రాగిణి బంధువులలో కమలమ్మ అని ఒకామె ఉండేది.ఆమె వీళ్ళమీద వాళ్లకు వాళ్ళమీద వీళ్ళకు ఉన్నవి లేనివి కల్పించిచెపుతూ ఉండేది.ఎదురుగా కూర్చుని ఉండగానే గుసగుస చెప్పేది.ఇద్దరికీ ఒకళ్లమీద ఒకళ్ళకు ఏమీ అనకుండానే అన్నట్లుగా ఆమెఅభిప్రాయం వీళ్ళమీద రుద్దిచెప్పేది.అమె మాటలు విన్నవాళ్ళుమాట్లాడుకోవటం
మానేసేవాళ్ళు లేదా తగువు పెట్టుకొనేవాళ్ళు.కొంత మంది పిచ్చిది తెలిసి తెలియక ఇష్టం వచ్చినట్లు
ఏదోవాగుతుంది వదిలేద్దాంఅనుకొనేవాళ్ళు.తెలివిగలవాళ్ళయితే చెప్పుడుమాటలువినరు.ఆమెసంగతితెలుసు
కనుక ఎవరూ ఆమెచెప్పినది నమ్మేవాళ్ళుకాదు.రోజులు మారినాయికదా ఇంకొకామె పనికట్టుకుని తనను మంచిది అనుకొంటారని ఫోన్లుచేసిమరీ ఫలానాఆమె నీగురించి అలాచెప్పింది,ఇలాచెప్పింది ఆమెతోమాట్లాడకు
అంటూ చెప్పటం మొదలు పెట్టింది.లేచింది మొదలు పైఇద్దరు ఎన్నో భాదలుపడుతూ కూడా ఎదుటివాళ్ళమీద
కాకరకాయకబుర్లు చెప్పటం మానుకోరు.ఇలా ఒకళ్ళమీద ఒకళ్ళకు పితూరీలు,కల్పితాలు చెప్పేవాళ్ళను ఇచ్చికాల బుచ్చిమ్మలు అంటారు.కమలమ్మ చదువుకోకపోవటం వలన అజ్ఞానంతో అలాచెప్తుంది.రెండో ఆమె చదువుకున్న అజ్ఞాని.ఇద్దరికీ తేడా ఏమాత్రములేదు.ఇద్దరు చేసేపని ఒకటే.ఎవరైనా తెలియక ఒకటిలేదారెండుసార్లు వింటారు.వీళ్ళ నోరునొప్పి,ఫోనుడబ్బు దండగ,వీళ్ళవిలువ పోగొట్టుకోవటంతప్ప ఉపయోగం ఏమీఉండదు అని అర్ధంచేసుకొంటే
బావుంటుంది.

No comments:
Post a Comment