సుశాంత్ మద్రాసులో ఉద్యోగంలో చేరాడు.తమిళం మాట్లాడటంరాదు కనుక నేర్చుకోవటానికి ఒకగురువు
దగ్గరకు వెళ్ళాడు.ఆగురువు కంప్యూటరులోని కొన్నివాక్యాలు రాసుకొమ్మని వేగంగాచెప్పేసి అర్థమయిందో,లేదో
తెలుసుకోకుండా నాలుగువాక్యాలు అక్కడ రాయించి,నాలుగువాక్యాలు ఇంటికిచ్చి పొమ్మనేవాడు.అలారోజులు
గడుస్తున్నయికానీ తమిళం మాట్లాడలేకపోయాడు.అదేమంటే నువ్వు సాధన చెయ్యటంలేదు అనేవాడు.తరగతిలోనే ఎప్పటికప్పుడు సాధనచేయించి మాట్లాడమంటే వస్తుందికదా!నీకు బుర్రలేదు అనేవాడు.చిన్నపిల్లలే మాట్లాడతారు వాళ్ళప్రక్కన కుర్చోపెడితే తెలుస్తుంది అని ఏదిపడితేఅది కుంటిమాటలు మాట్లాడేవాడు.ఇంతబ్రతుకు బ్రతికి డబ్బు ఇచ్చి ఎంత గురువయితే మాత్రం వీడితో అనిపించుకోవటం ఏమిటి?అని అందరూ తిట్టుకోనేవాళ్ళు.తను సరిగా సాధన చేయించకుండా నాలుగు కాగితాలు మొహానకొట్టి నేను అరటిపండు వలిచి చేతిలోపెట్టాను మీరే మాట్లాడటం
లేదు అనేవాడు.విద్యార్థుల్లో లోపంఉంటే సరయిన గురువు సరిచేయాలి.నేర్చుకుందామని గురువు దగ్గరకు వస్తే
శిష్యుడు ఎలాంటివాడినయినా సరిదిద్ది మంచివిద్యార్ధిగా బయటకుపంపటం గురువు కర్తవ్యం.పూర్వంరోజుల్లో
అలా చేసేవాళ్ళు.ఇప్పటి రోజుల్లో డబ్బు తీసుకోవటానికి ఉన్నశ్రద్ద నేర్పించటానికి లేదు.తెల్లారేసరికి మేడలు
కట్టాలనే దురాలోచన,బిలియనీరు ఎలాఅవ్వాలనే తప్ప తనను నమ్మి వచ్చినవాళ్ళను త్వరగా మాట్లాడేలా చేద్దామనిలేదు.
కొంతమందిలో కొంతమందయినా మాట్లాడలేకపోతున్నారు అంటే భోదనాలోపం అని తెలుసుకుని,ఒప్పుకుని భోధనావిధానం మార్చుకుంటే మంచిదని సలహా.ఇంతకీ సుశాంత్ ఆశ నిరాశే అయ్యింది.ఒక్కసుశాంత్ మాత్రమే
కాదు ఆ గురువుదగ్గరకు వెళ్ళినవాళ్ళుఒక్కళ్ళు కూడా తమిళం స్పష్టంగా మాట్లాడలేకపోయారు.ఈరోజు డబ్బు
వచ్చింది అనుకోవటంకాదు ఆశతో వచ్చి నిరాశతో వెళ్ళిన వాళ్ళు ఇచ్చిన డబ్బుతో తిన్నది అరుగుతుందా?
ఇదంతా సుత్తి అనుకోవచ్చు అయినా ముందే సరయిన గురువును ఎంపిక చేసుకోవాలి.గురువుస్థానంలో
ఉందామనుకున్నవాళ్ళు కూడా తగిన న్యాయం చేయదల్చుకుంటేనే ఉండాలి.

No comments:
Post a Comment