇంకొకామె పనికట్టుకుని తనను  మంచిది అనుకొంటారని ఫోన్లుచేసిమరీ ఫలానాఆమె నీగురించి అలాచెప్పింది,ఇలాచెప్పింది ఆమెతోమాట్లాడకు
అంటూ చెప్పటం మొదలు పెట్టింది.లేచింది మొదలు పైఇద్దరు ఎన్నో భాదలుపడుతూ కూడా ఎదుటివాళ్ళమీద
కాకరకాయకబుర్లు చెప్పటం మానుకోరు.ఇలా ఒకళ్ళమీద ఒకళ్ళకు పితూరీలు,కల్పితాలు చెప్పేవాళ్ళను ఇచ్చికాల బుచ్చిమ్మలు అంటారు.కమలమ్మ చదువుకోకపోవటం వలన అజ్ఞానంతో అలాచెప్తుంది.రెండో ఆమె చదువుకున్న అజ్ఞాని.ఇద్దరికీ తేడా ఏమాత్రములేదు.ఇద్దరు చేసేపని ఒకటే.ఎవరైనా తెలియక ఒకటిలేదారెండుసార్లు వింటారు.వీళ్ళ నోరునొప్పి,ఫోనుడబ్బు దండగ,వీళ్ళవిలువ పోగొట్టుకోవటంతప్ప ఉపయోగం ఏమీఉండదు అని అర్ధంచేసుకొంటే
బావుంటుంది.      

Saturday, 1 February 2014

కంట్లో కనుమాయ

      ఒకసంస్థ తరఫున వ్యాపారవృద్ధికోసం తయారీదారులు స్టాళ్లు పెట్టుకొన్నారు.అయితే కొంతమంది కొనటానికి
వచ్చినట్లుగా నటించి అదిఏమిటి?ఇదిఏమిటి?అనిఅడిగి ఒకళ్ళు మాటల్లోపెట్టి రెండోవాళ్ళు ఏదోఒకటి తీసుకుని
ఉడాయిస్తున్నారు.స్టాలువాళ్ళు ఇద్దరు ఉన్నాసరే కంట్లో కనుమాయగా తీసుకువెళ్తున్నారు.కొబ్బరినీళ్ళు చిన్న
చిన్నసీసాల్లో సేలువేసి అమ్ముతున్నారు.6సీసాలు ఉన్నపాకెట్ తీసుకెళ్ళారు.ఇంకొకళ్ళదగ్గర సున్నుండలు
3 పాకెట్లు తీసుకెళ్ళింది.అలాగే బల్బులు ఖరీదయినవి రెండు తీసుకెళ్ళారు.ఒకరోజు కాలేజి విద్యార్థిని బాదంపాలుకావాలని అడిగి రెప్పపాటులో పట్టుకుని వెళ్ళిపోయింది వెనుకే వెళ్లేసరికి ఏటో పారిపోయింది.
ఇలారోజుకొకటి మాయమైపోతుంది.